బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు ముహూర్తం ఫిక్స్‌.. ఆరోజే శుభం కార్డు! | Bigg Boss Telugu 7 Grand Finale to be Held on 17th December 2023 | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: ఆరోజే బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలే.. ఈసారి టాప్‌ 5 కాదు టాప్‌ 7..

Nov 23 2023 7:02 PM | Updated on Nov 25 2023 3:49 PM

Bigg Boss Telugu 7 Grand Finale to be Held on 17th December 2023 - Sakshi

ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. అంతా ఉల్టా పల్టా కాబట్టి గ్రాండ్‌ ఫినాలేకు ఏడుగురు హౌస్‌మేట్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయట! అంటే ఫైనల్‌లో టాప్‌ 5కి

గత కొన్ని సంవత్సరాలుగా బిగ్‌బాస్‌ షో గతి తప్పింది. ఒకప్పుడు ఫుల్‌ క్రేజ్‌ ఉన్న ఈ రియాలిటీ షోకి రానురానూ ఆదరణ తగ్గిపోతూ వస్తోంది. అయితే ఈసారి పరిస్థితి కొంత మెరుగుపడిందనే చెప్పవచ్చు. కొంత మెరుగైన కంటెస్టెంట్లను తీసుకురావడం.. కొత్త కొత్త టాస్కులు ప్రవేశపెట్టడంతో షో కాస్త ఆకర్షణీయంగా మారింది. మొదట 14 మంది కంటెస్టెంట్లతోనే షో ప్రారంభమైంది. సరిగ్గా నెల రోజుల తర్వాత మరో ఐదుగురు కంటెస్టెంట్లను రంగంలోకి దించారు.

సీజన్‌ ఉల్టా పల్టా కాబట్టి.. టాప్‌ 7
అలా ఈ సీజన్‌లో 19 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో 10 మంది అమ్మాయిలు కాగా ఇప్పటికే ఆరుగురు తట్టా బుట్టా సర్దేసుకుని వెళ్లిపోయారు. మొత్తంగా హౌస్‌లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఈసారి బిగ్‌బాస్‌ సీజన్‌ 7.. అంతా ఉల్టా పల్టా కాబట్టి గ్రాండ్‌ ఫినాలేకు ఏడుగురు హౌస్‌మేట్స్‌ను తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయట! అంటే ఫైనల్‌లో టాప్‌ 5కి బదులుగా టాప్‌ 7 కంటెస్టెంట్లు ఉంటారన్నమాట! ఇక గ్రాండ్‌ ఫినాలేకు డిసెంబర్‌ 17న ముహూర్తం ఫిక్స్‌ చేశారని టాక్‌ వినిపిస్తోంది.

ఆ రోజే గ్రాండ్‌ ఫినాలే!
ఇదే నిజమైతే ప్రస్తుతం ఉన్నవాళ్లలో ముగ్గురు ఎలిమినేట్‌ అవగా మిగిలినవారందరికీ ఫినాలేలో బెర్త్‌ కన్‌ఫార్మ్‌ అయినట్లే! నిజానికి ఈసారి బిగ్‌బాస్‌ రసవత్తరంగా ఉండటంతో షోను మరికొద్ది వారాలు పొడిగించాలనుకున్నట్లు ప్రచారం జరిగింది కానీ తాజాగా ఆ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరి బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే వచ్చే నెల 17వ తేదీనే ఉండనుందా? ఈసారి ఏడుగురు కంటెస్టెంట్లు ఫినాలేలో అడుగుపెట్టనున్నారా? లేదా? అనేది నాగార్జున అధికారికంగా ప్రకటించేవరకు వేచి చూడాలి!

చదవండి: బిగ్‌బాస్‌ ఆఫర్‌, ఖరీదైన కారు గిఫ్ట్‌.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క
డాక్టర్‌ బాబు మాస్టర్‌ మైండ్‌.. షాకైన శివాజీ, రైతుబిడ్డ.. ఇదే కంటిన్యూ అయితే టాప్‌ 5!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement