
. ఈరోజు షారుక్ పోస్టర్‌ను తగలబెట్టాం. ఆయన నాకు ఎదురుగా వస్తే సజీవ దహనం చేస్తా..
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, ప్రముఖ హీరోయిన్ దీపిక పదుకొణె జంటగా నటిస్తున్న పఠాన్ మూవీపై ఆగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. ఇటీవల ఈ సినిమా నుంచి రిలీజైన బేషరమ్ పాట ఎంత వివాదాస్పదమైందో తెలిసిన విషయమే! బేషరమ్ పాటలో షారుక్, దీపికాలు ధరించిన దుస్తులపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ వివాదంపై అయోధ్యలోని తపస్వి చాన్వీకి చెందిన మహంత్ పరమహంస తీవ్రంగా స్పందించారు. షారుక్ కనిపిస్తే ఉన్నచోటనే తగలబెడతానని మండిపడ్డారు.
'బేషరమ్ వివాదంపై సనాతన ధర్మాన్ని ఆచరించే అందరూ నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు షారుక్ పోస్టర్‌ను తగలబెట్టాం. ఒకవేళ ఆయన కానీ నాకు ఎదురుగా వస్తే సజీవ దహనం చేస్తా. పఠాన్ సినిమా రిలీజైతే ఏకంగా థియేటర్లనే దగ్ధం చేస్తాం' అని పరమహంస వార్నింగ్ ఇచ్చారు. ప్రేక్షకులందరూ పఠాన్ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలని కోరారు.
చదవండి: ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే.. నా భర్త నాకే సొంతమనడం తప్పా?
హిట్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?