ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్.. హైదరాబాద్‌లో శనివారం రాత్రి కన్సర్ట్ నిర్వహించారు. తన లైవ్ ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి రెహమాన్ అభిమానులు, సంగీత ప్రియులు వేలాది తరలివచ్చారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ కన్సర్ట్‌లో రెహమాన్.. తమిళ, హిందీ పాటలు ఆలపించారు. అలానే తెలుగులోని కొన్ని సాంగ్స్ కూడా పాడారు. 'పెద్ది' హీరోహీరోయిన్ల రామ్ చరణ్, జాన్వీ కపూర్‌తో పాటు దర్శకుడు బుచ్చిబాబు సందడి చేశారు. ఇక స్క్రీన్ పై 'పెద్ది' నుంచి ఈ మధ్యే రిలీజైన 'చికిరి' పాటని ప్లే చేయడం విశేషం.


