బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్‌.. అత‌డి భ‌య‌మే నిజ‌మైంది! | Bigg Boss Telugu 7: Tasty Teja Eliminated for BB Show In 9th Week | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: శోభ సేఫ్‌, తేజ ఎలిమినేట్‌.. చేసిన పాపం ఊరికే పోతుందా?

Nov 4 2023 6:43 PM | Updated on Nov 4 2023 8:41 PM

Bigg Boss Telugu 7: Tasty Teja Eliminated for BB Show In 9th Week - Sakshi

ప్ప‌టినుంచి ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నాడు తేజ‌. చివ‌ర‌కు అత‌డు అనుకున్న‌ట్లే జ‌రిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ ప్ర‌యాణం ముగి

బిగ్‌బాస్ హౌస్‌లో ప్ర‌స్తుతం 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌత‌మ్‌, ప్ర‌శాంత్‌, అశ్విని మిన‌హా మిగ‌తా అంద‌రూ నామినేష‌న్స్‌లో ఉన్నారు. ఈసారి ఎలిమినేష‌న్ గురిం శోభా మీదే ఉంది. నిజానికి ఆమె గ‌త‌వార‌మే ఎలిమినేట్ అవుతుంద‌ని అంతా ఊహించారు. కానీ బిగ్‌బాస్ వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ సందీప్‌ను పంపించేసి ఆమెను హౌస్‌లో ఉంచేశాడు. ఈసారి కూడా బిగ్‌బాస్ అదే ప్లాన్ అమ‌లు చేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. త‌న కోసం మ‌రో కంటెస్టెంట్‌ను బ‌లి చేస్తున్నార‌ట‌.. ఇంత‌కీ ఆ కంటెస్టెంట్ మ‌రెవ‌రో కాదు.. శోభా జిగిరీ దోస్త్ టేస్టీ తేజ‌.

ఎలిమినేష‌న్స్ అంటేనే బెంబేలెత్తిపోతాడు తేజ‌. ఎవ‌రైనా నామినేట్ చేస్తే నేనే పాపం చేశాను? న‌న్నెందుకు నామినేట్ చేశారు? అన్న‌ట్లుగా అమాయ‌కంగా ఎక్స్‌ప్రెష‌న్ ఇస్తాడు. కానీ ఇత‌డు మాత్రం వేరేవాళ్ల‌ను చెత్త కార‌ణాల‌తో నామినేట్ చేస్తుంటాడు. నిద్ర‌పోతున్న‌ త‌న‌మీద నాలుగు చుక్క‌ల నీళ్లు చిల‌క‌రించింద‌ని పూజాను నామినేట్ చేసి త‌న‌ను బ‌య‌ట‌కు పంపించేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌, నామినేష‌న్స్‌లోకి వ‌స్తే ఆత్మ‌స్థైర్యం పెరుగుతుంది.. అదీ ఇదీ అంటూ సందీప్ మాస్ట‌ర్‌ను ఆకాశానికి ఎత్తేసి అవ‌త‌ల‌కు తోసేశాడు.

నామినేష‌న్స్‌లో సిల్లీ రీజ‌న్స్ చెప్పొద్దు అని అంద‌రూ మొత్తుకున్నా తేజ త‌న తీరు మార్చుకోలేదు. గ‌త‌వారం సందీప్‌ను ఏ కార‌ణంతో అయితే నామినేట్ చేశాడో అదే కార‌ణంతో అర్జున్‌ను నామినేట్ చేశాడు. ఇలా సిల్లీ రీజ‌న్స్ వ‌ద్దని వార్నింగ్ ఇస్తూ తేజను నామినేట్ చేశాడు శివాజీ. అప్ప‌టినుంచి ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానోన‌ని భ‌యంతో వ‌ణికిపోతున్నాడు తేజ‌. చివ‌ర‌కు అత‌డు అనుకున్న‌ట్లే జ‌రిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ ప్ర‌యాణం ముగిసిన‌ట్లు తెలుస్తోంది. ఒక‌ర‌కంగా శోభ కోసం తేజ ఎలిమినేట్ అయిపోయాడు!

చ‌ద‌వండి: శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్‌

Advertisement
 
Advertisement
Advertisement