అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్‌ హీరో.. ప్రియురాలి కోసమే! | Bigg Boss 7 Telugu: Priyanka Jain, Shiva Kumar Prank Video Goes Viral | Sakshi
Sakshi News home page

Bigg Boss 7: అమ్మాయిగా మారి షాకిచ్చిన సీరియల్‌ హీరో.. ప్రియురాలి కోసమే ఇదంతా!

Sep 5 2023 3:34 PM | Updated on Sep 5 2023 4:06 PM

Bigg Boss 7 Telugu: Priyanka Jain, Shiva Kumar Prank Video Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ రియాల్టీ షో ఏడో సీజన్‌ ప్రారంభమైంది. 14 మంది హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే వీరిలో ఎక్కువ వరకు సీరియల్‌ నటీనటులే ఉండడం గమనార్హం. వాళ్లంతా పక్కా ప్లాన్‌తో హౌస్‌లోకి వచ్చారు. హౌస్‌లో వాళ్లు ఆడే ఆటకు తగ్గట్లు బయట ప్రమోషన్స్‌ కూడా ఉండాలని ముందే ఫిక్సయినట్లు తెలుస్తుంది. ఇది ప్రతీ సీజన్‌లో కంటెస్టెంట్స్‌ చేసే పనే. అయితే ఈ సారి మాత్రం ప్రమోషన్స్‌ కాస్త వెరైటీగా అనిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌లోకి వెళ్లే ముందే వైరల్‌ అయ్యే వీడియోలను కొన్నింటిని షూట్‌ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటిగా బయటకు వదులుతున్నారు. తాజాగా బిగ్‌బాస్‌-7 తొలి కంటెస్టెంట్‌ ప్రియాంక జైన్‌ సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. 

ప్రియుడితో కలిసి ఫ్రాంక్‌ వీడియో
'జానకి కలగనలేదు'సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ప్రియాంక జైన్‌. అంతకు ముందు పలు సినిమాలలో నటించింది. కానీ ఆమెకు తగిన గుర్తింపు రాలేదు. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన తర్వాతే తను కెరీర్‌ గాడిన పడింది. వరుసగా సీరియల్స్‌తో స్టార్‌ నటిగా గుర్తుంపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం కోసమే బిగ్‌బాస్‌లోకి వెళ్లింది. అంతకు ముందు ఆమె ప్రియుడు, మౌనరాగం సీరియల్‌ హీరో శివ కుమార్‌తో కలిసి ఓ ప్రాంక్‌ వీడియో చేసింది. అందులో శివకుమార్‌ లేడి గెటప్‌లో కనిపించడం గమనార్హం. ప్రియాంక కోసమే తన గెడ్డం తీసేసి అమ్మాయి గెటప్‌ వేశానని శివకుమార్‌ చెప్పారు. 

(చదవండి: నాగార్జునకు రైతు బిడ్డ గిఫ్ట్.. అదేంటో తెలుసా?)

వీడియోలో ఏం ఉంది?
ప్రియాంకకు తెలియకుండా ఓ మేకప్ ఆర్టిస్టును పిలుచుకొని అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు శివకుమార్‌. అనంతరం  జానకి కలగనలేదు సీరియల్ నటుడితో కలిసి ప్రియాంక ఇంటికి వెళ్లాడు. తనని తాను ఇందుమతిగా పరిచయం చేసుకొని ఇంట్లోకి వెళ్లాడు. అయితే గెటప్‌ అయితే మారింది కానీ.. గొంతు మాత్రం అలానే ఉండడంతో ప్రియాంక ముందుగానే అతన్ని పసిగట్టింది. అయినప్పటికీ అతనికి ఆ విషయం చెప్పలేదు. కాసేపయ్యాక నేను ఎప్పుడో గుర్తుపట్టానని చెప్పడంతో శివ కుమార్‌ తెల్లముఖం వేశాడు. తాను ఫ్రాంక్‌ చేద్దామనుకుంటే.. ప్రియాంకనే తనను ఫ్రాంక్‌ చేసిందని శివ చెప్పుకొచ్చాడు. 

ఎలా గుర్తుపట్టింది?
శివ కుమార్‌ లేడీ గెటప్‌ అయితే వేసుకున్నాడు కానీ.. చేతికి ఉన్న ఉంగరాలు, రాఖీ తీసేయ్యలేదు. అలాగే గొంతు మార్చి మాట్లాడడంలోనూ విఫలం అ‍య్యాడు. దీంతో పరిచయం చేసుకున్న కాసేపటికే ప్రియాంక గుర్తుపట్టేసింది. అయితే ఆ విషయం అతనికి చెప్పకుండా.. చివర్లో చెప్పి షాకిచ్చింది. ప్రియాంక బిగ్‌బాస్‌లోకి వెళ్లిన తర్వాత ఈ వీడియోని వదిలారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌ అవుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement