వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమ‌ర్‌పై మ‌ళ్లీ విషం క‌క్కిన శివాజీ | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: తేజ వ‌ల్ల ల‌వ్ బ్రేక‌ప్ అవుతుందన్న భ‌యంలో శోభా.. ప్రియుడిని త‌ల్చుకుని ఎమోష‌న‌ల్‌

Published Wed, Nov 1 2023 11:38 PM

Bigg Boss Telugu 7: Shobha Shetty Worried About Boyfriend - Sakshi

కెప్టెన్ గౌత‌మ్ హౌస్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడ‌పిల్ల‌లు ప‌నే చేయ‌క్క‌ర్లేద‌ని బంపరాఫ‌ర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేష‌న్స్ ప్ర‌క్రియ పూర్త‌వ‌డంతో కెప్టెన్సీ కంటెండ‌ర్ రేసు మొద‌లుపెట్టాడు బిగ్‌బాస్‌. మ‌రి నేటి (న‌వంబ‌ర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చ‌దివేయండి..

మ‌ళ్లీ విషం క‌క్కిన శివాజీ
బ‌ద్ద‌క‌స్తుడైన‌ తేజ శ‌వాస‌నం వేస్తూ నేల‌కు అతుక్కుపోయాడు. ఇది గమ‌నించిన‌ బిగ్‌బాస్ తేజ‌కు ఏదైనా శిక్ష వేయ‌మ‌ని కెప్టెన్‌ను ఆదేశించాడు. కెప్టెన్ గౌత‌మ్‌.. తేజ అమ్మాయిలా చీర క‌ట్టుకోవాల‌ని చెప్పాడు. ఇంకేముంది, శోభ‌.. అత‌డికి చీర క‌ట్టి రెడీ చేసింది. ఇదే అద‌ను అనుకున్న తేజ‌.. అంద‌రు అమ్మాయిల‌కు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్ద‌మ‌నిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్ప‌టిలాగే అమ‌ర్‌పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చిన‌ట్లు మాట్లాడాడు. ప్ర‌తి సీజ‌న్‌లో అంద‌రూ క‌లిసి ఒక‌ర్ని హీరోను చేస్తే ఈ సీజ‌న్‌లో న‌న్ను విల‌న్‌ను చేశారు అని త‌న‌కు తానే అనుకున్నాడు అమ‌ర్‌.

చాలెంజ్ విసిరిన బిగ్‌బాస్‌
త‌ర్వాత బిగ్‌బాస్‌.. ఈ వారం కెప్టెన్సీ కంటెండ‌ర్ అయ్యేందుకు ఓ గేమ్‌ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిస‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విభ‌జించాడు. వీర‌సింహాలు టీమ్‌లో యావ‌ర్‌, గౌత‌మ్‌, భోలె, తేజ‌, శోభా, ర‌తిక ఉండ‌గా మిగిలిన‌వారంతా గ‌ర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. మొద‌ట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించ‌లేదు. త‌ర్వాత ప‌వ‌ర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్‌కు ఒక స్పెష‌ల్ ప‌వ‌ర్ ల‌భిస్తుంద‌ని చెప్పాడు. 

మొద‌టి చాలెంజ్‌కే రైతుబిడ్డ అవుట్‌
మొద‌ట జంపింగ్ జ‌పాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీర‌సింహాలు టీమ్ గెలవ‌డంతో వీరికి అవ‌త‌లి టీమ్‌లో ఒక‌రిని గేమ్ నుంచి తొల‌గించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అంద‌రూ చ‌ర్చించుకుని ప్ర‌శాంత్‌ను గేమ్ నుంచి సైడ్ చేశారు. త‌న‌ను ఆట‌లో నుంచి ప‌క్క‌కు తోసేయ‌డంతో రైతుబిడ్డ కంట‌త‌డి పెట్టుకున్నాడు. శివాజీ త‌న చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్ర‌శాంత్ మెడ‌లో వేశాడు. అయితే ప్ర‌శాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు.

ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ‌
మ‌రోవైపు శోభ త‌న ప్ర‌వ‌ర్త‌న మీద త‌నే డౌట్ ప‌డింది. బ‌య‌ట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు న‌న్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజ‌తో క‌బుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్‌.. అర్థం చేసుకుంటాడు.. కానీ న‌మ్మ‌కంతో పాటు భ‌యం కూడా ఉంది. ఒక‌వేళ వాడికి న‌చ్చ‌న‌ట్లు  ఏమైనా ప్ర‌వ‌ర్తించానా?  నీ విష‌యంలో వేరేలా ఉన్నాను. అది త‌న‌కు న‌చ్చ‌క‌పోవ‌చ్చేమో.. ఎవ‌రికి తెలుసు? అయినా ఏమీ అవ‌ద‌నే అనుకుంటున్నాను. పొర‌పాటున ఏదైనా జ‌రిగితే నేనస‌లు త‌ట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ‌ ఏడ్చేసింది. ఇక రేప‌టి ఎపిసోడ్‌లో మిగ‌తా చాలెంజ్‌లు ఎవ‌రు గెలిచారు? ఎవ‌రు కెప్టెన్సీ కంటెండ‌ర్స్ అయ్యార‌నేది చూడాలి!

చ‌ద‌వండి: లావ‌ణ్య మెడ‌లో మూడు ముళ్లు వేసిన వ‌రుణ్ తేజ్‌

Advertisement
 
Advertisement
 
Advertisement