దర్శక దిగ్గజం భారతీ రాజా అంత్యక్రియలు ముగిశాయి. చెన్నైలోని ఆయన నివాసం నుంచి తేనిలో ఉన్న ఫామ్‌హౌస్‌కు పార్థివ దేహాన్ని తరలించారు. దిగ్గజ దర్శకుడికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన చివరి యాత్రలో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఆయన చివరి చూపు కోసం పెద్దఎత్తున అభిమానులు ఫామ్‌హౌస్‌కు తరలివచ్చారు.
అంతకుముందు సీనియర్ హీరోయిన్ భారతీ రాజా భౌతికకాయానికి నివాళులర్పించారు. భారతీరాజా సతీమణి హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. భారతీరాజాను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దిగ్గజ దర్శకుడు భారతీ రాజాకు తుది నివాళులర్పించేందుకు విచ్చేసిన గీత రచయిత వైరముత్తు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దర్శకుడి భౌతికకాయానికి నివాళులర్పిస్తూ వైరముత్తు కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా.. తీవ్ర అనారోగ్య సమస్యలతో భారతీ రాజా జూన్ 10న కన్నుమూశారు. ఆయన చివరిసారిగా మోహన్ లాల్ హీరోగా వచ్చిన తుడరుమ్ చిత్రంలో నటించారు.
VIDEO | Tamil Nadu: Actor Suhasini Maniratnam pays tributes to Bharathiraja in Theni, says “He changed the colour and character of Tamil cinema”.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/VkhkLxtFst— Press Trust of India (@PTI_News) June 11, 2026


