డ్రెస్‌ సర్దుకునే ఫోటోలు కూడా తీస్తారా? బిగ్ బాస్ నటి ఆగ్రహం! | Ayesha Khan Fire On Paps For Recording Actresses While Adjusting Dress | Sakshi
Sakshi News home page

Ayesha Khan: ఎక్కడ జూమ్‌ చేస్తున్నారు? చాలా అసహ్యంగా ఉంది.. 'ఐటం గర్ల్‌' ఫైర్!

Apr 4 2024 5:26 PM | Updated on Apr 4 2024 6:10 PM

Ayesha Khan Fire On Paps For Recording Actresses While Adjusting Dress - Sakshi

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ సీజన్- 17 ఫేమ్ అయేషా ఖాన్ చేసిన పోస్ట్ బీ టౌన్‌లో చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే ఎలా పడితే అలా ఫోటోలు తీస్తున్నారని మండిపడింది. కొందరు మీడియా ప్రతినిధులు ఉద్దేశపూర్వకంగా నటీమణులను అనుచితమైన కోణాల్లో రికార్డ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరంతా కనీస కనీస మర్యాదల గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని... మీ ప్రవర్తన చూస్తుంటే చాలా అసహ్యంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. 

ఆయేషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాస్తూ..'అసలు ఆ యాంగిల్స్ ఏమిటి? మీరు ఎక్కడ జూమ్ చేస్తున్నారు? అసలు మీకు అనుమతి ఉందా? కొందరు మీడియా వాళ్లు ఎందుకు ఇలాంటి తప్పులు చేస్తున్నారు? ఒక స్త్రీ భయం లేకుండా తన దుస్తులు కూడా సర్దుకునే స్వేచ్ఛ లేదా? ఇది తలుచుకుంటేనే చాలా అసహ్యంగా ఉంది. ఒక మహిళ తన కారులో నుంచి దిగే ముందు తన దుస్తులను సర్దుకుంటూ కనిపిస్తుంది. ఆ ఫోటోలను కూడా మీరు క్యాప్చర్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నారా? ఒక మహిళ తనను వెనుక నుంచి ఫోటోలు తీయవద్దని కోరుకుంటుంది. మహిళలకు కనీస మర్యాద ఎలా ఇవ్వాలో మీరు నేర్చుకోండి అంటూ' చురకలు అంటించింది.  

కాగా.. సోషల్ మీడియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి.. హిందీ బిగ్‌ బాస్ సీజన్‌-17లో మెరిసింది. ప్రస్తుతం విశ్వక్‌ సేన్ ‍మూవీ గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరిలో ఐటమ్‌ సాంగ్‌లో కనిపించనుంది. అ తర్వాత మలయాళ చిత్రం లక్కీ బాస్కర్‌లో నటించనుంది. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా కనిపించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement