Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22 - Sakshi
Sakshi News home page

Lil Bo Weep: 22 ఏళ్ల యూట్యూబ్‌ స్టార్ మృతి.. తండ్రి భావోద్వేగపు పోస్ట్‌

Mar 8 2022 6:12 PM | Updated on Mar 8 2022 8:22 PM

Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22 - Sakshi

Australian Rapper YouTube Star Lil Bo Weep Dies At 22: ప్రముఖ ఆస్ట్రేలియిన్‌ ర‍్యాపర్‌, యూట్యూబ్‌ స్టార్‌ లిల్‌ బో వీప్‌ అకాల మరణం చెందింది. 22 ఏళ్ల ఈ గాయని మార్చి 3న తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి మాథ్క్యూ స్కోఫీల్డ్‌ సోషల్‌ మీడియా వేదికైన ఫేస్‌బుక్‌లో తెలిపారు. ఈ పోస్ట్‌లో 'డిప్రెషన్, బాధ, పీటీఎస్‌డీ, డ్రగ్స్‌కు వ్యతిరేకంగా మా కుమార్తె కోసం ఈ వారమంతా పోరాడుతూనే ఉన్నాం. ఆమెను అమెరికా నుంచి ఇక్కడికీ తీసుకువచ్చినప్పటినుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. మేము పక్కనే ఉన్నప్పుడు ఆమె తన రాక్షసులతో తీవ్రంగా పోరాడింది. కానీ మేము ఆమెను కోల్పోయాం. మేము కూడా ఓడిపోయాం' అంటూ రాసుకొచ్చారు. అయితే ఆమె మృతికి గల సరైన కారణాలను ఇంకా వెల్లడించలేదు. 

గాయని లిల్‌ బో వీప్‌ మృతిపట్ల ఆమె అభిమానులు విచారం వ్యక్తం చేశారు. 'ఐ లవ్‌ యూ. ఐయామ్‌ సారీ బేబీ గర్ల్‌. మరో జీవితం', 'రెస్ట్ ఇన్ పీస్‌ వినోనా, నా కష్టతరమైన సమయంలో మీ సంగీతం నాకు సాంత్వన కలిగించింది.' అంటూ కామెంట్స్‌ పెట్టారు. లిల్ అభిమానుల ప్రేమను చూసి ఆమె తండ్రి మళ్లీ 'ఆమె తండ్రిగా నేను చాలా గర్వపడుతున్నాను. తను నా హీరో, నా కూతురు, నా బెస్ట్‌ ఫ్రెండ్‌. తనను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఆమె మళ్లీ తిరిగి వస్తుంది.' అంటూ రాసుకొచ్చారు. లిల్‌ బో వీప్ అసలు పేరు 'వినోనా బ్రూక్స్‌'. 2015సో సౌండ్‌క్లౌడ్‌లో తన సంగీతం కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత అనేక మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. 'పీటీఎస్‌డీ' పేరుతో ఒక నిమిషంన్నర నిడివి గల పాటను ఆమె చివరిగా పోస్ట్‌ చేసింది.  

Advertisement
 
Advertisement
Advertisement