ఆట‌లో రైతుబిడ్డ ఔట్‌.. ప్ర‌శాంత్ మెడ‌లో డెడ్‌బోర్డు వేసిన శివాజీ | Bigg Boss Telugu 7 Day 59 Promo : Jumping Japang And Hall Of Ball Tasks For Contestants - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: గౌత‌మ్ మాస్ట‌ర్ మైండ్‌.. రైతుబిడ్డ అవుట్‌.. ఏడ్చేసిన ప్ర‌శాంత్‌

Nov 1 2023 6:40 PM | Updated on Nov 1 2023 9:03 PM

Bigg Boss Telugu 7: Jumping Japang, Hall of Ball Tasks for Contestants - Sakshi

గౌత‌మ్ త‌న మాస్ట‌ర్ మైండ్‌ను ఉప‌యోగించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ప్ర‌శాంత్‌ను ఆట నుంచి సైడ్ చేశాడు. ప్ర‌శాంత్‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో శివాజీ అ

నామినేష‌న్స్‌తో బిగ్‌బాస్ హౌస్ వేడెక్కిపోయింది. ఈ పోట్లాట‌లు చాలు.. ఆట మొద‌లుపెడ‌దాం అనుకున్నాడు బిగ్‌బాస్‌. ఈ వారం ఇంటిస‌భ్యుల‌ను రెండు టీమ్‌గా విడగొట్టి టాస్కులు పెడుతున్నాడు.  ఈ క్ర‌మంలో మొద‌ట బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక టీమ్ నుంచి తేజ‌, ప్రిన్స్ యావ‌ర్ వ‌స్తే మ‌రో టీమ్ నుంచి అర్జున్‌, ప్ర‌శాంత్ వ‌చ్చి ఆడారు. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మ‌ధ్య చిన్న‌గొడ‌వ జ‌రిగిన‌ట్లు క‌నిపిస్తోంది.

ఇంత‌లో బిగ్‌బాస్ లెట‌ర్ పంపించాడు. గెలిచిన టీమ్‌.. అవ‌త‌లి టీమ్‌లో నుంచి ఒక ఆట‌గాడిని గేమ్ నుంచి త‌ప్పించ‌వ‌చ్చ‌ని పేర్కొన్నాడు. వారి మెడ‌లో డెడ్ బోర్డ్ వేయాల‌న్నాడు. దీంతో గౌత‌మ్ త‌న మాస్ట‌ర్ మైండ్‌ను ఉప‌యోగించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ప్ర‌శాంత్‌ను ఆట నుంచి సైడ్ చేశాడు. ప్ర‌శాంత్‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని నిర్ణ‌యించ‌డంతో శివాజీ అత‌డి మెడ‌లో డెడ్ బోర్డ్ వేశాడు. అయితే మొద‌టి టాస్కులోనే త‌న‌ను త‌ప్పించ‌డంతో ప్ర‌శాంత్ కంట‌త‌డి పెట్టుకున్నాడు.

రైతుబిడ్డ‌ను ఓదార్చిన అర్జున్‌.. ఒక‌ర‌కంగా దీనివ‌ల్ల పాపులారిటీ పెరుగుతుందిలే అని స‌ముదాయించాడు. అశ్విని అయితే.. వాడు మంచిగా ఆడుతున్నాడ‌ని అంద‌రూ కుళ్లుకుని తీసేశారని అభిప్రాయ‌ప‌ప‌డింది. మ‌రోప‌క్క తేజ‌ను అమ్మాయిగా రెడీ చేశారు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న తేజ అమ్మాయిల‌ను హ‌గ్ చేసుకోవ‌డానికి పోటీప‌డ్డాడు. ఇక రానున్న గేమ్స్‌లో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌ర్ని సైడ్ చేస్తార‌నేది చూడాలి!

చ‌ద‌వండి: ఈ వారం నామినేషన్లో ఉంది వీళ్లే

Advertisement
 
Advertisement
Advertisement