Ammu: Colors Swathi Interesting Comments About Naveen Chandra, Deets Inside - Sakshi
Sakshi News home page

Colors Swathi : 'అది చూసి షాక్‌ అయ్యాను... ఆ హీరోను మాట్లాడొద్దని చెప్పేశాను'

Oct 20 2022 3:19 PM | Updated on Oct 20 2022 5:09 PM

Ammu: Colors Swahi Intresting Comments About Naveen Chandra - Sakshi

నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అమ్ము'. నేరుగా ఆమెజాన్‌ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యిందీ చిత్రం. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ‍్యవహరించారు.

తాజాగా ఈ సినిమా ప్రీమియర్‌ షోకు హాజరైన హీరోయిన్‌ కలర్స్‌ స్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'నవీన్‌ చంద్ర మన ఇండస్ట్రీకి దొరికొన జెమ్‌ లాంటివాడు.

ఈ సినిమాలో అతను పోషించిన శాడిస్ట్‌ రోల్‌ చూసి షాక్‌ అయ్యాను. అతన్ని చూడాలంటేనే భయం వేసింది. ఇంటర్వెల్లో  వచ్చి నాతో మాట్లాడతోతే.. నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పేశాను. అంతలా నవీన్‌ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు' అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది స్వాతి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement