Chiyaan Vikram: స్టార్‌ హీరో విక్రమ్‌కు గోల్డెన్‌ వీసా.. నటి పూర్ణ భర్తకు సంబంధం ఏంటీ?

Chiyaan Vikram Received UAE Golden Visa From Actress Poorna Husband - Sakshi

స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌ ప్రభుత్వం తాజాగా ఆయన గోల్డెన్‌ వీసా ఇచ్చింది. ఈ విషయాన్ని నటి పూర్ణ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్తతో కలిసి పూర్ణ విక్రమ్‌ దుబాయ్‌ గోల్డెన్‌ వీసా అందిస్తున్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసింది. కాగా గతంలో కూడా పలువురు భారతీయ నటీనటులకు దుబాయ్‌ ప్రభుత్వం గోల్డెన్‌ వీసా ఇచ్చిన సంగతి తెలిసిందే.

చదవండి: అప్పటి వరకు అల్లు శిరీష్‌ ఎవరో కూడా తెలియదు: అను ఇమ్మాన్యుయేల్‌

మోహన్‌ లాల్‌, మమ్ముట్టి, కమల్‌ హాసన్‌, షారుక్‌ ఖాన్‌, నటి త్రిష, కాజల్‌ అగర్వాల్‌తో పాటు తదితర స్టార్‌ నటులకు ఈ వీసా అందింది. తాజాగా ఈ జాబితాలో విక్రమ్‌ కూడా చేరటం విశేషం. ఇదిలా ఉంటే నటి పూర్ణ అలియాస్‌ షమ్మా ఖాసీమ్‌ ఆమె భర్త షానిద్‌ ఆసీఫ్‌ చేతుల మీదుగా విక్రమ్‌కుగోల్డెన్‌ వీసా ఇవ్వడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. దీంతో దీనిపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో పూర్ణ భర్త చొరవతోనే విక్రమ్‌కు గోల్డెన్‌ వీసా వచ్చినట్లు తెలుస్తోంది. 

చదవండి: అలా లెక్కలేసుకుని నేను ఇండస్ట్రీకి రాలేదు: అనుష్క శెట్టి

పూర్ణ భర్త షానిద్ ఆసీఫ్ అలీ యూఏఈలో బడా వ్యాపారస్తుల్లో ఒకరనే విషయం తెలిసిందే. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా విక్రమ్‌కి గోల్డెన్ వీసా వచ్చేలా చేశాడని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. కాగా సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆరబ్‌ దేశాల్లో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top