8వ త‌ర‌గ‌తిలోనే ల‌వ్‌స్టోరీ: హిమ‌జ | Bigg Boss Fame Himaja Reveals Her Love Story | Sakshi
Sakshi News home page

కాపురాలు కూలిపోతాయ్ అని హెడ్డింగ్ పెట్టారు: హిమ‌జ‌

Nov 3 2020 6:39 PM | Updated on Nov 3 2020 9:10 PM

Bigg Boss Fame Himaja Reveals Her Love Story - Sakshi

బిగ్‌బాస్ త‌ర్వాత చాలామంది కెరీర్ శూన్యంగా మారితే హిమ‌జ మాత్రం ఎన్నో ఆఫ‌ర్లు అందుకుంటూ బిజీబిజీగా మారింది. సొంతంగా  లిటిల్ లేడీస్ బాస్కెట్‌ అని కంపెనీ కూడా ప్రారంభించింది. బిజినెస్ స్టార్ట్ చేయ‌డ‌మే కాక అటు సినిమాలు, ఇటు వెబ్ సిరీస్‌లు, మ‌రోవైపు రిబ్బ‌న్ క‌టింగ్లు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ప‌నిలో ప‌నిగా యూట్యూబ్ ఛాన‌ల్ కూడా స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే హౌస్‌లో ఉన్న‌ప్పుడు కొంద‌రితోనే క‌లిసిన‌ట్లు అనిపించినా, బ‌య‌ట‌కు వ‌చ్చాక మాత్రం అంద‌రితో క‌లిసిపోయింది. ముఖ్యంగా‌ రవికృష్ణ, శివజ్యోతిలతో క‌నిపిస్తూ సోష‌ల్ మీడియాలో మ‌రింత సంద‌డి చేస్తోంది. నిన్న(న‌వంబ‌ర్ 3) హిమ‌జ బ‌ర్త్‌డే. ఈ సందర్భంగా ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కు ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. అందులో త‌న బాల్యం, య‌వ్వ‌నం, వ‌ర్త‌మానం గురించి చెప్పుకొచ్చింది. (మాస్టర్‌ సంచలన నిర్ణయం.. భోరుమన్న మెహబూబ్‌)

చిన్న‌త‌నంలో బాగా అల్ల‌రి చేసేదాన్న‌ని, అప్పుడు ఇంట్లోవాళ్లు బ‌డితెపూజ చేసేవాళ్ల‌ని జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంది. చాలామంది ల‌వ్ చేశారు. నేనూ చేశాను. చాలామంది హృద‌యంలో ఉన్నారు, కొంద‌రు అలానే మ‌న‌సులో ఉండిపోతారు అని చెప్పుకొచ్చింది. కానీ ఎవ‌రి లైఫ్ వాళ్ల‌దేన‌ని స్ప‌ష్టం చేసింది. కానీ 8వ త‌ర‌గ‌తిలోనే ఓ ల‌వ్ ‌స్టోరీ ఉంద‌ని తెలిపింది. అయితే ఓ యూట్యూబ్ ఛాన‌ల్ 'కొంత‌మంది గురించి చెప్తే కాపురాలు కూలిపోతాయి' అని హెడ్డింగ్ పెట్టుకోవ‌డంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. "చిన్న‌ప్పుడు ఎవ‌రినైనా ల‌వ్ చేశావా? పేరు చెప్పు అని ఇంట‌ర్వ్యూలో అడిగారు. వాళ్లు ఎక్క‌డో పెళ్లి చేసుకుని ఉంటారు. మ‌ళ్లీ వాళ్ల పేర్లు చెప్పి అన‌వ‌స‌రంగా ఎందుకు డిస్ట‌ర్బ్ చేయ‌డం అన్న ఉద్దేశ్యంలో మాట్లాడాను. కానీ దానికి కాపురాలు కూలిపోతాయ్ అంటూ భీభ‌త్స‌మైన హెడ్డింగ్ పెట్టి వ్యూస్ సంపాదించుకున్నారు" అని హిమ‌జ చెప్పుకొచ్చింది. (బిగ్‌బాస్‌ : నోయల్‌ రీఎంట్రీ.. సర్‌ప్రైజ్‌ వీడియో)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement