భాగ్యరాజ్‌ చివరి వీడియో.. ఎమోషనల్‌ అవుతున్న నెటిజన్స్‌! | Bhagyaraj Last Video: Attend Kushboo Sundar Daughter Wedding, Video Viral | Sakshi
Sakshi News home page

భాగ్యరాజ్‌ చివరి వీడియో.. ఖుష్బూ కూతురి పెళ్లిలో సందడి, ఇంతలోనే..

Jun 27 2026 12:23 PM | Updated on Jun 27 2026 12:45 PM

Bhagyaraj Last Video: Attend Kushboo Sundar Daughter Wedding, Video Viral

దిగ్గజ దర్శకుడు, నటుడు కె. భాగ్యరాజ్ (73) శనివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన హఠాన్మరణం సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద సమయంలో భాగ్యరాజ్‌కు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.ఆయన చివరిసారిగా పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించిన దృశ్యాలు ఇవే కావడం విశేషం.

ఈ నెల 25న నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కుమార్తె అవంతిక వివాహ వేడుక గోవాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు భాగ్యరాజ్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. పట్టు థోవతి, పట్టు చొక్కా ధరించి అక్కడ ఎంతో ఉత్సాహంగా గడుపుతూ, నూతన వధూవరులను ఆశీర్వదించారు. వేదికపైకి వస్తున్న భాగ్యరాజ్‌కి చేయి అందించాడు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. 

మరణించడానికి రెండు రోజుల  ముందు జరిగిన ఈ వేడుకలో ఆయన ఎంతో ఆరోగ్యంగా, నవ్వుతూ కనిపించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఆ వీడియోను చూసి భావోద్వేగానికి లోనవుతున్నారు. ‘కొన్ని గంటల క్రితం వరకు మన మధ్యే ఎంతో యాక్టివ్‌గా ఉన్న నటుడు, ఇంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం నమ్మలేకపోతున్నాం’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ 'చివరి వీడియో' సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement