డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్.. అతడి ఎలిమినేషన్ పక్కా? | Bigg Boss 8 Telugu 12th Week Elimination Update | Sakshi
Sakshi News home page

Bigg Boss 8: ఇన్నాళ్లు ఎలాగోలా మిస్... ఈసారి మాత్రం తప్పదేమో!

Nov 22 2024 11:31 AM | Updated on Nov 22 2024 11:33 AM

Bigg Boss 8 Telugu 12th Week Elimination Update

తెలుగు బిగ్‌బాస్ షోలో 12వ వారం చివరకొచ్చేసింది. లెక్క ప్రకారం గతవారం అవినాష్ ఎలిమినేట్ కావాల్సింది. ఇక అయిపోతుంది అనుకునేలోపు నబీల్.. తన దగ్గరున్న ఎవిక్షన్ షీల్డ్ ఉపయోగించడంతో బతికిపోయారు. ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చిన.. ఈ వారం నామినేషన్స్ పూర్తిచేశారు. అలా అందరూ కన్నడ బ్యాచ్‌ని టార్గెట్ చేసి వాళ్లందరూ నామినేషన్స్‌‌లో ఉండేలా చేశారు. మరి ఈసారి వీళ్లలో ఎవరు బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది?

12వ వారం నామినేషన్స్‌లో కన్నడ బ్యాచ్ అయిన ప్రేరణ, నిఖిల్, యష్మి, పృథ్వీ ఉన్నారు. వీళ్లతో పాటు నబీల్ కూడా ఉన్నాడు. వీళ్లలో ప్రస్తుతం ప్రేరణ.. ఓటింగ్‌లో టాప్‌లో కొనసాగుతోంది. దాదాపు 26 శాతం ఓట్లతో ఈమె లీడింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తర్వాతి స్థానంలో నిఖిల్ ఉన్నాడట. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేయర్స్ అనిపించుకున్నారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 30 సినిమాలు)

వీళ్ల తర్వాత అంటే మూడో స్థానంలో యష్మి, నాలుగో స్థానంలో నబీల్ ఉన్నట్లు సమాచారం. చిట్టచివరగా పృథ్వీ ఉన్నాడట. చివరి రెండు స్థానాల్లో ఉన్న నబీల్, పృథ్వీ మధ్య ఓటింగ్ పరంగా 3 శాతం మాత్రమే వ్యత్యాసం ఉందని తెలుస్తోంది. అంటే పృథ్వీతో పాటు నబీల్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లేగా!

ఈ సీజన్‌లో వరస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా ఉండే పేరు పృథ్వీ. కానీ నామినేట్ అయిన ప్రతిసారి ఎలాగోలా తప్పించుకుంటూ వస్తున్నాడు. ఈసారి మాత్రం ఎలిమినేషన్ గ్యారంటీ అనిపిస్తుంది. ఒకవేళ ఇతడు సేవ్ అయితే మాత్రం నబీల్ బయటకెళ్లిపోతాడు. మరి ఈవారం ఏం జరుగుతుందో చూడాలి?

(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌‌పై బన్నీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement