బిగ్‌బాస్‌ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ | Bigg Boss 7 Telugu: Pallavi Prashanth Cried - Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 7: రైతుబిడ్డ సెంటిమెంట్‌ వాడొద్దంటూ కంటెస్టెంట్ల వార్నింగ్‌.. ఆఖరికి రతిక కూడా అలా అనేసరికి ఏడ్చేసిన పల్లవి ప్రశాంత్‌

Published Mon, Sep 11 2023 4:43 PM

Bigg Boss 7 Telugu: Pallavi Prashanth Cried - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌కు ఓ విషయం అర్థమైంది. ఇక మెతకగా ఉంటే పని అవ్వదని, అందరి కంట్లో పడాలంటే ఏదో ఒకటి చేసేయాలని తెలిసొచ్చింది. అసలే వీకెండ్‌లో నాగ్‌ కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు. ఇంకేముంది, నామినేషన్స్‌లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. బిగ్‌బాస్‌కే బాస్‌ అన్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్న శివాజీని, పదేపదే రైతుబిడ్డ అని చెప్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ సింపథీ కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్‌ను ఉతికారేశారు. ముందు ఎదుటివారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీకి గట్టిగానే కౌంటరిచ్చింది.

అది తప్పా?
అనంతరం హౌస్‌లో చాలామంది ప్రశాంత్‌ను వరుసపెట్టి నామినేట్‌ చేశారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నాయనా, నాకు నువ్వు నాకు కనిపించడం లేదని షకీలా మొదట ప్రశాంత్‌ను నామినేట్‌ చేసినట్లు చూపించారు. ఇక గౌతమ్‌ కృష్ణ.. తనను నామినేట్‌ చేస్తూ కారణం చెప్తుండగా అతడిని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రశాంత్‌. నేను చేసే పని గర్వంగా చెప్పుకున్నా, అది తప్పా? అని నిలదీశాడు. గౌతమ్‌ను మాట్లాడనివ్వకపోవడంతో.. ఫస్ట్‌ మొత్తం విన్నాక మాట్లాడు అని ప్రశాంత్‌పై ఫైర్‌ అయింది ప్రియాంక.

అదిరే ఆన్సర్‌ ఇచ్చిన ఆట సందీప్‌
ఇక అమర్‌దీప్‌ అయితే రైతుబిడ్డ అనే క్యాసెట్‌ వినలేక తెగ ఫ్రస్టేట్‌ అయ్యాడు. ప్రతిసారి రైతుబిడ్డ అనే సెంటిమెంటల్‌ డైలాగ్‌ వాడకురా అని హెచ్చరించాడు. సీరియల్‌లో చేసిన యాక్టింగ్‌ ఇక్కడ చెప్పకు అని ఎదురుతిరిగాడు ప్రశాంత్‌. ఇంతలో ఆట సందీప్‌ కలగజేసుకుంటూ భారత్‌లో పుట్టిన ప్రతి ఒక్కరూ రైతుబిడ్డే.. మా తాతలు కూడా రైతుబిడ్డేరా అని చెప్పాడు.

కుక్కలా తిరిగినా
అందరూ ఒకేసారి తనను వరుసపెట్టి వాయించడంతో ఏడ్చేశాడు ప్రశాంత్‌. ఆరో సీజన్‌ సమయంలో ఇదే స్టూడియో ముందు కుక్కలాగా తిరిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే రతిక రంగంలోకి దిగుతూ.. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నవ్‌? అని పాయింట్‌ లాగింది. ఆమె దగ్గరి నుంచి అటువంటి ప్రశ్న ఊహించని ప్రశాంత్‌ దెబ్బకు సైలైంట్‌ అయిపోయాడు. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతోంది.

చదవండి: Kiran Rathod: కిరణ్‌ రాథోడ్‌ ఎలిమినేషన్‌కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా?

Advertisement
 
Advertisement
 
Advertisement