Samantha To Host Of Bigg Boss Telugu 6? - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: నాగార్జునను సైడ్‌ చేసి సమంతకు బాధ్యతలు!

Jun 2 2022 3:50 PM | Updated on Jun 2 2022 4:26 PM

Big Shock To Nagarjuna Fans, Samantha To Host Of  Bigg Boss Telugu 6? - Sakshi

( ఫైల్‌ ఫోటో )

కొన్నేళ్లుగా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉన్నాడని దీంతో ఈసారి కొత్త యాంకర్‌ను తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అక్కినేని నాగార్జునను కాదని టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంతను సంప్రదించారట, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట!

బిగ్‌బాస్‌ షో వస్తోందంటే చాలు బుల్లితెర ఆడియన్స్‌కు పండగే. ఫన్‌, ఫ్రస్టేషన్‌, ఎమోషన్స్‌, గేమ్స్‌, స్ట్రాటజీస్‌.. ఇలా అన్నీ ఒకేచోట దొరుకుతాయి. సెలబ్రిటీలను కొన్ని వారాలపాటు ఒకే ఇంట్లో ఉంచి వారి వ్యక్తిత్వాన్ని బయటపెట్టడమే కాకుండా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే షో ముఖ్య ఉద్దేశం. తెలుగులో మొదటి సీజన్‌కు జూనియర్‌ ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించగా రెండో సీజన్‌కు నేచురల్‌ స్టార్‌ నాని హోస్టింగ్‌ చేశాడు. ఇక మూడు, నాలుగు, ఐదు సీజన్లతో పాటు ఓటీటీని సైతం విజయవంతంగా డీల్‌ చేశాడు కింగ్‌ నాగార్జున. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే బుల్లితెర ప్రేక్షకులతో కనెక్ట్‌ అయ్యేందుకు బిగ్‌బాస్‌ షోకు కొన్నేళ్లుగా ఆయనే హోస్ట్‌గా పని చేస్తున్నాడు. 

త్వరలో బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ సారి ఓటీటీలో పాల్గొన్న ఒకరిద్దరు కంటెస్టెంట్లను కూడా మరోసారి హౌస్‌లోకి పంపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే కామన్‌ మ్యాన్‌ ఎంట్రీ కూడా ఉండనుంది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జునే వెల్లడిస్తూ ఓ ప్రోమో కూడా రిలీజ్‌ చేశాడు. కానీ సడన్‌గా బిగ్‌బాస్‌ షో హోస్ట్‌ మారనున్నారంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. కొన్నేళ్లుగా నాగార్జునే వ్యాఖ్యాతగా ఉన్నాడని దీంతో ఈసారి కొత్త యాంకర్‌ను తీసుకువస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

అక్కినేని నాగార్జునను కాదని టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంతను సంప్రదించారట, అందుకు ఆమె కూడా ఓకే చెప్పిందట! ఈ లెక్కన ఈ సారి నాగ్‌ను సైడ్‌ చేసి సమంత హోస్ట్‌గా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టబోతుందన్న వార్త తెగ చక్కర్లు కొడుతోంది. కానీ ఇప్పటికే నాగార్జున మాట్లాడిన ప్రోమో కూడా రిలీజ్‌ అవడంతో మరోసారి అతడే హోస్ట్‌గా వ్యవహరించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. పైగా సమంత తన క్యూట్‌నెస్‌తో అందరినీ పడగొట్టగలదు కానీ గట్టిగా మాట్లాడి కంటెస్టెంట్లను ఓదారిలో పెట్టగలదా? అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి 👇
ఆస్ట్రేలియా ఆఫర్‌, భారీ రెమ్యునరేషన్‌, కానీ మేనేజర్‌ను పర్సనల్‌గా కలవాలట!

Jr NTR: మాల్‌లో చిల్‌ అవుతున్న తారక్‌, ఎక్కడో తెలుసా?

Advertisement
 
Advertisement
Advertisement