Bigg Boss 7 Telugu: డాక్టర్‌ బాబు మాస్టర్‌ మైండ్‌.. షాకైన శివాజీ, రైతుబిడ్డ.. ఇదే కంటిన్యూ అయితే టాప్‌ 5!

Bigg Boss Telugu 7: Gautham Krishna used Mastermind in BB Mansion Task - Sakshi

సీక్రెట్‌ టాస్క్‌ అంటే అర్థమేంటి? ఎవరికీ తెలియకుండా టాస్క్‌ పూర్తి చేయాలి. కానీ అపర చాణక్యుడిలా బిల్డప్‌ ఇచ్చే శివాజీకి ఈ ముక్క తెలియకపోవడమేంటో! ప్రశాంత్‌ మిర్చి మొక్కను పోస్ట్‌ డబ్బాలో దాచేయమని శివాజీకి సీక్రెట్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అయితే మొక్కను ఎలా దాచేయాలో పక్కనపెట్టి ముందుగా ప్రశాంత్‌ను ఓ గదిలో పెట్టి బంధించాడు. గేమ్‌లో అతడిని చంపేస్తున్నట్లు చెప్పి ఆ తర్వాత తీరికగా మొక్కను దాచాడు.

ఖంగు తిన్న రైతుబిడ్డ
ఎవరికీ ఏ అనుమానం రాలేదేమో కానీ గౌతమ్‌ మాత్రం ఈజీగా పసిగట్టేశాడు. ప్రశాంత్‌ను డెడ్‌ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్‌ అతడిని దెయ్యంలా తెల్లబట్టలు వేసుకుని తిరగమన్నాడు. ఈ క్రమంలో దెయ్యంలా ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్‌ను శివాజీ అన్ననే చంపాడు కదరా నిన్ను అని అడిగేశాడు. అతడి మాటతో ఖంగు తిన్న రైతుబిడ్డ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గౌతమ్‌ కృష్ణ తెలివితేటలను మాత్రం సోషల్‌ మీడియాలో కొనియాడుతున్నారు. పోలీసుల కన్నా ముందే పసిగట్టేశాడని మెచ్చుకుంటున్నారు. 

హంతకుడిని పసిగట్టిన గౌతమ్‌
అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లోనూ హోటల్‌ మేనేజర్‌ పాత్రలో ఉన్న శివాజీయే బిగ్‌బాస్‌ భార్యను హత్య చేసి ఉంటాడని క్లూ ఇచ్చాడు. నిజానికి ప్రశాంత్‌ను డెడ్‌ చేయాలన్న సీక్రెట్‌ టాస్క్‌తో పాటు బిగ్‌బాస్‌ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అటు గౌతమ్‌ ఆ రెండు పాయింట్లను కరెక్ట్‌గా గెస్‌ చేసి తనది మాస్టర్‌మైండ్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. కాగా మొదటి నుంచీ ఏ గ్రూపులోనూ చేరకుండా సింగిల్‌గా ఆడుతున్నాడు గౌతమ్‌. శివాజీ తప్పు చేశాడనిపించినప్పుడల్లా ధైర్యంగా ఎదురెళ్తున్నాడు. ఈ లక్షణాలే గౌతమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే ఆట కొనసాగిస్తే అతడు టాప్‌ 5లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శివాజీ ఇతడిని పిచ్చివాడు అని తీసిపారేశాడు కానీ అతడిని ఎదురించే దమ్మున్నోడు, ఆటలో సత్తా చూపే సరైనోడు అని అభిమానులు గౌతమ్‌ను కొనియాడుతున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ ఆఫర్‌, ఖరీదైన కారు గిఫ్ట్‌.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

23-11-2023
Nov 23, 2023, 15:50 IST
అయితే ఆమెకు బిగ్‌బాస్‌ షో నుంచి ఆఫర్‌ వచ్చిందని, ఓ కారు కూడా పంపించారంటూ ఓ పుకారు మొదలైంది. తాజా...
23-11-2023
Nov 23, 2023, 11:00 IST
కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఇప్పటివరకు బావ చెల్లదురై, ప్రదీప్ ఆంటోని, అనన్య, విజయ్ వర్మ, వినూష, యుకేంద్రన్,...
23-11-2023
Nov 23, 2023, 09:21 IST
కోలీవుడ్‌ నటి విచిత్ర ప్రస్తుతం తమిళ బిగ్‌ బాస్‌-7లో కంటెస్టెంట్‌గా కొనసాగుతుంది. ఆ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...
22-11-2023
Nov 22, 2023, 22:36 IST
బిగ్‌బాస్ షో నిర్వహకులు, హౌస్‌మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది....
22-11-2023
Nov 22, 2023, 19:29 IST
బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్...
22-11-2023
Nov 22, 2023, 13:37 IST
నటుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగా ప్రయత్నించాడో చెప్పుకొచ్చాడు. హ్యాపీ డేస్‌ ఆడిషన్స్‌కు వెళ్తే రూ.25 లక్షలు అడిగారని చెప్పాడు. అంత డబ్బు...
22-11-2023
Nov 22, 2023, 12:00 IST
ఓపక్క హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోపక్క కంటెస్టెంట్లకు సీక్రెట్‌ టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్‌. ఈ క్రమంలో శివాజీకి.. ఆటలో...
22-11-2023
Nov 22, 2023, 10:56 IST
మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తడిమారు. మూడోసారి కూడా అంతే.. ఇక నా వల్ల కాక అతడి చేయి పట్టుకుని...
21-11-2023
Nov 21, 2023, 23:11 IST
శివాజీ పేరు చెప్పగానే బిగ్‌బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్‌తో క్లారిటీ...
21-11-2023
Nov 21, 2023, 18:34 IST
బిగ్‌బాస్ షోలో ఆడుతున్న రైతుబిడ్డ ప్రశాంత్ మరో సూపర్ పవర్ సాధించాడు. శివాజీ గ్యాంగులో ఉన్నప్పటికీ ప్రతిసారి తనదైన మార్క్...
20-11-2023
Nov 20, 2023, 23:25 IST
బిగ్‌బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్‌గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ...
20-11-2023
Nov 20, 2023, 16:15 IST
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం అన్ని భాషల్లో అభిమానులను అలరిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో అత్యధికంగా బిగ్ బాస్...
20-11-2023
Nov 20, 2023, 11:45 IST
గేమ్‌లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్‌లో అవుట్‌ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని...
19-11-2023
Nov 19, 2023, 23:19 IST
బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ చాలా అంటే చాలా బోరింగ్‌గా సాగింది. చివర్లో ఓ ఐదు నిమిషాలు తప్పితే ఒక్కటంటే ఒక్క...
18-11-2023
Nov 18, 2023, 23:51 IST
బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు....
18-11-2023
Nov 18, 2023, 19:01 IST
కానీ చివర్లో అశ్విని, శోభాలలో ఎవరో ఒకరిని బయటకు పంపించనున్నట్లు టాక్‌ నడిచింది. అయితే ఇవేవీ కాదని బిగ్‌బాస్‌ అనూహ్య...
18-11-2023
Nov 18, 2023, 17:32 IST
అనరాని మాటలని, సూటిపోటి మాటలతో వేధించి ఎదుటి వ్యక్తి కుంగిపోయేలా చేస్తాడు.. కానీ వాళ్లు ఏడిస్తే మాత్రం వెళ్లి ఓదార్చినట్లు...
18-11-2023
Nov 18, 2023, 16:19 IST
అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్‌...
18-11-2023
Nov 18, 2023, 13:30 IST
కోలీవుడ్‌లో  బిగ్ బాస్ సీజన్‌ 7 ప్రారంభం అయింది. ఇప్పటికే సుమారు 40 రోజులు దాటింది. అక్కడ కమల్‌ హాసన్‌...
17-11-2023
Nov 17, 2023, 23:09 IST
బిగ్‌బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల... 

Read also in:
Back to Top