Bigg Boss 6 Telugu: ఆసక్తిగా గీతూ రాయల్‌ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే!

Bigg Boss 6 Telugu: Geetu Royal 9 Weeks Remuneration Goes Viral - Sakshi

బిగ్‌బాస్‌ 6 సీజన్లో ఎక్కువగా మార్మోగుతున్న పేరు గీతూ రాయల్‌. మొదటి నుంచి హౌజ్‌లో అందరికంటే ఎక్కువ కంటెంట్‌ ఇస్తూ ప్రేక్షకులను అలరించింది. ఇక ఆమె అనూహ్యా ఎలిమినేషన్‌ మాత్రం అందరికి షాకిచ్చింది. కేవలం ప్రేక్షకులే కాదు హౌజ్‌మేట్స్‌ కూడా గీతూ ఎలిమినేషన్‌ను జీర్ణించుకోలేకోపోతున్నారు. ఇక హౌజ్‌ని వీడేముందు గీతూ ‘నన్ను పంపించొద్దు బిగ్‌బాస్‌’ అంటూ వేడుకున్న తీరు ప్రతిఒక్కరిని కదిలించింది. చివరికి అయిష్టాంగానే ఆమె హౌజ్‌ను వీడింది. అయితే సోషల్‌ మీడియాలో మోటివేషనల్‌ కోట్స్‌ షేర్‌ చేస్తూ పాపులర్‌ అయ్యింది గీతూ. సోషల్‌ మీడియా ఇన్ఫులేన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుని బిగ్‌బాస్‌ 6వ సీజన్‌ ఆఫర్‌ కొట్టేసింది.

అలా హౌజ్‌లో అడుగు పెట్టిన ఆమె తనదైన ఆట తీరుతో 9 వారాల పాటు ఎంటర్‌టైన్‌ చేసింది. ఈ నేపథ్యంలో గీతూ రెమ్యునరేషన్‌ ప్రస్తుతం ఆసక్తిగా మారింది. సోషల్‌ మీడియాలో ఆమె పారితోషికంగా ఎంత అనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో గీతూ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఓ అప్‌డేట్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ తాజా బజ్‌ ప్రకారం... గీతూకి వారానికి రూ. 25వేల చొప్పున పారితోషికం అందిందని తెలుస్తోంది. అలా 9 వారాలకు రూ. 2.5 లక్షల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. అయితే అందరి కంటే బాగా ఆడిన గీతూకి ఇంత తక్కువ పారితోషికం ఏంటని ఆమె ఫాలోవర్స్‌ అభిప్రాయ పడుతున్నారు. కాగా హౌజ్‌లో రేవంత్‌, బాలాదిత్య, నేహా చౌదరి, శ్రీసత్య, కీర్తి, వాసంతి, ఇనయ సుల్తానా, రోహిత్‌, మెరినా, సూర్యల కంటే గీతూ రెమ్యునరేషన్‌యే తక్కువనే చర్చ కూడా జరుగుతోంది. 

గీతూ కొంపముంచింది అదేనా?
అయితే గీతూ ఆహం ఎక్కువ అనే విషయం తెలిసిందే. అన్ని తనకే తెలుసు అన్నట్టుగా హౌజ్‌లో టాస్క్‌లో ఆమె వ్యవహరించేది. అంతేకాదు టాస్క్‌ల్లో తన బుద్దిబలంతో పాటు తన అతి తెలివి వాడి రూల్స్‌ మార్చేది. ఇలా ఓసారి హోస్ట్‌ నాగార్జున చేతిలో చీవాట్లు కూడా తింది. ఇక ఆమె అతి వల్లే గీతూకి నెగిటివిటీ వచ్చిందని అందరూ అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు హౌజ్‌ పనుల విషయంలో బద్ధకంగా చూపించడం.. తనకు కెటాయించిన పనిని కూడా సరిగ చేయకుండ పక్కవారితో చేయించేది. ఏం చెప్పిన తనకు ఓసీడీ అంటూ తప్పించుకునేది. శ్రీహాన్‌ కెప్టెన్సీలో గీతూ చేసిన తప్పిదం వల్లే అతడు ఈ వారం కంటెండర్‌గా అనర్హుడయ్యాడు. ఇది పక్కన పెడితే శ్రీహాన్‌ గీతూతో సింగిల్‌గా వాష్‌రూమ్‌ క్లీనింగ్‌ చెపిస్తానంటూ హోస్ట్‌కు మాటిచ్చాడు. కనీసం అది కూడా దృష్టిలో పెట్టుకొకుండా గీతూ తన పని చేయకుండ ఆదిరెడ్డితో చేయించింది. దీంతో శ్రీహాన్‌ ఈవారం కెప్టెన్సీ కంటెండర్‌ పోటీకి అనర్హుడు అయ్యాడు. అతడి ఫ్యాన్స్‌ నుంచి కూడా గీతూకి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది.

చదవండి: 
స్టార్‌ హీరో విక్రమ్‌కు గోల్డెన్‌ వీసా.. నటి పూర్ణ భర్తకు సంబంధం ఏంటీ?
పరిస్థితి మరింత దిగజారింది: రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top