పవర్‌ అస్త్ర చోరీ.. అంత చీప్‌ మైండా?: ఆట సందీప్‌ ఫైర్‌ | Bigg Boss 7 Telugu: Aata Sandeep Fires On BB7 Housemates Over Powerastra Missing, Watch Promo Inside - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Telugu: అంత చీప్‌ మైండా? అని ఆగ్రహంతో ఊగిపోయిన సందీప్‌..

Sep 14 2023 1:04 PM | Updated on Sep 14 2023 1:37 PM

Bigg Boss 7 Telugu: Aata Sandeep Fires On Housemates Over Power Star Missing - Sakshi

మాయ అస్త్ర పోతే పోయింది కనీసం పవర్‌ అస్త్ర అయినా గెలుద్దామని ఆట సందీప్‌ కష్టపడి దక్కించుకున్న ఆ పవర్‌ఫుల్‌ అస్త్రాన్ని కొట్టేసింది. 

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లను రెండు టీములుగా విడగొట్టి మాయ అస్త్ర అనే పోటీ పెట్టారు. ఈ పోటీలో మహాబలి టీమ్‌ను ఓడించి రణధీర సమూహం (శివాజీ, అమర్‌దీప్, ప్రిన్స్, ప్రియాంక, శోభాశెట్టి, షకీలా) విజయం సాధించి మాయ అస్త్రను కైవసం చేసుకుంది. అయితే మహాబలి టీమ్‌ మరోలా ఆలోచించింది. మాయ అస్త్ర పోతే పోయింది కనీసం పవర్‌ అస్త్ర అయినా గెలుద్దామని ఆట సందీప్‌ కష్టపడి దక్కించుకున్న ఆ పవర్‌ఫుల్‌ అస్త్రాన్ని కొట్టేసింది. 

ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు సందీప్‌. పవర్‌ అస్త్రను నా భార్యాపిల్లలకు అంకితమిచ్చాను. దాన్ని దొంగిలించారు. అంత చీప్‌ మైండెడ్‌ ఉంటే వర్కవుట్‌ కాదు అని అసహనానికి లోనయ్యాడు. అయితే తను గెల్చుకుంది పోయిందని సందీప్‌ ఏడుస్తుంటే చీప్‌ అనే పదాలు వాడొద్దని టేస్టీ తేజ హెచ్చరించాడు. తర్వాత దానికోసం రాత్రిపూట ఇల్లంతా వెతుకులాట మొదలుపెట్టారు. అయితే లైవ్‌లో సందీప్‌ పవర్‌ అస్త్రను తిరిగి దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

చదవండి:  బిగ్‌బాస్‌: పాపం.. నిద్ర మానుకుని తెగ కష్టపడ్డారు కానీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement