హోస్‌లో పాము, ఊసరవెల్లి లాంటి వాళ్లు ఉన్నారు.. అశ్విని కామెంట్స్ వైరల్! | Bigg Boss Ashwini Exit Interview Comments Goes Viral About Shivaji | Sakshi
Sakshi News home page

Bigg Boss: ప్రశాంత్‌కు భజన చేయలేదు.. అతనే హౌస్‌లో పెద్ద పాము: అశ్విని

Published Mon, Nov 27 2023 9:22 PM | Last Updated on Tue, Nov 28 2023 10:14 AM

Bigg Boss Ashwini Exit Interview Comments Goes Viral About Shivaji - Sakshi

సెల్ఫ్‌ గోల్‌ వేసుకుని బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని. డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పినా.. తనకు తానే సెల్ఫ్‌ నామినేట్ చేసుకుంది. దీంతో హోస్ నుంచి బయటకి వచ్చేసింది. తాజాగా బిగ్‌బాస్‌ ఎగ్జిట్‌ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విని ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. 

హౌస్‌లో రెండు గ్రూపులు ఉన్నాయి.. నాకు ఎవరితోనూ సెట్‌ కాలేదు.. దీనికంటే హౌస్‌ నుంచి వెళ్లిపోవడమే మేలని అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది. సరైన కారణాలు కనిపించక  సెల్ఫ్‌ నామినేట్ చేసుకున్నా. వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. 

బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌కు ఏం ఉపయోగం అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్‌కు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ అశ్విని ఎమోషనల్ అయింది. నేను ఏం చేస్తే వాళ్లకేందుకుండి అంటూ బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శోభ, ప్రియాంక, అమర్‌ ఒక గ్రూప్‌ కాగా.. శివాజీ, ప్రశాంత్‌, యావర్‌ ఒక గ్రూప్‌గా తయ్యారని తెలిపింది. నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని.. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించానని వెల్లడించింది. 

కంటెస్టెంట్స్‌ గురించి మాట్లాడుతూ.. ప్రియాంకను ఊసరవెళ్లితో పోల్చింది అశ్విని. పైకి ఒకలా కనిపిస్తుంది.. కానీ లోపల ఆమె వేరేలా ఉంటుందని చెప్పింది. ప్రశాంత్‌కు భజన చేశారా? అని ప్రశ్నించగా.. భజనేంటండి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ పాములాంటి వారని తెలిపింది. అందుకే హౌస్‌లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చిందని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement