
బిగ్‌బాస్ ఇంట్లో మూడోవారం నామినేషన్స్ హీట్ మొదలైంది. డబుల్ ఎలిమినేషన్‌తో జలక్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈసారి నామినేషన్స్‌లోనూ తాము చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పాలంటూ ఆదేశించాడు. దీంతో ఇంటిసభ్యుల మధ్య కౌంటర్ వార్ నడిచింది. ఇప్పటికే గేమ్ ఆడకుండా డల్‌గా కూర్చున్నావని సత్యను నాగార్జున క్లాస్ పీకినా ఆమె తీరులో పెద్దగా మార్పు లేనట్లే కనిపిస్తుంది.
ఇనయాను సత్య నామినేట్ చేయగా, నీకు గేమ్ ఆడాలనే లేదు కూర్చొని ముచ్చట్లు చెప్పాలి,ఇది చాలా సిల్లీ నామినేషన్ అంటూ ఇనయా ఆమె పరువు తీసేసింది. దీనికి సత్య కొత్తగా చెప్పేదేముంది సిల్లీ నామినేషన్ అని ఆన్సర్ ఇచ్చింది. ఇక ఇనయా, ఆదిరెడ్డిలు కూడా గట్టిగానే వాగ్వివాదానికి దిగారు. మీరు గేమ్ మొత్తం తెలుసుకొనే వచ్చారు అని ఇనయా చెప్పగా, 105రోజులు ఉండే హౌస్‌లో గేమ్ తెలుసుకొనే వస్తారు కదా అంటూ ఆదిరెడ్డి కౌంటర్ ఇచ్చాడు.అయినప్పటికీ ఇనయా ఎప్పటిలాగే వాదిస్తుంటే సహనం కోల్పోయిన ఆదిరెడ్డి బిగ్ బాస్.. పళ్లెం ఎత్తేస్తా చెప్తున్నా అంటూ ఫైర్ అయ్యాడు.
చలాకీ చంటీ, గీతూ రాయల్ మధ్య సంస్కారం గురించి గొడవ జరిగింది. వయసుకు గౌరవం ఇవ్వనని గీతూ చెప్పగా.. మనం పదిమందితో ఉన్నప్పుడు సంస్కారంతో నడుచుకోవాలి అని చంటీ బదులిచ్చాడు. దీనికి కౌంటర్‌గా ముందు నువ్వు కరెక్టుగా ఉన్నావో లేదో చూసుకో తర్వాత సంస్కారం గురించి మాట్లాడు అని పేర్కొంది. ఇక లాస్ట్‌లో సుదీప గీతూని నామినేట్ చేసింది. కారణం తెలీదు కానీ తన బేబీ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యింది. మొత్తానికి ఇవాల్టి నామినేషన్స్‌లో హౌస్‌మేట్స్ మధ్య డైలాగ్ వార్ నడిచినట్లు క్లియర్‌గా అర్థమవుతుంది. చూడాలి మరి ఈ ఫైర్ ఎపిసోడ్ మొత్తం ఉంటుందో లేదో.