నాన్నకు కారు గిఫ్ట్ ఇచ్చిన తెలుగు యాంకర్ | Anchor Lasya Manjunath Surprised Her Father By Gifting Special Car, Photos Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఫాదర్స్ డే.. నాన్న కోరిక నెరవేర్చిన లాస్య

Jun 18 2025 1:13 PM | Updated on Jun 18 2025 1:21 PM

Anchor Lasya Gifts Car To Her Father

సాధారణంగా ఫాదర్స్ డే అనగానే చాలామంది విష్ చేస్తారు. లేదంటే వాట్సాప్‌లో స్టేటస్ పెడుతుంటారు. కానీ కొందరు మాత్రం నాన్న కలని నిజం చేస్తుంటారు. తెలుగు యాంకర్ లాస్య ఇప్పుడు అలాంటి ఓ పని చేసింది. తండ్రికి కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)

తెలుగులో కొన్నేళ్ల క్రితం యాంకర్‌గా పలు టీవీ షోలు చేసిన లాస్య.. తర్వాత కొన్నాళ్లకు బిగ్‌బాస్ 4వ సీజన్‌లోనూ పాల్గొంది. కాకపోతే విజేతగా నిలవలేకపోయింది. అయితేనేం సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. తర్వాత మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈమెకు ఇద్దరు కొడుకులు కూడా పుట్టారు. ప్రస్తుతానికైతే యూట్యూబ్ వీడియోలు చేస్తూ సంపాదిస్తోంది. అలా కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బుతో తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారుని బహుమతిగా ఇచ్చింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 లక్షల వరకు ఉంది.

చిన్నప్పటి నుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది తన ఆశ అని చెప్పిన లాస్య.. పెళ్లి తర్వాత తాను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారని, ఇప్పుడు తన దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఆ ఫొటోలని ఇన్ స్టాలో, వీడియోని యూట్యూబ్‍‌లో పోస్ట్ చేసింది. కడపకు చెందిన లాస్య.. తల్లిదండ్రులు ప్రస్తుతం ఊరిలోనే ఉంటారు. ఈమె మాత్రం భర్తతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement