'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. స్టార్ హీరో ప్లేసులో మరో హీరో? | Bigg Boss 8 Tamil New Host Rumours Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

Bigg Boss 8: 'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. స్టార్ హీరో ప్లేసులో మరో హీరో?

Aug 11 2024 9:13 AM | Updated on Aug 11 2024 11:38 AM

Bigg Boss 8 Tamil New Host Rumours Vijay Sethupathi

మరికొన్ని రోజుల్లో బిగ్‌బాస్ కొత్త సీజన్ మొదలవుతుంది. తెలుగులో ఎప్పటిలానే నాగార్జున ఉన్నాడు. తమిళంలో మాత్రం కమల్ తప్పుకొన్నాడు. రీసెంట్‌గానే పోస్ట్ పెట్టడంతో ఆడియెన్స్ షాకయ్యారు. దీంతో నెక్స్ట్ హోస్ట్ ఎవరా అని మొన్నటి నుంచి సస్పెన్స్‌గానే ఉంది. తాజాగా ఈ విషయమై ఓ క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: స్టార్ షట్లర్ శ్రీకాంత్‌తో ఆర్జీవీ మేనకోడలు నిశ్చితార్థం)

బిగ్ బాస్ షో తెలుగు-తమిళంలో ఒకేసారి స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగులో ఈసారి సరికొత్తగా ఉండనుందని రీసెంట్‌గా రిలీజ్ చేసిన ప్రోమోతో చెప్పుకొచ్చారు. ఇక తమిళంలో మాత్రం కమల్ స్థానంలో విజయ్ సేతుపతి పేరుని పరిశీలిస్తున్నారు. హీరో శింబుని కూడా అనుకున్నారు. కానీ మూవీ కమిట్మెంట్స్ వల్ల కుదరలేదని, సేతుపతి ఫైనల్ అయ్యిందని అంటున్నారు.

మరోవైపు విజయ్ సేతుపతి, శింబు కాదని ఏకంగా నయనతార హోస్టింగ్ చేయనుందనే రూమర్ కూడా వస్తోంది. సేతుపతి లేదా నయనతార.. వీళ్లెవరైనా సరే పాన్ ఇండియా క్రేజ్ ఉన్న సెలబ్రిటీలే. మరి వీళ్లలో బిగ్ బాస్ తమిళ కొత్త హోస్ట్‌గా ఎవరు ఫిక్స్ అవుతారనేది చూడాలి?

(ఇదీ చదవండి: చైతూ-శోభిత లవ్ స్టోరీ.. సీక్రెట్ బయటపెట్టిన శోభిత చెల్లి!)

Advertisement
 
Advertisement
Advertisement