Bangladeshi Actress Raima Islam Shimu Suspicious Death, Her Husband Accepted Murder - Sakshi
Sakshi News home page

Raima Islam Shimu: న‌టి మిస్సింగ్ కేసు విషాదాంతం, భ‌ర్తే హంత‌కుడు!

Jan 19 2022 12:45 PM | Updated on Jan 19 2022 1:48 PM

Bangladeshi Actress Raima Islam Shimu Suspicious Death, Her Husband Accepted Murder - Sakshi

ఆ బ్యాగులో ఉన్న‌ది న‌టి రైమా మృత‌దేహంగా గుర్తించారు. ఆమె శ‌రీరంపై గాయాలు క‌నిపించ‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు న‌టి భ‌ర్త‌ను..

బంగ్లాదేశ్‌ న‌టి మ‌స్సింగ్ కేసు విషాదాంత‌మైంది. కొద్దిరోజుల క్రితం క‌నిపించ‌కుండా పోయిన న‌టి రైమా ఇస్లాం షిము విగ‌త‌జీవిగా ప్ర‌త్య‌క్ష‌మైంది. దీంతో పోలీసులు ఆమె భ‌ర్త‌ను అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ న‌టి రైమా ఇస్లాం షిము క‌నిపించ‌కుండా పోయింది. త‌న భార్య క‌నిపించ‌డం లేదంటూ ఆమె భ‌ర్త షెకావ‌త్ అలీ నోబెల్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు జ‌న‌వ‌రి 16న‌ మిస్సింగ్ కేసు న‌మోదు చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో దేశ రాజ‌ధాని ఢాకాలోని కెరానిగంజ్‌లో బ్రిడ్జి వ‌ద్ద ఒక గ‌న్నీ బ్యాగ్ క‌నిపించ‌డంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. వెంట‌నే ఆ ప్ర‌దేశానికి వెళ్లి ప‌రిశీలించిన పోలీసులు ఆ బ్యాగులో ఉన్న‌ది న‌టి రైమా మృత‌దేహంగా గుర్తించారు. ఆమె శ‌రీరంపై గాయాలు క‌నిపించ‌డంతో అనుమానం వ‌చ్చిన పోలీసులు న‌టి భ‌ర్త‌ను అదుపులోకి తీసుకుని విచారించ‌గా ఈ హ‌త్య‌లో త‌న ప్రమేయం ఉన్న‌ట్లు అంగీక‌రించాడు. ఈ హ‌త్య వెనుక గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కాగా రైమా 1998లో 'బ‌ర్త‌మాన్' సినిమాతో కెరీర్ ఆరంభించింది. సుమారు 25 చిత్రాల్లో న‌టించిన ఆమె ప‌లు బుల్లితెర‌పై ప‌లు టీవీ షోలు, సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ వాటిని నిర్మించింది.

Advertisement
 
Advertisement
Advertisement