బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు! | Bigg Boss 8: Animal Welfare Activist Files Case Against Bigg Boss Fame Gangavva | Sakshi
Sakshi News home page

బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వపై కేసు!

Oct 23 2024 5:03 PM | Updated on Oct 24 2024 11:26 PM

Bigg Boss 8: Animal Welfare Activist Files Case Against Bigg Boss Fame Gangavva

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, యూట్యూబర్‌ గంగవ్వ చిక్కుల్లో పడింది. వీడియోల పేరుతో  వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారంటూ గంగవ్వతో పాటు మరో యూట్యూబర్‌ రాజుపై కేసు నమోదు అయింది. యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ జంతు సంరక్షణ కార్యకర్త అదులాపురం గౌతమ్ ఫిర్యాదు మేరకు జగిత్యాల అటవీ శాఖ అధికారులు ఈ కేసు నమోదు చేశారు. వినోదం కోసం చిలుకను హింసించారని గౌతమ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఏం జరిగింది?
2022 లో గంగవ్వ, రాజు కలిసి ‘మై విలేజ్ షో’ యూట్యూబ్ ఛానెల్ లో గంగవ్వ చిలుక పంచాంగం అనే వీడియో చేశారు. అందులో గంగవ్వ, రాజు జ్యోతిష్కులుగా నటిస్తూ చిలుకను ఉపయోగించారు.  ఇలా వినోదం కోసం చిలుకను పంజరంలో బంధించడం వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972 షెడ్యూల్ IV కింద నేరమని గౌతమ్‌ ఫారెస్ట్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

(చదవండి: మొన్న బెయిల్‌పై వచ్చిన నటుడు.. ఇంతలోనే మూడో పెళ్లితో వైరల్‌)

బిగ్‌బాస్‌ హౌస్‌లో గంగవ్వ
గంగవ్వ ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో గంగవ్వ తొలిసారి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లింది. అయితే అక్కడి వాతావరణం పడక అనారోగ్యం బారిన పడడంతో మధ్యలోనే ఆమెను బయటకు పంపించేశారు. మళ్లీ సీజన్‌ 8లో వైల్డ్‌ కార్డు ఎంట్రీ ఇచ్చి తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంటుంది. 

Advertisement
 
Advertisement
Advertisement