నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్‌కు శివాజీ కౌంటర్! | Sakshi
Sakshi News home page

Bigg Boss Season -7: ఏం తప్పు చేశానో చెప్పండి?.. శివాజీపై మండిపడ్డ గౌతమ్!

Published Fri, Nov 3 2023 2:47 PM

Bigg Boss Season 7 Shivaji Comments Captain Goutham In Balls Task - Sakshi

బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్‌ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్‌లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్‌ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండ‌ర్‌షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్‌ హాట్‌గా సాగుతున్నాయి. 

(ఇది చదవండి: రాహుల్‌ గురించి రతికనే చెప్పింది.. బిగ్‌ బాస్‌ విన్నర్‌ అతనే గ్యారెంటీ: దామిని)

కెప్టెన్సీ కంటెండ‌ర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్‌లో భాగంగా గౌతమ్‌ టీం బిగ్‌బాస్ ఓ స్పెషల్ పవర్ ఇ‍చ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్‌తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్‌ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు.   

అయితే బిగ్‌బాస్ నిర్ణయంపై శివాజీ ‍కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ  తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్‌గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు.

దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో  ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్‌లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్‌లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది.

(ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!)

Advertisement
 
Advertisement
 
Advertisement