పాటతో నాగార్జుననే ఫిదా చేసిన భోలె షావళి | Sakshi
Sakshi News home page

Bhole Shavali: మూడో వైల్డ్‌ కార్డ్‌ కంటెస్టెంట్‌గా భోలె షావళి

Published Sun, Oct 8 2023 9:05 PM

Bigg Boss 7 Telugu: Bhole Shavali as 3rd Wild Card Contestant - Sakshi

'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్‌లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్‌ సృష్టించిన భోలె షావళి సింగర్‌ మాత్రమే కాదు, మ్యూజిక్‌ డైరెక్టర్‌ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్‌ సాంగ్స్‌ అందించాడు. పెనుకొండ ముద్దుబిడ్డ అయిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్‌గా పని చేశాడు.

ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్‌గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్‌ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్‌ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తన టాలెంట్‌తో మాయ చేసేందుకు బిగ్‌బాస్‌ షోకి వచ్చాడు. వచ్చీరాగానే నాగార్జునపై ఓ పాట పాడి హోస్ట్‌ను ఇంప్రెస్‌ చేశాడు. మరి తన మ్యూజిక్‌ మ్యాజిక్‌ ఇంట్లో పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి.

Advertisement
 
Advertisement