దక్షిణాది సినీ పరిశ్రమ ఓ సినీ దిగ్గజాన్ని కోల్పోయింది. వెటరన్ డైరెక్టర్ భారతీ రాజా(84) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు సినీ రంగానికి ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. తమిళనాడు సీఎం విజయ్‌తో పాటు కోలీవుడ్ స్టార్స్ భారతీ రాజాకు నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన సినీ రంగంలో చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఆయన కేవలం పల్లె అందాలను ప్రేక్షకులకు చూపించడమే కాదు.. నటుడిగా కూడా రాణించారు. దర్శకత్వం వహిస్తూనే తన నటనతో అభిమానులను మెప్పించారు. చివరిసారిగా ఆయన తన కెరీర్‌లో నటించిన సినిమా తుడురుమ్. మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తుడరుమ్ చిత్రంలో స్టంట్ మాస్టర్ పళనిస్వామి పాత్రలో భరతిరాజా కనిపించారు.
అనారోగ్యంతోనే షూటింగ్..
తుడరుమ్ మూవీ సెట్స్‌పైకి వెళ్లే సమయంలోనే భారతీరాజా అనారోగ్యం, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయినప్పటికీ మందులు తీసుకుంటూనే షూటింగ్‌లో పాల్గొన్నారు. ఆయన చిత్ర నిర్మాణ బృందానికి భారం కాకూడదని పట్టుబట్టి మరి.. తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారని తుడరుమ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి వెల్లడించారు. భారతీ రాజా డైలాగులు గుర్తుంచుకోవడానికి.. రిపీట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారని గుర్తు చేసుకున్నారు.
భారతిరాజా కెరీర్..
దర్శకుడిగా భారతిరాజా మూవీ మేకింగ్‌ను స్టూడియోల నుంచి గ్రామీణ ప్రాంతాలకు తీసుకెళ్లడంతో సినిమారంగం స్వరూపాన్నే మార్చేసింది. ఆయన 1977 లో ‘16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి, రజనీకాంత్ నటించారు. తమిళ సినిమాకు 'మట్టి వాసన'ను పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఆయన తన కెరీర్‌లో ఆరు జాతీయ చలనచిత్ర అవార్డులను గెలుచుకున్నారు. అంతేకాకుండా 2004లో పద్మశ్రీ అందుకున్నారు.


