ప్రేరణకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌.. హౌస్‌లోకి ఎవరొచ్చారంటే? | Bigg Boss Telugu 8 Latest Promo: Prerana Gets Unforgettable Surprise | Sakshi
Sakshi News home page

Bigg Boss: బిగ్‌బాస్‌ ఫ్యామిలీ వీక్.. ప్రేరణ కోసం ఎవరొచ్చారంటే?

Nov 15 2024 12:05 PM | Updated on Nov 15 2024 12:17 PM

Bigg Boss Telugu 8 Latest Promo: Prerana Gets Unforgettable Surprise

ప్రస్తుతం బిగ్‌బాస్ ‍హౌస్‌లో ఎమోషనల్ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్స్‌ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పంపిస్తూ ఫుల్‌ ఎమోషనల్‌ వీక్‌గా మార్చేశారు. తాజాగా మరో కంటెస్టెంట్‌ కుటుంబ సభ్యుడు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశాడు. హౌస్‌లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రేరణ భర్త ఇవాళ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన భర్తను చూసి ఆనందంలో గంతులేసింది ప్రేరణ.

(ఇది చదవండి: 40 రోజులుగా బ్లీడింగ్‌.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి)

ఆ తర్వాత చాలా బాగా అడుతున్నావంటూ ప్రేరణను మరింత ఎంకరేజ్‌ చేశాడు ఆమె భర్త. నువ్వు విన్నర్‌గా తిరిగి రావాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జంట హౌస్‌లో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. చివర్లో భార్య, భర్తలిద్దరితో గేమ్ ఆడించాడు బిగ్‌బాస్‌. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇవాళ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement