Bigg Boss 5 Telugu Contestants Tests Positive For COVID-19 - Sakshi
Sakshi News home page

Bigg Boss 5 Telugu: ఇద్దరికి కరోనా పాజిటివ్‌.. తెరపైకి కొత్త పేర్లు, లిస్ట్‌ ఇదే

Aug 28 2021 4:58 PM | Updated on Sep 1 2021 7:54 PM

Bigg Boss 5 Telugu Two Contestants Tests Positive For COVID-19	 - Sakshi

బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్‌ రియాల్టీ షో  బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సెప్టెంబర్‌ 5న గ్రాండ్‌గా ప్రారంభం కాబోతుంది. తొలి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్లను పరిచయం చేయబోతున్నారు.  సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ అంతా క్వారంటైన్‌లోకి వెళ్లారు.

అయితే గత ఏడాది మరిదిగానే బిగ్ బాస్ షోకి ఈసారి కూడా కరోనా సెగ తాకింది. బిగ్ బాస్-5 కంటెస్టెంట్స్ లో ఇద్దరు కరోనా బారిన పడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వారిని క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా అక్కినేని నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు  షో ప్రారంభ తేది దగ్గర పడుతుండడంతో  కంటెస్టెంట్స్ ఎవరన్నదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందమంది పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వారిలో యాంకర్‌ రవి, లోబో, కార్తీకదీపం ఫేమ్‌ ఉమాదేవి, నటి లహరి షారి, యాంకర్‌ ప్రత్యూష,  యానీ మాస్టర్, సిరి హన్మంత్‌, ట్రాన్స్‌ జెండర్‌ ప్రియాంక, నటి ప్రియ, నవ్య స్వామి, 7 ఆర్ట్స్ సరయు సుమన్,  యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, ఫోక్ సింగర్ కోమలి, యాంకర్ కమ్ నటి వర్షిణి,  ఆట సందీప్ భార్య జ్యోతిల పేర్లతో పాటు కొత్తగా కొరియోగ్రాఫర్‌ నటరాజ్‌, సింగర్‌ శ్రీరామచంద్ర పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీరిలో ఫైనల్‌గా బిగ్‌బాస్‌ ఇంట్లోకి అడుగుపెట్టేది ఎవరో తెలియాలంటే సెప్టెంబర్‌ 5 వరకు ఆగాల్సిందే. 

Advertisement
 
Advertisement
Advertisement