స్టార్‌ హీరోయిన్స్‌ జపం చేస్తున్న ‘రౌడీ’ | Sai Pallavi To Play Key Role In Vijay Devarakonda's New Film | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరోయిన్స్‌ జపం చేస్తున్న ‘రౌడీ’.. ఈ సారి లేడీ పవర్‌స్టార్‌తో రొమాన్స్‌!

Jun 8 2024 1:29 PM | Updated on Jun 8 2024 1:41 PM

Sai Pallavi To Play Key Role In Vijay Devarakonda's New Film

ఈ మధ్య కాలంలో విజయ్‌ దేవరకొండ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్లు కనిపించడం ట్రెండ్‌గా మారింది. గతేడాది రిలీజ్‌ అయిన ఖుషీ నుంచి ఇదే ట్రెండ్‌ రిపీట్‌ అవుతోంది. ఆ చిత్రంలో స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించింది. ఇక ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఫ్యామిలీ స్టార్‌లో కూడా మరో స్టార్‌ హీరోయిన్‌ మృణాలు ఠాకూర్‌ మెరిసింది. అయితే ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అయినా కూడా విజయ్‌ స్టార్‌ హీరోయిన్‌ ట్రెండ్‌నే ఫాలో అవుతున్నాడు. తన తదుపరి చిత్రంలో కూడా స్టార్‌ హీరోయిన్ నటించబోతుందట. ఆమె మరెవరో కాదు లేడీ పవర్‌స్టార్‌ సాయి పల్లవి. 

నిజానికి విజయ్‌, సాయిపల్లవి కాంబినేషన్‌లో సినిమా రావాలని టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ జోడికి దగ్గ కథ లేకపోవడం ఇన్నాళ్లు కలిసి నటించలేదు. తాజాగా యంగ్‌ డైరెక్టర్‌ రవికిరణ్‌ కొల్లా ఓ అందమైన ప్రేమ కథతో వీరిద్దరిని కలిశాడు. స్టోరీ నచ్చడంతో కలిసి నటించేందుకు ఇద్దరూ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఫిలిం సర్కిల్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఈ చిత్రంతో అయినా విజయ్‌ హిట్‌ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement