త‌ల్లి రాలేద‌ని గుండెల‌విసేలా ఏడ్చిన మోనాల్‌ | Bigg Boss 4 Telugu: All Inmates Families Came For Visit What About Monal | Sakshi
Sakshi News home page

అంద‌రి అమ్మ‌లు వ‌చ్చారు, ఒక్క మోనాల్ త‌ల్లి త‌ప్ప‌

Nov 19 2020 3:46 PM | Updated on Nov 19 2020 4:04 PM

Bigg Boss 4 Telugu: All Inmates Families Came For Visit What About Monal - Sakshi

రోజురోజుకీ కంటెస్టెంట్ల మ‌ధ్య పెరిగిపోతున్న దూరాల‌ను బిగ్‌బాస్‌ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన త‌ల్లులు చెరిపేశారు. త‌మ పిల్ల‌ల‌తో పాటు మిగ‌తా ఇంటి స‌భ్యుల మీద ప్రేమ‌లు కురిపించారు. మొద‌ట‌గా వ‌చ్చిన అఖిల్ అమ్మ అయితే ఏకంగా అభిజిత్‌ను అఖిల్‌కు బ్ర‌ద‌ర్ అని చెప్పుకొచ్చింది. ఇక మోనాల్‌కు అఖిల్‌కు ఏదో ఉంద‌న్న వార్త‌ల‌కు చెక్ పెడుతూ మోనాల్ త‌న కొడుక్కి బెస్ట్ ఫ్రెండ్ అని ప‌దేప‌దే నొక్కి చెప్పింది. ఆమె చెప్పిన మంచి మాట‌ల‌తో క‌ళ్ల ముందు క‌మ్ముకున్న ఆవేశ‌పు అపార్థాల‌ పొర‌లు చీలిపోయి అభిజిత్‌, అఖిల్ అన్న‌ద‌మ్ముల్లా క‌లిసిపోయారు. అటు సోహైల్‌, హారిక కూడా ఎప్ప‌టిలాగే దోస్తులుగా మారిపోయారు. ఎమోష‌న‌ల్‌గా సాగిన నిన్న‌టి ఎపిసోడ్‌లో అఖిల్‌, అభిజిత్‌, హారిక‌, అవినాష్ త‌ల్లులు వ‌చ్చారు. నేటి ఎపిసోడ్‌లో మిగిలిన‌వారి పేరెంట్స్ రానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు రిలీజ్ చేసిన ప్రోమోలో సోహైల్.. తండ్రి పిలుపు విని ఉద్వేగానికి లోన‌య్యాడు. ఆ త‌ర్వాత‌ క‌థ వేరే ఉంట‌ది అన్న డైలాగుతో సోహైల్ తండ్రి అంద‌రినీ న‌వ్వించాడు. (చ‌ద‌వండి: అభి, నీ బ్ర‌ద‌ర్‌ను బాగా చూసుకో: అఖిల్ అమ్మ‌)

ఇక లాస్య త‌న కొడుకు జున్ను క‌ళ్లెదురుగా క‌నిపించేస‌రికి ఆనందం ప‌ట్ట‌లేక ఏడ్చేసింది. ప‌రుగెత్తుకుంటూ వెళ్లి గాజు తెర చాటు నుంచే జున్నుపై ముద్దులు కురిపించింది. లాస్య‌ను ఎవ‌రూ ఆంటీ అని పిల‌వ‌డానికి వీల్లేద‌ని ఆమె భ‌ర్త వార్నింగ్ ఇచ్చి వెళ్లాడు. అరియానా త‌న‌కోసం వ‌చ్చిన విన‌య్‌కు ఐ ల‌వ్ యూ చెప్పింది. ఇక మోనాల్ వంతు వ‌చ్చేస‌రికి మాత్రం బిగ్‌బాస్ ఆమెను మ‌రోసారి ఏడిపించాడు. కేవ‌లం ఆమె త‌ల్లి వాయిస్ మాత్ర‌మే వినిపించాడు. మోనాల్ బెటా.. ఎలా ఉన్నావు?  నేను హైద‌రాబాద్‌కు రాలేక‌పోయాను అన్న త‌ల్లి మాట‌లను విని ఆమె గుండెల‌విసేలా రోదించింది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి మ‌రీ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమె బాధ చూసి మిగ‌తావారి క‌ళ్లు చెమర్చాయి. అయితే మోనాల్‌ను ఇంత‌లా ఏడిపించిన బిగ్‌బాస్ ఆమె చెల్లెలిని లోప‌లకు పంపించాడ‌ట‌. క‌నీసం త‌ల్లిని చూడ‌లేక‌పోయినా చెల్లిని ఎదురుగా చూసి మాట్లాడుతున్నందుకు మోనాల్ ఎంత సంతోషిస్తుందో చూడాలి. (చ‌ద‌వండి: అఖిల్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన గంగ‌వ్వ‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement