సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్! | Gayathri Gupta latest Movie Plot Releasing Today Video Goes Viral | Sakshi
Sakshi News home page

Gayathri Gupta: గాయత్రి గుప్తాకు ఏమైంది?.. ‍‍అసలా ఆ బూతులేంటి!

Nov 3 2023 1:27 PM | Updated on Nov 3 2023 2:07 PM

Gayathri Gupta latest Movie Plot Releasing Today Video Goes Viral - Sakshi

ఇటీవలే దయా వెబ్ సిరీస్‌లో ప్రేక్షకులను పలకరించిన నటి గాయత్రి గుప్తా. అంతకంటే ముందే యాంకర్‌గా, షార్ట్‌ ఫిలింస్‌ చేస్తూ కూడా ఫేమస్‌ అయింది. ఆ తర్వాత ఐస్‌క్రీమ్‌ 2, ఫిదా, మిఠాయి, అమర్‌ అక్బర్‌ ఆంటోని, కొబ్బరిమట్ట లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. గతంలో టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌తో పాటు బిగ్‌బాస్‌ టీమ్‌పై లైంగిక ఆరోపణలతో వార్తల్లోకెక్కింది. 

తాజాగా ప్లాట్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది ముద్దుగుమ్మ. భాను భవతారక దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో వికాస్, గాయత్రి గుప్తా ప్రధాన పాత్రలో పోషించారు. అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను అలరిస్తూ ఉంటోంది గాయత్రి గుప్తా.  ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ టచ్‌లో ఉంటోంది. గతంలో ఓ బోల్డ్ వీడియో షేర్ చేసి వార్తల్లో నిలిచింది. 

తాజాగా తన చిత్రం ప్లాట్ మూవీ రిలీజ్ సందర్భంగా మరో వీడియోను షేర్ చేసింది. అభిమానులతో లైవ్ తీసిన వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ రోజు ప్లాట్ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్దామనుకున్నా..కానీ కుదరలేదు అంటూ ఏడుస్తూ కనిపించింది. అందరూ థియేటర్‌కు వెళ్లి ప్లాట్ సినిమా చూడండి అంటూ అభిమానులను కోరింది. అయితే ఈ వీడియోలోనూ మరింత బోల్డ్‌గా కనిపించి అభిమానులకు షాకిచ్చింది. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇంతకీ గాయత్రికి ఏమైందంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. గెట్ వెల్ సూన్ మేడం అంటూ పోస్టులు పెడుతున్నారు. సినిమా రిలీజ్ రోజే ఇలాంటి వీడియో ఏంటీ మేడం అని ప్రశ్నిస్తున్నారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  యాంక్లోసింగ్‌ స్పాండిలైటిస్‌ అనే వ్యాధి ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ‍అయితే ఇది డిప్రెషన్‌ వల్ల వచ్చే శారీరక వ్యాధి అని ఈ విషయం నాకు ఆరు నెలల క్రితం తెలిసింది. చాలామంది డాక్టర్లు నేను ఎక్కువ కాలం బతకనని చెప్పారని తెలిపింది. అయితే సైకాలజీ థెరపీ వచ్చాక ఈ వ్యాధిపై మరింత క్లారిటీ వచ్చింది. సమయానికి పడుకోవడం, యోగా చేయడం.. ఇలా అన్నీ చేస్తున్నానని తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement