Anupama Parameswaran says she is engaged, but there is a twist - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: నిశ్చితార్థం జరిగిందన్న అనుపమ.. ఫోటో వైరల్‌

May 31 2023 5:50 PM | Updated on May 31 2023 6:15 PM

Anupama Parameswaran Says She Engaged, But There is a Twist - Sakshi

తన ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. కాకపోతే అది నిజమైన నిశ్చితార్థం కాదు, ఉట్టిదే! ఓ ప్లాస్టిక్‌ కవర్‌ను చేతికి ఉంగరంలా చుట్టుకున్న అనుపమ ఆ ఫోటో

అనుపమ పరమేశ్వరన్‌.. ఈమె పేరు చెప్తే చాలా చాలామంది అబ్బాయిలు గాల్లో తేలిపోతుంటారు. అనుపమ మా గుండెకాయ అంటూ ఫోన్‌లో, వాట్సాప్‌ డీపీల్లో ఆమె ఫోటోనే పెట్టుకుని తన్మయత్వానికి లోనవుతుంటారు. అలాంటిది ఈ హీరోయిన్‌ అభిమానుల గుండెల్లో బాంబు పేల్చుతూ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేసి పెళ్లి చేసుకుంటే ఏమైపోతారో!

కొంటె పోస్ట్‌
తాజాగా అనుపమ అలాంటి స్వీట్‌ షాకిచ్చింది. తన ఎంగేజ్‌మెంట్‌ అయిపోయిందని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది. కాకపోతే అది నిజమైన నిశ్చితార్థం కాదు, ఉట్టిదే! ఓ ప్లాస్టిక్‌ కవర్‌ను చేతికి ఉంగరంలా చుట్టుకున్న అనుపమ ఆ ఫోటోను షేర్‌ చేసి ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది అని సరదాగా రాసుకొచ్చింది. అది నిజమైతే మేమంతా ఏమైపోవాలి అనుపమ అని కామెంట్లు పెడుతున్నారు హీరోయిన్‌ ఫ్యాన్స్‌.

అనుపమ సినీ జర్నీ..
2015లో వచ్చిన ప్రేమమ్‌ సినిమాతో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్‌. ఈ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో అనుపమకు ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. అఆతో తెలుగు తెరకు రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇక్కడ రీమేక్‌ అయిన ప్రేమమ్‌లో మరోసారి నటించింది. తర్వాత పలు చిత్రాలు చేసిన ఆమె ప్రస్తుతం తమిళంలో సైరన్‌, మలయాళంలో జేఎస్‌కే ట్రూత్‌ షెల్‌ ఆల్వేస్‌ ప్రీవేల్‌, తెలుగులో టిల్లు స్క్వేర్‌, ఈగల్‌ సినిమాలు చేస్తోంది.

చదవండి: ఓటీటీలో ఉగ్రం.. ఎక్కడంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement