అలా ఇచ్చేందుకు మీకు ఒక్క సినిమా కనిపించలేదా?: సాయి రాజేశ్ | Sakshi
Sakshi News home page

Sai Rajesh: మీ మనసుకు ఒక్కసారి కూడా ఇవ్వాలనిపించలేదా?: సాయి రాజేశ్

Published Tue, Nov 21 2023 6:42 PM

Baby Movie Director Sai Rajesh Comments On Movie Reviews - Sakshi

బేబీ మూవీతో సూపర్ హిట్‌ కొట్టిన డైరెక్టర్ సాయి రాజేశ్. ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిన్న సినిమాగా వచ్చిన బేబీ బాక్సాఫీస్‌ను‌ షేక్ చేసింది. ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. హృదయకాలేయం, కొబ్బరి మట్ట చిత్రాల తర్వాత బేబీ మూవీకి దర్శకత్వం వహించారు.

అయితే బేబీ హిట్‌తో జోష్‌లో ఉన్న సాయి రాజేశ్ మరో సినిమాను ఇటీవలే ప్రకటించారు. సంతోష్ శోభన్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమాకు సాయి రాజేష్ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా.. సుమన్ పాతూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బేబీ సినిమాతో తెలుగమ్మాయి వైష్ణవి చైతన్యకు హిట్‌ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మరో తెలుగమ్మాయి.. 'బిగ్ బాస్' ఫేమ్ అలేఖ్య హారికను కథానాయకిగా పరిచయం చేస్తున్నారు. 

అయితే తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరైన సాయి రాజేశ్ సినిమా రివ్యూయర్స్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. గత ఐదేళ్లుగా ఒక్క తెలుగు సినిమాకైనా 4 లేదా 4.5 రేటింగ్ ఇ‍చ్చారా? అని ప్రశ్నించారు. రాజమౌళి ఆర్ఆర్ఆర్, బాహుబలి లాంటి సినిమాలకు ఎంత రేటింగ్ ఇచ్చారని అడిగారు. మీరు 4 రేటింగ్ ఇచ్చేందుకు ఒక్క సినిమా కూడా మీ వెబ్‌సైట్లకు కనిపించలేదా? అన్నారు. ఈ విషయంలో మీకు మీరే ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అన్నారు.

మన సినిమాల విషయంలో కేవలం 2.75 నుంచి 3.5, 3.75 మధ్య రివ్యూలు ఇస్తూ ఎందుకిలా సేఫ్ గేమ్ ఆడుతున్నారు? గత పదేళ్లుగా 3.75 పైనా రేటింగ్‌ ఇచ్చినా ఒక్క సినిమా పేరు చెప్పండి చాలు? అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. మీరంతా కలిసి రివ్యూల విషయంలో ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అసలు మీ మనసుకు ఒక్కసారి కూడా 4 రేటింగ్ ఇవ్వాలని అనిపించలేదా? అని అడిగారు. 

సాయి రాజేశ్ అడిగిన ప్రశ్నకు ఓ మీడియా ప్రతినిధి సమాధానమిచ్చారు. ఆయన మాట్లాడుతూ.. 'మేము ఇచ్చే రివ్యూస్ మాత్రమే సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయలేవు. లక్కీగా చాలా సందర్భాల్లో మేము ఇచ్చే రివ్యూలు కూడా మ్యాచ్ అవుతాయి. ఎండ్‌ ఆఫ్‌ ది డే ఇది వ్యక్తిగత అభిప్రాయం. రాజమౌళి సినిమా కూడా ఫెయిల్ కావొచ్చు. అది మనం డిసైడ్ చేయలేం కదా.' అని చెప్పారు.

Advertisement
 
Advertisement
 
Advertisement