అఖిల్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపిన గంగ‌వ్వ‌

Bigg Boss Telugu 4: Gangavva Birthday Wishes To Akhil Sarthak - Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అడుగు పెట్టిన అంద‌గాడు అఖిల్ సార్థ‌క్‌. త‌న న‌వ్వుకు, తెలివికి, గాత్ర మాధుర్యానికి అమ్మాయిలు దాసోహ‌మ‌య్యారు. అత‌డికే మా ఓటు అని బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెప్తున్నారు. మోనాల్‌తో సాన్నిహిత్యం, అభిజిత్‌తో వైరం, టాస్కుల్లో వీర‌త్వం వెర‌సి అఖిల్ బిగ్‌బాస్ వీక్ష‌కుల నోట్లో నాలుక‌గా మారిపోయాడు. ఈ రోజు(న‌వంబ‌ర్ 17) అఖిల్ సార్థ‌క్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న అభిమానులు, అఖిల్‌కు బ‌ర్త్‌డే విషెస్ చెప్తున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో అఖిల్ ట్రెండింగ్‌ అవుతున్నాడు. ఇత‌డికి బిగ్‌బాస్ స్టార్ గంగ‌వ్వ‌, సుజాత‌, యాంక‌ర్ శివ వీడియో సందేశం ద్వారా ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలిపారు. (చ‌ద‌వండి: కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమ‌జ‌)

కాగా నాగార్జున కొడుకు అఖిల్ పిల్లాడిగా న‌టించిన 'సిసింద్రీ' సినిమా విడుద‌లైన స‌మ‌యంలో అఖిల్ పుట్టాడు. అందుక‌నే అత‌డికి ఆ పేరు పెట్టారు. బుల్లితెరతో కెరీ‌ర్ ప్రారంభించిన అఖిల్ 'ముత్యాల ముగ్గు', 'ఎవ‌రే నువ్వు', 'క‌ళ్యాణి', 'మోహిని' వంటి సీరియ‌ల్స్‌లో కూడా న‌టించాడు. మ‌ధ్య‌లో 'బావా మ‌ర‌ద‌లు' అనే చిత్రంతో వెండితెర మీద త‌ళుక్కుమ‌ని మెరిశాడు. ఇక బిగ్‌బాస్ షోలో అడుగు పెట్టిన అఖిల్ మోనాల్ గ‌జ్జ‌ర్‌ను బెస్ట్‌ఫ్రెండ్‌గా, సోహైల్‌ను త‌మ్ముడిగా ఫీల‌వుతాడు. మిగ‌తా అంద‌రితోనే బాగానే ఉంటున్న‌ప్ప‌టికీ ముక్కుసూటిగా మాట్లాడే త‌త్వం, యాటిట్యూడ్‌తో వైరాలు కొని తెచ్చుకుంటున్నాడు. ఇక‌ ఈ మ‌ధ్యే సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లిన అఖిల్‌ మ‌రింత స్ట్రాంగ్‌గా హౌస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప‌ద‌కొండో వారానికి కెప్టెన్‌గా కొన‌సాగుతున్న ఇత‌డు టాప్ 3లో ఉంటాడ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: మోనాల్‌ని ముద్దు అడిగిన అఖిల్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top