బెస్ట్‌ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌.. వైర‌లవుతున్న క‌రీనా పోస్ట్ | Bahubali Prabhas Sends Biryani to Kareena Kapoor | Sakshi
Sakshi News home page

Kareena Kapoor and Prabhas: బెస్ట్‌ బిర్యానీ పంపినందుకు థ్యాంక్యూ ప్రభాస్‌.. వైర‌లవుతున్న క‌రీనా పోస్ట్ 

Sep 26 2021 3:09 PM | Updated on Sep 26 2021 3:25 PM

Bahubali Prabhas Sends Biryani to Kareena Kapoor - Sakshi

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన కో యాక్టర్స్‌కి ఫుడ్‌ పార్టీ ఇస్తుంటాడనే విషయం తెలిసిందే. అలా తాజాగా తన ‘ఆదిపురుష్‌’ సినిమాలో రావణ్‌ పాత్రలో నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌..

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ తన కో యాక్టర్స్‌కి ఫుడ్‌ పార్టీ ఇస్తుంటాడనే విషయం తెలిసిందే. తాజాగా ‘ఆదిపురుష్‌’ సినిమాలో రావణ్‌ పాత్రలో నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌కు ఈ పాన్‌ ఇండియా స్టార్‌ బిర్యానీ పంపించాడు. ఈ విషయమై బాలీవుడ్‌ బ్యూటీ, సైఫ్‌ భార్య కరీనా కపూర్‌ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఫొటో షేర్ చేసింది. దానికి.. ‘బాహుబ‌లి బిర్యానీ పంపించాడంటే అది క‌చ్చితంగా బెస్ట్‌ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు’ అని బ్యూటీ కామెంట్‌ రాసింది.

ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన కరీనా ఫుడ్‌ లవర్‌ కూడా. తన సోదరి కరిష్మా కపూర్‌, బెస్ట్‌ ఫ్రెండ్స్‌తో కలిసి పుడ్‌ తింటూ ఎంజాయ్‌ చేస్తున్నా వీడియోలను ఎన్నో సార్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. దీంతో ప్రభాస్‌ పంపించిన బిర్యానీ ఆకలి పెంచింది అంటూ లొట్టలేస్తూ తినేసి ఆ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కాగా ఈ బ్యూటీ ప్రస్తుతానికి అమీర్‌ఖాన్‌తో కలిసి ‘లాల్‌ సింగ్‌ చద్దా’ నటించింది. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement