సౌత్‌లో బాడీ షేమింగ్‌.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు: హీరోయిన్‌ | Banita Sandhu: I Am Blacklisted From That Industry | Sakshi
Sakshi News home page

నా వల్ల కాదన్నా.. ఇండస్ట్రీ నుంచే వెలేశారు, చెండాలంగా ఉన్నానని వెగటు కామెంట్లు!

Jun 19 2025 6:23 PM | Updated on Jun 19 2025 6:35 PM

Banita Sandhu: I Am Blacklisted From That Industry

వాణిజ్య ప్రకటనలతో ప్రయాణం మొదలుపెట్టిన బనితా సంధు (Banita Sandhu) ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తోంది. తమిళంలో ఆదిత్య వర్మ (అర్జున్‌ రెడ్డి రీమేక్‌).. హిందీలో అక్టోబర్‌, సర్దార్‌ ఉద్ధమ్‌, మదర్‌ థెరిస్సా అండ్‌ మి చిత్రాలు చేసింది. హాలీవుడ్‌లో సినిమాతో పాటు వెబ్‌ సిరీస్‌లలోనూ యాక్ట్‌ చేసింది. ప్రస్తుతం అడివి శేష్‌ గూఢచారి 2 చిత్రం చేస్తోంది. అలాగే ఆమె నటించిన డిటెక్టివ్‌ షెర్డిల్‌ మూవీ జీ5లో శుక్రవారం (జూన్‌ 20) రిలీజ్‌ కానుంది.

నిద్ర లేకుండా షూటింగ్‌
ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బనితా సంధు మాట్లాడుతూ.. బాలీవుడ్‌లో ఇప్పుడిప్పుడే అంతా మెరుగవుతోంది. కెరీర్‌ తొలినాళ్లలో ఇండస్ట్రీ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నేను ఊహించినదానికన్నా భిన్నంగా ఉండేది. 16-18 గంటలు పని చేసేదాన్ని. రోజంతా షూటింగ్‌ చేయించుకుని రాత్రికి పంపించేవాళ్లు. సరైన నిద్ర ఉండేది కాదు. ఒక్కోసారి 24 గంటలు మేల్కొనే ఉండాల్సి వచ్చేది. అప్పుడు నేను.. నాకోసం, మిగతా సిబ్బంది కోసం నిలబడ్డాను. 

బ్లాక్‌లిస్ట్‌.. లెక్కచేయను
ఇది మంచి పద్ధతి కాదని నిర్మాతలను వారించాను. బహుశా అందుకేనేమో నన్ను ఆ ఇండస్ట్రీలో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. అయినా నేను అస్సలు పట్టించుకోను. నాకు ఏదనిపిస్తే అదే చేస్తాను. దక్షిణాది సినిమా (ఆదిత్య వర్మ) చేసినప్పుడు నన్ను బాడీ షేమింగ్‌ చేశారు. పీలగా, చెండాలంగా ఉన్నానని కామెంట్లు చేశారు. సినిమాలో ఇలాంటిదానికి హీరో ఎలా పడిపోయాడని వెకిలిగా మాట్లాడారు. బాడీ షేమింగ్‌ అనుభవించడం అదే మొదటిసారి అని బనితా చెప్పుకొచ్చింది.

చదవండి: సౌత్‌లో మంచి రోల్స్‌ ఇవ్వలే? యాంకర్‌కు కౌంటర్‌ ఇచ్చిన జెనీలియా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement