Colors Swathi
-
సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతిలకు అవార్డ్స్ (ఫోటోలు)
-
'మంత్ ఆఫ్ మధు' రివ్యూ
టైటిల్: మంత్ ఆఫ్ మధు నటీనటులు: స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తదితరులు మ్యూజిక్: అచ్చు రాజమణి సినిమాటోగ్రఫీ: రాజీవ్ ధరావత్ డైరెక్టర్: శ్రీకాంత్ నాగోతి ప్రొడ్యూసర్: యశ్వంత్ ములుకుట్ల నిడివి: 2h 20m కథేంటి? అది వైజాగ్. మధుసూధన్ రావు(నవీన్ చంద్ర) ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం పోగొట్టుకుంటాడు. మరోవైపు విడాకుల కేసు పెట్టిన భార్య లేఖ (స్వాతి రెడ్డి).. ఎప్పటికైనా తన దగ్గరకు మళ్ళీ తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యానికి బానిస అయిపోతాడు. వీళ్లకు ఫ్లాష్ బ్యాక్ లో ఓ లవ్ స్టోరీ. మరోవైపు మధుమతి(శ్రియ నవిలే).. బంధువుల ఇంట్లో పెళ్లికోసం అమెరికా నుంచి వైజాగ్ వస్తుంది. ఓ సందర్భంలో ఈమెకి హీరో మధు పరిచయం అవుతాడు. మాటల సందర్భంలో అతడి ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు మధుసూదన్- లేఖ కలిశారా? లేదా అనేది స్టోరీ. ఎలా ఉందంటే? మంత్ ఆఫ్ మధు సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన మధు అనే ఓ అమ్మాయి.. వైజాగ్ లో నెల రోజుల్లో ఫేస్ చేసిన అనుభవాలే. ఇన్నాళ్లు తమిళ్, మలయాళంలో నేచురల్ సినిమాలు చూసి.. అయ్యో ఇలాంటివి మన తెలుగులో వస్తే బాగున్ను కదా అని చాలామంది అనుకున్నారు. అలాంటి ప్రయత్నమే ఈ సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. బార్ లో మందు తాగుతున్న హీరోని కొందరు వ్యక్తులు ఎలా పడితే అలా చితక్కొట్టే సీన్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 2003 వైజాగ్ కి చెందిన ఓ కుర్రాడు మధుసూధన్. కాలేజీ చదివే అమ్మాయి లేఖ. ఇద్దరు డీప్ లవ్ లో ఉంటారు. ఏకాంతంగా కలవడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తే దాన్ని తీయించుకోవడానికి ఓ క్లినిక్ కి వెళ్తారు. ఆ తర్వాత వీళ్లు, వాళ్ల చుట్టూ ఉండే పాత్రలు పరిచయం చేస్తూ వెళ్ళారు. మరి ఈ కథ కంచికి చేరింది లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అయితే సినిమాని చాలా నేచురల్ గా తీశారు. 2003 వైజాగ్ పరిస్థితుల్ని చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాలో అసలు స్టోరీ ఏంటనేది సినిమా మొదలై చాలాసేపు అయిన ఓ పట్టానా అర్థం కాదు. తెరపై పాత్రలు వస్తుంటాయి, పోతుంటాయి కానీ ఒక్క సీన్ కూడా ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోతం. భార్య - భర్త, వాళ్ళ మధ్య మనస్పర్ధలు, బాధ, ప్రేమ, విరహం, ఒక్కటి కావాలనే తపన ఇలా చాలా పాయింట్స్ ఉంటాయి. ఇందులో అలాంటివి ఉన్నా సరే వాటిని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. అలానే టైటిల్ రోల్ చేసిన మధు అనే అమ్మాయి పాత్ర, ఆమె మాట్లాడే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ చిరాకు తెప్పిస్తుంది. సినిమాలో స్వాతి, నవీన్ చంద్ర, మంజుల, వైవా హర్ష తప్ప మరో తెలిసిన ముఖం కనిపించదు! ఎవరెలా చేశారు? మధుసూధన్ రావు పాత్ర చేసిన నవీన్ చంద్ర, లేఖ పాత్ర చేసిన స్వాతి బాగానే చేశారు. కానీ వీళ్ళ పాత్రల్లో డెప్త్ మిస్ కావడంతో ఎంత నేచురల్ గా తీసినా అవి తేలిపోయాయి. మహేష్ సోదరి మంజుల ఓ నాలుగైదు సీన్స్ లో కనిపించింది. వైవా హర్ష అక్కడక్కడ కనిపించి కాస్త నవ్వించాడు. మధుమతిగా చేసిన శ్రియ నవిలే.. ఆ పాత్రకి అసలు సూట్ కాలేదనిపించింది. అయితే యోగ టీచర్ వాసుకిగా చేసిన జ్ఞానేశ్వరి మాత్రం చూడ్డానికి చాలా బాగుంది. మిగతా వాళ్లంతా ఓకే అనిపించారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే.. పాటలు పెద్దగా గుర్తుండవ్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. అయితే సినిమాలో రెండు ర్యాప్ సాంగ్స్ ఉంటాయి. అవి సింక్ లేకుండా ఎందుకు పెట్టారో అర్థం కాదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఓవరాల్ గా చెప్పుకుంటే 'మంత్ ఆఫ్ మధు' రెగ్యులర్ ఆడియెన్స్ కి నచ్చడం కష్టమే! - చందు, సాక్షి వెబ్ డెస్క్ చదవండి: క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 మూవీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
వేదికపైనే బోరున ఏడ్చేసిన కలర్స్ స్వాతి.. ఎందుకంటే?
నవీన్ చంద్ర, కలర్స్ స్వాతి కలిసి నటిస్తోన్న తాజా చిత్రం మంత్ ఆఫ్ మధు. ఈ చిత్రానికి శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీరిద్దరూ త్రిపుర చిత్రంలో జంటగా కనిపించారు. మరోసారి వెండితెరపై జంటగా ప్రేక్షకులను అలరించనున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉంది చిత్రబృందం. మూవీ ప్రమోషన్లలో భాగంగా నవీన్ చంద్ర, స్వాతి వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్ మీట్లో స్వాతిపై నవీన్ చంద్ర ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అతని మాటలు విన్న కలర్స్ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: కలర్స్ స్వాతితో పెళ్లి.. అసలు విషయం చెప్పేసిన నవీన్ చంద్ర!) నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ' ఈ సినిమాలో లేఖ అనే క్యారెక్టర్ చేయడానికి చాలా గడుసు కావాలి. మా సిస్టర్ జాబ్ చేస్తుంటారు. తాను బస్సు, ఆటో, మెట్రోలో రోజు ప్రయాణం చేయాలి. తన కుటుంబం కోసం కష్టపడాలి. అలాగే స్వాతి కూడా చాలా హార్డ్ వర్క్ పర్సన్. తనను నేను మా ఫ్యామిలీ మెంబర్‌గానే చూస్తాను. తను కష్టపడడమే కాకుండా.. తనతో పనిచేసే వారిలో నమ్మకం కలిగిస్తుంది. ఆ దేవుడిని ఇంతకంటే ఏమీ అడగలేను. అందుకే తను నా బెస్ట్ ఫ్రెండ్. భవిష్యత్తులోనూ ఏదైనా అవకాశమొస్తే మేమిద్దరం కలిసి నటిస్తాం. మేం మంచినటులం. మీ అందరు మా జోడీని ఇంత బాగా గుర్తిస్తున్నందుకు చాలా థ్యాంక్స్.' అని అన్నారు. అయితే నవీన్ చంద్ర మాటలకు స్వాతి వేదికపైనే ఏడ్చేసింది. నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అంటూ స్వాతి ఫుల్ ఎమోషనలయ్యారు. కాగా.. ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
సాయి ధరమ్ తేజ్ కి ముద్దు పెట్టిన కలర్స్ స్వాతి
-
Colors Swathi On Divorce Rumours: కలర్స్ స్వాతి విడాకుల రూమర్స్.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు
-
స్వాతి నా ఆల్ టైం క్రష్, అప్పటి నుంచి తనని చూస్తున్నా: డైరెక్టర్ హరీశ్ శంకర్
చాలా గ్యాప్ తర్వాత ‘కలర్స్’ స్వాతి రీఎంట్రీ ఇస్తున్న మూవీ ‘పంచతంత్రం’. ఐదు కథలతో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రి రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్, కలర్స్ స్వాతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్వాతి తన ఆల్ టైమ్ క్రష్ అని చెప్పాడు. ‘‘కలర్స్’ ప్రోగ్రామ్ నుంచి తను స్వాతిని చూస్తున్నారు. ఆమె నా ఆల్ టైం క్రష్. మిరపకాయ్ చిత్రంలో స్వాతి ఓ రోల్ చేసింది. ఆమె ఇక్కడ ఉండటం తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం’’ అంటూ స్వాతిపై ప్రశంసలు కురింపించాడు ఆయన. ఇక సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి చక్కని టైటిల్ పెట్టడంలోనే దర్శకడుఉ సగం సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాలోని హీరోయిన్స్ అంతా తెలుగువారే అని అన్నారు. నా సినిమాల్లో కూడా తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వాలనే అనుకుంటూ ఉంటాను. కాకపోతే కొన్నిసార్లు న్యాయం చేయలేకపోతుంటాను. ఇందాకటి నుంచి అంతా ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ అయిన తరువాత ఇది చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని తెలుస్తుంది’ అని అన్నాడు. చదవండి: జూనియర్ ఎన్టీఆర్‌పై సాయి ధరమ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు అభిమానిగానే చిరంజీవికి ఆనాడు విజ్ఞప్తి చేశా: వర్మ క్లారిటీ -
ఆ హీరోను నాతో మాట్లాడకు అని మొహం మీదే చెప్పాను: కలర్స్ స్వాతి
నవీన్ చంద్ర - ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అమ్ము'. నేరుగా ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలయ్యిందీ చిత్రం. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరకెక్కించారు. అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించగా.. ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. ఈ చిత్రానికి చారుకేష్ శేఖర్ దర్శకత్వం వహించగా.. కార్తీక్ సుబ్బరాజ్ నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన హీరోయిన్ కలర్స్ స్వాతి సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... 'నవీన్ చంద్ర మన ఇండస్ట్రీకి దొరికొన జెమ్ లాంటివాడు. ఈ సినిమాలో అతను పోషించిన శాడిస్ట్ రోల్ చూసి షాక్ అయ్యాను. అతన్ని చూడాలంటేనే భయం వేసింది. ఇంటర్వెల్లో వచ్చి నాతో మాట్లాడతోతే.. నాతో మాట్లాడకు ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్పేశాను. అంతలా నవీన్ తన క్యారెక్టర్‌కు న్యాయం చేశాడు' అంటూ అతనిపై పొగడ్తల వర్షం కురిపించింది స్వాతి. -
బ్రేక్‌కి బ్రేక్.. రీ ఎంట్రీ ఇస్తున్న అలనాటి తారలు
సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు ఆనందపడుతుంది? తన అభిమాన తార సినిమా తెరకు వచ్చినప్పుడు. సిల్వర్ స్క్రీన్ ఎప్పుడు బాధపడుతుంది... తన అభిమాన తార సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పుడు. ఆ బ్రేక్‌కి బ్రేక్ ఇచ్చి ఆ తారలు మళ్లీ సినిమాలు చేస్తే.. రండి.. రండి.. రండి.. మీ రాక ఎంతో ఆనందమండి అని వెండితెర ఆహ్వానించకుండా ఉంటుందా. ఇక కొందరు తారలు బ్రేక్ తర్వాత చేస్తున్న సినిమాల గురించి తెలుసుకుందాం. 28 ఏళ్ల తర్వాత... బ్యాక్ టు బ్యాక్ జాతీయ ఉత్తమ నటిగా (తమిళ చిత్రం ‘వీడు’– 1987, తెలుగు చిత్రం ‘దాసి’– 1988 చిత్రాల్లోని నటనకు) అవార్డులు సాధించిన అర్చన ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ‘నిరీక్షణ’, ‘లేడీస్ టైలర్’, ‘భారత్ బంద్’ వంటి తెలుగు చిత్రాల్లో అర్చన యాక్టింగ్ అదుర్స్ అని అప్పట్లో తెలుగు ప్రేక్షకులు కితాబులిచ్చారు. అర్చన కేవలం తెలుగులోనే కాదు.. తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లోనూ సినిమాలు చేశారు. అయితే మిగతా భాషల్లో అప్పుడప్పుడు సినిమాలు చేస్తున్నా తెలుగు తెరపై నల్లపూస అయిపోయారు అర్చన. 1994లో వచ్చిన ‘పచ్చతోరణం’ తర్వాత మరో తెలుగు మూవీలో ఆమె కనిపించలేదు. ఇప్పుడు అర్చన మళ్లీ తెలుగు డైలాగ్స్ చెబుతున్నారు. ఈ డైలాగ్స్ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న ‘చోర్ బజార్’ చిత్రం కోసమే. జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాశ్ తల్లిగా కనిపిస్తారు అర్చన. ఈ ఏడాదే ‘చోర్ బజార్’ చిత్రం థియేటర్స్‌కు రానున్నట్లుగా తెలిసింది. అంటే.. దాదాపు 28 సంవత్సరాల తర్వాత అర్చన మళ్లీ తెలుగు తెరపై కనిపించనున్నారన్నమాట. తమిళంలో ఇరవై.. తెలుగులో పది తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘శివ’లో హీరోయిన్గా చేసిన అమలను అంత ఈజీగా మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు. అయితే 1993లో ‘ఆగ్రహం’ తర్వాత అమల తెలుగు సినిమాకు గ్యాప్ ఇచ్చారు. తిరిగి 2012లో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రం ద్వారా తెలుగు తెరపై కనిపించారు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఆ తర్వాత ‘మనం’ (2014) చిత్రంలో అతిథిగా కనిపించినప్పటికీ ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది మాత్రం తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) లోనే అని చెప్పాలి. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన ఈ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రంలో శర్వానంద్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఇందులో శర్వా తల్లి పాత్రలో కనిపిస్తారు అమల. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో అమల కనిపించనున్న చిత్రం ‘ఒకే ఒక జీవితం’. ఇక తమిళంలో 1991లో వచ్చిన ‘కర్పూర ముల్లై’ తర్వాత అమల మరో సినిమా చేయలేదు. ఇరవైసంవత్సరాల తర్వాత ‘కణం’ సినిమాతో తమిళ తెరపై ఆమె మళ్లీ కనిపించనున్నారు. రెండు దశాబ్దాలకు మళ్లీ... ‘బద్రి, జానీ’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేణూ దేశాయ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2003లో వచ్చిన ‘జానీ’ తర్వాత తెలుగులో ఆమె మరో చిత్రం చేయలేదు. 2014లో మరాఠీ చిత్రం ‘ఇష్క్ వాలా లవ్’కి దర్శకత్వం వహించారు కానీ నటిగా వెండితెరపై మాత్రం మెరవలేదు. ఇప్పుడు కనిపించనున్నారు. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఓ కీ రోల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారామె. ఈ సినిమాకు వంశీ దర్శకుడు. ఆల్రెడీ షూటింగ్ మొదలైంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజయ్యే చాన్స్ ఉంది. పదేళ్ల తర్వాత.. ‘వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ’... ఈ డైలాగ్ విన్న వెంటనే జెనీలియా గుర్తు రాకుండా ఉండరు. 2012లో వచ్చిన ‘నా ఇష్టం’ సినిమా తర్వాత జెనీలియా మరో తెలుగు సినిమా సైన్ చేయలేదు. ఇటీవలే ఆమె ఒక తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కిరీటి (వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో జెనీలియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత జెనీలియా తెలుగు సినిమావైపు చూశారు. రాధాకృష్ణ దర్శకత్వంలో ద్విభాషా (తెలుగు, కన్నడం) చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. డబుల్ ధమాకా ‘గోల్కొండ హైస్కూల్’, ‘స్వామి రా రా’, ‘కార్తికేయ’ వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ‘కలర్స్’ స్వాతి ప్రేక్షకులకు సుపరిచితురాలే. 2017లో వచి్చన ‘లండన్ బాబులు’ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. దాదాపు ఐదేళ్ల తర్వాత తెలుగులో ఆంథాలజీ ఫిల్మ్ ‘పంచతంత్రం’ అంగీకరించారు. అలాగే ఈ సినిమాతో పాటు స్వాతి ‘ఇడియట్స్’ అనే ఫిల్మ్ కూడా చేశారు. స్వాతి, నిఖిల్ దేవాదుల, సిద్ధార్థ్ శర్మ, శ్రీ హర్ష ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న ఈ సినిమాకు ఆదిత్యా హాసన్ దర్శకుడు. అభిõÙక్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి నవీన్ మేడారం షో రన్నర్. ఇలా కమ్బ్యాక్లోనే ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ డబుల్ ధమాకా ఇస్తున్నారు స్వాతి. వీరే కాదండోయ్... ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో సోనాలీ బింద్రే, రామ్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో మీరా జాస్మిన్ కీ రోల్స్ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా తెలుగు సినిమాల పరంగా బ్రేక్‌లో ఉన్న మరికొందరు తారలు కూడా రీ ఎంట్రీ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. -
భీమిలిలో కలర్స్ స్వాతి సందడి
కొమ్మాది(భీమిలి): భీమిలి బీచ్‌రోడ్డు మంగమారిపేట తీరం వద్ద బుధవారం హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేసింది. అందాల రాక్షసి ఫేమ్ నవీన్‌చంద్ర నటిస్తున్న కొత్త చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. పల్లెటూరు నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ కళాశాలకు వెళ్లే సన్నివేశాలను ఇక్కడ షూట్ చేశారు. ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్వంత్ నిర్మాత. హీరో నవీన్‌చంద్రపై చిత్రీకరిస్తున్న దృశ్యం -
ఆకట్టుకుంటున్న ‘పంచతంత్రం’ టీజర్
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, కలర్స్ స్వాతి, శివాత్మిక రాజశేఖర్, సముద్రఖని, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘పంచతంత్రం’. ఎన్నో పంచతంత్ర కథలను సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న ఈ చిత్రానికి హార్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. నటుడు సత్యదేవ్ వాయిస్ ఓవర్‌తో పంచతంత్ర కథలను బెబుతూ విడుదలైన ఈ టీజర్ ఆసక్తిగా సాగింది. ‘అనగనగా ఓ పెద్ద అడవి. ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ కూడు, గూడు, తోడు దొరికాక.. నాలుగో జీవనాధారం కోసం ఓ చోట కలుసుకున్నాయి. ఆ జీవనాధారమే కథలు. సింహం విసిరిన పంజా కథలు. చిరుత పెట్టిన పరుగు కథలు.. ఈగ చెప్పిన బాహుబలి కథలు.. వినటానికి వచ్చిన వాటికి మైక్ దగ్గర ఓ ముసలి తాబేలు కలిసింది’ అంటూ ప్రారంభమైంది. నిత్య జీవితంలో మనకు ఎదురయ్యే ఎన్నో కథలను ఆధారంగా చేసుకుని ఈ ఫీల్ గుడ్ మూవీగా పంచతంత్రం చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి అఖిలేష్ వర్ధన్, సృజన్‌లు నిర్మాతలుగా వ్వవహరిస్తున్నారు. -
పైలెట్‌తో స్వాతి పెళ్లి
‘అష్టా చమ్మా’ సినిమాలో ‘మహేశ్ మహేశ్...’ అంటూ కలవరించే మహేశ్ అభిమానిగా కనిపిస్తారు ‘కలర్స్’ స్వాతి. కానీ ప్రస్తుతం ఆమె కలవరిస్తున్న పేరు వికాస్ అట. కొంటె చూపుతో ఓ కొంటె చూపుతో అంటూ వికాస్ అనే పైలెట్ స్వాతి మనసుని దోచేశారట. ఇక్కడున్న ఫొటోని చూసి పెళ్లి ఆల్రెడీ అయిపోయింది అనుకుంటే పొరబడ్డట్టే. ఇది సినిమాలోని పెళ్లి ఫొటోనే. నిజమైన పెళ్లి మరో 15రోజుల్లో జరగనుంది. ‘అష్టా చమ్మా, సుబ్రమణ్యపురం, కార్తికేయ వంటి సినిమాలతో తెలుగులో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించక ముందు చిన్ని తెరపై ‘కలర్స్’ స్వాతిగా బోలెడంత పాపులార్టీ సంపాదించుకున్నారామె. ఈ మధ్య సినిమాలకు చిన్న గ్యాప్ ఇచ్చారు. పర్సనల్ లైఫ్‌పై ఫోకస్ పెట్టారు. త్వరలోనే వధువు కానున్నారు. కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో ఈ నెలాఖరున మూడు ముళ్లు వేయించుకోనున్నారు. స్వాతి వివాహ విషయమై ఆమె కుటుంబ సభ్యులను ‘సాక్షి’ సంప్రదించగా – ‘‘కేరళకు చెందిన వికాస్ అనే పైలెట్‌తో స్వాతి పెళ్లి కుదిరింది. పెళ్లి వేడుక ఈ నెల 30న కేవలం ఇరు కుటుంబ సభ్యులు, దగ్గర చుట్టాలు, క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య హైదరాబాద్‌లో జరగనుంది’’ అన్నారు. మలేషియన్ ఎయిర్ లైన్స్‌లో పని చేసే వికాస్, స్వాతిది లవ్, అరేంజ్డ్ మ్యారెజ్ అట. పెళ్లి జరిగిన రెండు రోజులకే కేరళలోని కొచ్చిలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. ఎందుకంటే వికాస్ మలయాళీ. ఇదిలా ఉంటే.. స్వాతి అధికారికంగా కాబోయే భర్త ఫొటోను బయటపెట్టలేదు కానీ ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో సోమవారం నెట్లో హల్చల్ చేసింది. -
కలర్స్ స్వాతి పెళ్లి పీటలెక్కనుందా?
కలర్స్ స్వాతి ఈ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన కలర్స్ స్వాతి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కలర్స్ స్వాతికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కలర్స్ స్వాతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని, తాను చేసుకోబోయే భర్త పేరు వికాస్ అంటూ.. అతనొక పైలట్ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కలర్ స్వాతి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్, స్వామిరారా సినిమాలతో గుర్తింపును పొందారు. -
స్వాతికి కత్తి మహేష్ లవ్ లెటర్
ఎప్పుడు వివాదాలు, డిబేట్లతో వార్తల్లో ఉండే మహేష్ కత్తి ఈసారి కొత్త అంశంతో నెటిజన్ల ముందుకు వచ్చాడు. హీరోయిన్ కలర్స్ స్వాతికి ప్రేమలేఖ రాశాడు. అంతేకాదు ఇది రెండో ప్రేమలేఖ అంట. తాజాగా స్వాతి నటించిన లండన్ బాబులు సినిమా చూసిన మహేష్ స్వాతి నటనకు ఫిదా అయ్యాడట. ఇంకా స్వాతికి ఏం రాశాడో ఆయన మాటల్లోనే.. 'డియర్ స్వాతి, ఆ మధ్యనేను రాసిన ప్రేమ లేఖ ఇంకా పచ్చిగానే నా మనసులో ఉంది. నీ ప్రతిభకు తగని పాత్రలో నువ్వు కనిపించి కష్టపెట్టిన నా మనసు గాయం మొన్నటివరకు తాజాగానే ఉండేది. కానీ..."లండన్ బాబులు" చూసాను. ముద్దుమాటల స్వాతి ఒక మెచ్యూర్ నటిగా ఎదగడం చూసాను. ఒక్క మాట కూడా అవసరం లేకుండా కళ్ళతో, పెదాలతో, నవ్వుతో, కనుబొమ్మల ముడితో, కనురెప్పల వాల్పుతో, విరిసీ విరియని నవ్వుతో, వంకించిన మెడతో, పదానికి పదానికి మధ్య పాజ్ తో నటించగల ప్రతిభని మళ్ళీ చూసాను. సూర్యకాంతంతో ప్రేమలో పడ్డాను. స్వాతి... నీతో మళ్ళీ ప్రేమలో పడ్డాను. మొదట జాలిపడి. తరువాత అభిమానించి సహాయం చేసిన గాంధీ మాటలు రావని చెప్పి మోసం చేశాడని తెలిసిన క్షణంలో... మోసపోయాననే కోపం, అతని నిస్సహాయత మీద జాలి, మూగవాడు కాదనే ఆనందం ఇన్ని భావాల్ని ఒక్క క్షణంలో పలికించగల నటుల్ని వెళ్ల మీద లెక్క పెట్టగలం. ఆ వెళ్లలో మొదట పలికే పేరు ఇప్పుడు నీది. క్లైమాక్స్ లో గాంధీ పెళ్లి చేసుకుందామా అన్నప్పుడు... ప్రేమో కాదో తెలియని సందిగ్దత, అవధులు లేని అభిమానపు వెల్లువ, ఎక్కడో కాదనాలనే ఆత్మాభిమానం, ఎందుకు వద్దనాలి అనే తీవ్రమైన ప్రేమ. అనుమానం. ఆనందం. సహజమైన సిగ్గు. బిడియాన్ని పక్కకు నెట్టే ఆలోచన. నాకు కావలసింది నాకు తెలుసు అనే ధీమా. నిన్ను నేను నమ్ముతాను అనే భరోసా. ఇన్ని భావాల్ని ఒక్క విరిసివిరియని స్మైల్ లో చెప్పావు చూడు.. హ్యాట్సాఫ్! అందుకే ఆగలేక. మనసు ఆపుకోలేక.. రాసాను ఈ లేఖ. అందుకో ఈ ప్రేమ లేఖ' అంటూ ముగించాడు. -
పెళ్లి సందడి!
-
పెళ్లి సందడి!
‘కలర్స్’ స్వాతి పెళ్లి అయిపోయింది. అదేంటి అంత హఠాత్తుగా అనుకుంటున్నారా...! జస్ట్ సినిమా కోసమేనండి! స్వాతి కథానాయికగా జె. రామాంజనేయలు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ.చినబాబు, ఎం రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘త్రిపుర’. ‘గీతాంజలి’ ఫేం రాజ్‌కిరణ్ దర్శకుడు. కథ కూడా ఆయన రాసుకున్నదే. కథానాయిక స్వాతిపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. దీంతో 40 శాతం టాకీ పార్టు పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. ఇప్పటివరకూ చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, కెమెరా: రవికుమార్ సానా, సమర్పణ: జె.రామాంజనేయిలు. -
స్వాతికో చిత్రం
టాలీవుడ్లో కలర్స్ స్వాతిగాను కోలీవుడ్‌లో సుబ్రమణిపురం స్వాతిగానూ గుర్తింపు పొందింది స్వాతి. హీరోయిన్గా ఈ రెండు భాషల్లోనూ పేరు తెచ్చుకున్న ఈమె ఆశించిన స్థాయికి చేరుకోలేదు. ఈ మధ్య మాలీవుడ్లోను నటించేస్తున్నారు. ఈమె తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో నటించడం వలనే ఎక్కడా ప్రముఖ నటిగా ఎదగలేకపోతున్నారేమో. ఏదేమైనా ఆ మధ్య వడకర్రి చిత్రంలో నటించిన స్వాతికి తాజా మరో అవకాశం వచ్చింది. తిరి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది మానవ సంబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమట. నవ దర్శకుడు అశోక్ అమృత్‌రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ గోల్డ్ ప్రొడక్షన్స్ పతాకంపై నికె బాలమురుగన్, ఆర్.బాలగోపి నిర్మిస్తున్నారు. యువ నటుడు అశ్విన్ కథా నాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో జయప్రకాష్, కరుణాకరన్, అనూపమకుమార్, సెండ్రామణి తదితరు లు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ తిరి యథార్థ సంఘటనలతో కూడిన కమర్షియల్ కథా చిత్రం అన్నారు. ఒక బిడ్డ జీవితంలో తల్లిదండ్రులెంత ముఖ్యమైన వారు అని చెప్పే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం తిరి అన్నారు. సహనాన్ని నిగ్రహిం చుకోవడం ఎంత ముఖ్యమో అవసరం అయినప్పుడు దాన్ని ఉపయోగించడం అంత అవసరం అని చెప్పే చిత్రం ఇదన్నారు. -
‘గీతాంజలి’ని మించి...
‘కలర్స్’ స్వాతి ఇక నుంచి ‘త్రిపుర’గా మారనున్నారు. అదేంటి అనుకుంటున్నారా...! ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న చిత్రం ‘త్రిపుర’. ‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశే ఖర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రాజ్ కిరణ్ దర్శకుడు. సోమవారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. దర్శకుడు బోయపాటి శ్రీను, అలీ, కోనవెంకట్ కలిసి ఈ సినిమా స్క్రిప్ట్‌ను రాజ్‌కిరణ్‌కు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘మళ్లీ కోనవెంకట్‌తో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. ‘గీతాంజలి’ ని మించిన చిత్రం అవుతుంది ’’ అని చెప్పారు. కథ వినగానే బాగా ఎగ్జైట్ అయ్యానని, రాజ్ కిరణ్ ప్రతిభ మీద పూర్తి నమ్మకం ఉందని కోనవెంకట్ తెలిపారు. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తామని, ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే : కోనవెంకట్, కెమెరా: రవికుమార్, సంగీతం: కామ్రాన్. -
కలర్ స్వాతి అయ్యింది కవయిత్రి
కాదేది కవితకు అనర్హం అంటారు. అలాగే అనుభవాలు నేర్పే పాఠాలు, గుణపాఠాలు ఎన్నో. వాటికి కాస్త పరిజ్ఞానాన్ని, భావుకతను జోడిస్తే వస్తే కథలు, కవితలు కోకొల్లలు. అసలు విషయం ఏంటంటే నటి స్వాతి ఆంగ్లంలో కవితలు రాసేస్తోందట. తమిళం, తెలుగు, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇటీవల ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’. ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత చూస్తుంటే తనకు ఎదురైన అనుభవాలకు కవిత రూపం ఇచ్చినట్టు లేదూ! ఏమైతేనేం ఈ కవితను తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ స్వాతి అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీనికి అనూహ్య స్పందన వచ్చినట్లు కూడా ఈ అమ్మడు పేర్కొంది. ఇదంతా చూస్తుంటే స్వాతి త్వరలో గీత రచయిత అయిపోతుందేమోననిపిస్తోందా? అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళంలో ఒక చిత్రం చేస్తోంది. తెలుగులో నటించిన కార్తికేయ విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళంలో త్వరలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనుంది. -
మళ్లీ పెళ్లి వదంతులు
నిప్పులేనిదే పొగ రాదంటారు. అయితే మన నాయికలు మాత్రం నిప్పు లేకుండానే పొగ పెట్టేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. నటి స్వాతి కూడా ప్రస్తుతం ఈ తరహా వదంతులతోనే విసిగిపోతోందట. తెలుగులో కలర్స్ స్వాతిగా గుర్తింపు పొందిన ఈ ముద్దు గుమ్మ తమిళంలో సుబ్రమణిపురం చిత్రంలో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆ చిత్రాలు అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం కార్తికేయన్ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న ఈ బ్యూటీపై ఇప్పటికే పలు వదంతులు ప్రచారమయ్యాయి. తాజా గా ఒక తమిళ నటుడితో ప్రేమాయణం సాగిస్తున్నట్లు త్వరలో అతనితో మూడు ముళ్లు వేయించుకోవడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వదంతులపై స్వాతి మండిపడుతోంది. ఇప్పటికే చాలా మందితో చాలా సార్లు పెళ్లి చేసేశారు. ఇప్పుడు మళ్లీ పెళ్లి అంటూ అసభ్య ప్రచారం చేస్తున్నారు అంటూ వాపోయింది. దీని గురించి స్వాతి మాట్లాడుతూ ఇంతకు ముందు ఒక వ్యాపార వేత్తను కలుసుకున్నానని ఆ యన్నే పెళ్లి చేసుకోనున్నానని ప్రచారం చేశారని అంది. నిజానికి తాను ఏ వ్యాపార వేత్తను కలుసుకున్నానో తనకే తెలియదంది. తాను చెన్నైలో జరి గే షూటింగ్లో పాల్గొన్నా షూటింగ్ పూర్తి అయిన తరువాత తిన్నగా బ స చేసే హోటల్ గదికి చేరుకుంటానుగానీ పార్టీలకు, ఇతర కార్యక్రమాలకు వెళ్లనని చెప్పింది. అయినా ఎవరో? ఎందుకు ఇలాం టి వదంతులు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా ఒక తమిళ నటుడ్ని ప్రేమిస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారని ఇందులోనూ ఎలాంటి నిజం లేదని స్వాతి స్పష్టం చేసింది. -
సుమంత్ జిందగీ?
సుమంత్ ఓ వైవిధ్యమైన చిత్రంలో నటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ తర్వాత సుమంత్ ఒప్పుకున్న సినిమా ఇదే. రహదారిలో ముగ్గురు మిత్రుల ప్రయాణమే ప్రధాన ఇతివృత్తంగా ఈ చిత్రం రూపొందనుందట. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో ప్రతిభ గల దర్శకునిగా విమర్శకుల ప్రశంసలందుకున్న పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ‘కలర్స్’ స్వాతి, ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేం విష్ణు ఇందులో కీలక భూమికలు పోషించనున్నారట. ‘జిందగీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. సెప్టెంబర్‌లో చిత్రీకరణ మొదలు కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని వినికిడి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత పవన్ సాదినేని, నారా రోహిత్ హీరోగా ఓ సినిమా చేయనున్నారు. -
టచ్ ఫోన్ కోసం...
ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుందంటారు. కానీ అతని జీవితాన్ని ఓ టచ్ ఫోన్ మార్చి పారేసింది. టచ్ ఫోన్ కొనేందుకు సిద్ధమైన అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవించాయనే ఆసక్తికరమైన కథాంశంతో ‘కుల్ఫీ’ చిత్రం రూపొందింది. జై, కలర్స్ స్వాతి ఇందులో హీరో హీరోయిన్లు. శరవణ రాజన్ దర్శకుడు. నరసింహారెడ్డి సామల నిర్మాత. ఈ నెల 27న విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘అన్ని వర్గాలకూ నచ్చే కథ ఇది. యువన్ శంకర్‌రాజా స్వరాలందించిన పాటలు ఇటీవలే విడుదలై శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇందులో ఒక ప్రత్యేక గీతం చేశారు. వెంకట్ ప్రభు, కస్తూరి చిత్రానికి ఆయువు పట్టులాంటి పాత్రలు చేశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: కృష్ణతేజ, కెమెరా: ఎస్. వెంకటేశ్, నిర్మాణ నిర్వహణ: ఎ.ఎన్. బాలాజీ, సమర్పణ: శ్రీనివాసరెడ్డి సామల. -
సన్నబడాలి.. ఒళ్లు చేయాలి!!
చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. హీరోయిన్లయితే సన్నగా ఉంటేనే చూస్తామంటారు చాలామంది. అయితే.. అందరి విషయంలోనూ ఇది వర్తించదండోయ్. ఎందుకంటే, కొంతమంది బొద్దుగుమ్మలను సన్నబడాలని దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే మరికొందరిని మాత్రం మరీ చిన్నపిల్లలా కనపడుతున్నావు.. కొంచెం ఒళ్లు చేస్తేనే మంచిదంటున్నారు. ఈ రెండు విషయాలకు రెండు మంచి ఉదాహరణలున్నాయి. కెరీర్ ప్రారంభంలో తాను నటించిన షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో సన్నగా, స్లిమ్‌గా కనిపించిన పదహారణాల తెలుగమ్మాయి అంజలి.. ఆ తర్వాత సీతమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది. తర్వాతి కాలంలో మాత్రం అంజలి కొంచెం లావెక్కింది. అందుకే యంగ్ హీరోలు ఈ అమ్మడి జోలికి పోవటంలేదు. దాంతో సీనియర్ హీరోల సరసన చేయడమైతే చేస్తోంది. కానీ తనకు చాన్సులు ఎందుకు రావట్లేదో లేటుగా తెలుసుకుంది. అందుకే జిమ్‌లో తెగ కుస్తీలు పడుతోందట. ఎలాగైనా సరే బరువు తగ్గించుకుని యంగ్ హీరోలతో ఆడిపాడాలని ఆశపడుతుంది. ఈమె ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.. ఏ హీరోలు ఛాన్సులిస్తారో వేచి చూడాలి. మరోవైపు బుల్లితెర నుంచి వెండితెరమీదకు ప్రమోషన్ తెచ్చుకుని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే దగ్గర్నుంచి ఇటీవలే విడుదలైన బంగారుకోడిపెట్ట వరకు ఓ అరడజను సినిమాల్లో నటించేసిన కలర్స్ స్వాతికి మాత్రం దర్శక నిర్మాతలు కొంచెం లావెక్కితే మంచిదని చెబుతున్నారు. మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావని, అందువల్ల కొంచెం లావెక్కితే మంచిదని ఆమెకు చెప్పడంతో ఎంచక్కా తనకిష్టమైన ఫుడ్ లాగించేస్తూ లావయ్యే ప్రయత్నాలు చేస్తోందట స్వాతి. -
ఇక ముందు అలాంటి సినిమాలు చేయను
‘‘నిజజీవితంలో నేను కొంచెం దూకుడే. అందుకే వివాదాల్లో చిక్కుకున్నాను. నన్నెవరు పట్టించుకుంటారులే అనే భావనతో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. సినిమా వాళ్ల పట్ల ప్రజల అటెన్షన్ ఉంటుందని, ఇక ముందు బాధ్యతతో మెలగాలని తెలుసుకున్నాను’’ అని నవదీప్ చెప్పారు. నవదీప్, కలర్స్ స్వాతి జంటగా రూపొందిన చిత్రం ‘బంగారు కోడిపెట్ట’. రాజ్ పిప్పళ్ల దర్శకుడు. సునీత తాటి నిర్మాత. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నవదీప్ విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘‘ప్రస్తుతం ఆఫర్ చేసిన పాత్రల్ని చేస్తూ వస్తున్నాను. కథల్ని ఎంపిక చేసుకునే స్థాయి రావాలంటే నాకో కమర్షియల్ హిట్ కావాలి. ‘బంగారు కోడిపెట్ట’ ఆ లోటును తీరుస్తుందనుకుంటున్నాను. ఇందులో నా పాత్రలో భిన్న పార్శ్వాలుంటాయి. స్వాతితో నా సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి’’ అని ఆశాభావం వ్యక్తం చేశారు నవదీప్. ఇంకా మాట్లాడుతూ -‘‘సినిమాల ఎంపికలో తెలీకుండానే కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులే చేయకుంటే.. ఈ రోజున నా స్థానం వేరేలా ఉండేది. ఉదాహరణకు ‘బాద్షా’. ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రను అందులో చేశాను. నిజానికి ఆ పాత్రను నేనే చేయనవసరం లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇక ముందు అలాంటి సినిమాలు చేయను’’ అని నిర్మొహమాటంగా చెప్పారు నవదీప్. ఎన్టీఆర్‌తో సినిమా నిర్మించబోతున్నారట కదా? అనడిగితే- ‘‘సినిమాలు తీసేంత స్థాయి నాకు లేదు. నా సంపాదన నా కారు, నా పబ్బులకే సరిపోవడం లేదు’’ అని నవ్వుతూ సమాధానమిచ్చారు నవదీప్. -
ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ మూవీ స్టిల్స్
-
ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ
విజయ్ సేతుపతి, ‘కలర్స్’స్వాతి, అశ్విన్ ముఖ్య తారలుగా... గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఇదక్కు తానా ఆశైపట్టాయ్ బాలకుమార’. ఈ చిత్రం ‘ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. సుజన్, సమన్యరెడ్డి ఈ అను వాద చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు చెబుతూ -‘‘పూర్తి వాణిజ్య అంశాలతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రమిది. వసూళ్ల పరంగా చిన్న సినిమాల్లో రికార్డ్ సృష్టించిందీ సినిమా. స్వాతి, విజయ్ సేతుపతిల నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తమిళంలోలాగే తెలుగులో కూడా విజయం సాధిస్తుందని మా నమ్మకం. మార్చి 4న పాటల్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. నందిత, పశుపతి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: రాజశేఖరరెడ్డి, సంగీతం: సిద్దార్థ్ విపిన్, సమర్పణ: సప్తవర్ణ క్రియేషన్స్, కాఫీస్ సినిమా ప్రై.లిమిటెడ్. -
పెళ్లి చేసుకుందాం అని కాదు...పెళ్లంటే ఏంటా? అని ఆలోచిస్తున్నాను...
తనకెంతో పేరు తెచ్చిపెట్టిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను తన పేరుకు జత చేసి పిలిస్తే స్వాతికి ఎందుకిష్టం ఉండదు? డాక్టర్ కావాలని బలంగా అనుకున్న స్వాతి యాక్టర్‌గా మిగలడం వెనుక ఉన్న ‘సైకో’ ఎవరు? తనను విక్రమ్‌తో, నిఖిల్‌తో జతకడుతూ వస్తున్న రూమర్లపై స్వాతి ఏమంటుంది? పార్టీలకు గాని మరెక్కడికిగాని వెళ్లడానికైనా ఏ టైమ్‌లోనైనా ఎటువంటి జంకూ గొంకూ లేకుండా స్వాతి ‘ఎస్’ చెప్పే ఆ సిక్స్‌ప్యాక్ హీరో ఎవరు? ఎంతో నాజూకుగా, చిన్నపిల్లలా కనిపించే స్వాతి ఏకంగా ‘స్కార్పియన్’ని తినాలని ఎందుకనుకుంది? ఈ ప్రశ్నలకు సమాధానం... రంగుల ప్రపంచంలోకి వెళ్లడానికి ముందే రంగుల్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న రష్యన్ అమ్మాయి స్వెత్లానా అలియాస్ స్వాతిరెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి. సినిమారంగంలో పదేళ్ల వయసున్న స్వాతి ‘తారాంతరంగం’ ఈ వారం. రష్యాలో పుట్టారు కదా... స్వాతి: అవును. వ్లాదివోస్టాక్ అనే పోర్ట్ప్లేస్లో పుట్టాను. నాన్న నేవీలో చేసేవారు. ఆయన ఉద్యోగరీత్యానే ముంబయికి వచ్చాం. ఆ తర్వాత వైజాగ్, తర్వాత హైదరాబాద్! మరి స్వెత్లానా ఎలా స్వాతి అయ్యారు? స్వాతి: రష్యన్ పేరెందుకు... మన భాష పేరు పెట్టుకోవాలని ముంబయి వచ్చాక అమ్మ నా పేరు మార్చింది. నాకన్నా ఆరేళ్లు పెద్దయిన అన్నయ్య పేరు సిద్ధార్థ. ఇద్దరి పేర్లూ ‘ఎస్’ తో మొదలైతే బాగుంటుందని నాకు స్వాతి అని పెట్టారు. మీరు పుట్టిన రష్యాకు మళ్లీ ఎప్పుడైనా వెళ్లారా? స్వాతి: సరిగ్గా నెలన్నర క్రితమే వెళ్లాను. పసిఫిక్ మెరిడియన్ అని ఫిలింఫెస్టివల్ 11వ వార్షికోత్సవం చేశారు. నేను పుట్టిన వ్లాదివోస్టాక్‌లో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవం జరిగింది. భారతీయ సినిమాకు 100ఏళ్లు అయిన సందర్భంగా మన సినిమావాళ్లని కూడా ఆహ్వానించారు. ముఖ్యంగా వ్లాదివోస్టాక్‌లో పుట్టి, ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో రాణిస్తున్నవారిని గుర్తించి ఆహ్వానించారు. అలా నాకు కూడా ఆహ్వానం అందింది. వెళ్లాను.. చాలా హ్యాపీగా అనిపించింది. నేను పుట్టిన ఆసుపత్రి వార్డు, నా ఫస్ట్ హౌస్ చూశాను. ఫొటోలు దిగాను. చాలా మెమరబుల్! మీ అన్నయ్య గురించి... స్వాతి: మా అన్నయ్య, నేను చాలా క్లోజ్‌గా ఉంటాం. ‘కలర్స్’ ప్రోగ్రాం టైమ్‌లో ‘బాబోయ్... ఇంట్లో కూడా దీని గోల, టివిలో కూడా దీని గోలే’ అనేవాడు. ‘చానెల్ అయితే మార్చేసుకోవచ్చు కానీ ఇంట్లో అలా కుదరదుగా’ అంటే ‘అదే ఛస్తున్నానురా బాబూ’ అనేవాడు. డాక్టర్ అవబోయి యాక్టర్ అయినవారిలో మీరూ... స్వాతి: నిజంగా అవుదామనుకున్నానండీ. ఇప్పటికీ అప్పుడప్పుడు బాధేస్తుంది. అయితే ఈ మధ్య కొందరు డాక్టర్లను చూసి ‘థాంక్ గాడ్ నేను డాక్టరవ్వలేదు’ అనిపిస్తుంది! ఇట్స్ ఎ వెరీ రెస్సాన్సిబుల్ జాబ్! నాకు చదువంటే ఇష్టం. నేను బాగా చదివేదాన్ని. మెడిసిన్‌లో ఫ్రీ సీట్ సాధించాను. కాని, అప్పటికే ‘కలర్స్’ బాగా పాపు లర్ కావడంతో నన్ను మామూలుగా కాకుండా ఒక రేంజ్లో ర్యాగింగ్ చేశారు. ఓ 30 మంది నన్ను రోజంతా హాస్టల్ రూమ్‌లో పెట్టి తాళం వేసేశారు. రాత్రంతా డ్యాన్స్ చేయమన్నారు. మా రూమ్ ఎలక్ట్రిసిటీ స్విచ్ బయట ఉండేది. అది ఆఫ్ చేసేసేవారు. అలాగే జూనియర్స్ కూడా నాతో ఉంటే ర్యాగ్ అవుతారని నాతో ఉండేవారు కాదు. సో నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ‘కలర్స్ స్వాతి’ ఈ కాలేజ్‌లో చదువుతోంది అని తెలిసిన తర్వాత చుట్టుపక్కల ఇంజినీరింగ్ కాలేజ్ వాళ్లు కూడా వచ్చి రాగ్ చేయడం... ఆ ఇంజినీరింగ్ బాయ్స్, మెడికల్ బాయ్స్ అంతా కలిసి రాగ్ చేయడం...స్టేషనరీ ఏదైనా కొందామని వెళ్లినా షాప్‌కు వచ్చి మరీ రాగ్ చేయడం ఎక్కువయ్యాయి. ఎవరు సస్పెండ్ అయినా నన్ను బ్లేమ్ చేసేవారు. అలా నాకు ఏదో ఒక దశలో ఆ వృత్తి మీద ఇంట్రస్ట్ పోయింది. ‘ఇలాంటి వాళ్లు మెడికోస్... వీరేం డాక్టర్లు అవుతారు? సైకోల్లా ఉన్నారు’ అనిపించింది. ఏదైతేనేం అక్కడ మానేశాను. తర్వాత హైదరాబాద్ యూసఫ్‌గూడలోని సెయింట్ మేరీస్‌లో బయోటెక్నాలజీలో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపాల్, స్టాఫ్, స్టూడెంట్స్ నన్ను మెడికల్ కాలేజ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నుంచి తేరుకునేలా చేశారు. అక్కడి కెమిస్ట్రీ లెక్చరర్ ఇప్పటికీ నాతో టచ్‌లో ఉన్నారు. ‘కలర్స్’ స్వాతి అని పిలిస్తే ఎందుకు ఇష్టం ఉండదు? అది మీ హీరోయిన్ స్టేటస్‌కు తక్కువనా? స్వాతి: ఛీఛీ...నాకు అప్పుడే ఇష్టం ఉండేది కాదు. చక్కగా స్వాతి అనే పేరు ఉంది కదా అని. అంతెందుకు... ఆ ప్రోగ్రామ్‌లోనే అనేదాన్ని ‘థాంక్గాడ్... నా ప్రోగ్రాం పేరు కలర్స్! ఏ ‘ఇంటింటి మహాలక్ష్మి’నో లేదా ‘పట్టుకుంటే పట్టుచీర’నో అయ్యుంటే! బాబోయ్ అలాంటివి పెట్టలేదు! కాని, చాలామంది అలా పిలిస్తే క్రెడిట్‌గా ఫీలవుతారు... స్వాతి: నేనలా కాదండీ. డిటాచ్డ్ పర్సన్. ‘సుబ్రహ్మణ్యపురం స్వాతి’, ‘డేంజర్ స్వాతి’ అంటే నాకు ఏదోలా ఉంటుంది! ఇంటి నుంచి పారిపోయైనా సరే సర్కస్‌లో చేరాలి అనుకున్నారట... స్వాతి: (గట్టిగా నవ్వేస్తూ) అవును. అది ఎక్కడ విన్నారు మీరు? నిజంగానే నాకు సర్కస్ అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టంతోనే 8వ తరగతిలో ఉన్నప్పుడు అందులో చేరడానికి ట్రయల్ కూడా చేశాను! కానీ ఛాన్స్ దొరకలేదు. అలాగే నేవీలో ఉన్నప్పుడు యూనిఫాం నచ్చి అందులో చేరిపోదాం అనుకున్నాను. తర్వాత డాక్టర్... అవన్నీ దేవుడు పై నుంచి చూసి ఈ అమ్మాయికి చాలా కోరికలున్నాయి కాబట్టి... ఈ అమ్మాయిని యాక్టర్ చేసేద్దాం... అన్నీ అయిపోతుంది (క్యారెక్టర్ల పరంగా) అనుకునుంటాడు (నవ్వులు)! అంత హిట్టయిన ‘కలర్స్’ ప్రోగ్రామ్‌ను ఆపేయడం మొదలుకుని, మెడిసన్‌ను వదులుకోవడం...ఇలా మీ నిర్ణయాల్లో చాలా స్థిరచిత్తం కనిపిస్తుంటుంది... పెద్దగా లైఫ్‌లో స్ట్రగుల్ లేకపోయినా ఇంత స్ట్రాంగ్ ఎలా అయ్యారు? స్వాతి: నా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్, నేను పెరిగిన వాతావరణం వల్ల! దట్ వే ఐయామ్ బ్లెస్డ్. అయినా స్ట్రగుల్ అస్సలు లేకుండా ఏమీ లేదు. స్ట్రగుల్ అంటే ఇటుకలు మోసేయడం లాంటివి కాకపోయినా, సాధారణ మధ్యతరగతి జీవనశైలి నుంచి వచ్చాను. నేవీ ఫీల్డ్ బయట గ్లామరస్‌గా ఉంటుంది కానీ తొంగి చూస్తే చాలా సాధారణంగా ఉంటుంది. అందరి ఇళ్లూ ఒకేలా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఎకామిడేషన్ తెల్సిందే కదా. నార్మల్ క్వార్టర్స్. కానీ ఇంటలెక్చువల్లీ, కల్చరల్లీ చాలా రిచ్ ఎన్విరాన్మెంట్! పక్కింటోడు ఒక బెంగాలీ ఉంటాడు, పైనో పంజాబీ ఉంటాడు. హోలీ ఆడాం. క్రిస్మస్ చేశాం. వినాయకచవితికి నాటకాలు. దాండియా ఆడాం. సో... క్వార్టర్స్‌లో ఉన్నామేమో కాని, మా కల్చరల్ అప్బ్రింగింగ్ వెరీ వెరీ రిచ్! మూవీస్‌లోకి వెళ్తాననగానే ఇంట్లోవాళ్లు ఏమన్నారు? స్వాతి: నేను మూవీస్ చేయడం అన్నకు అస్సలు నచ్చలేదు. ‘డేంజర్’ టైంలో చాలా రోజులు నాతో మాట్లాడలేదు కూడా! చాలా బాధపడ్డాను. సినిమాల్లో చేసే అమ్మాయిల గురించి ఆ వయసు అబ్బాయిలు, ఫ్రెండ్స్ ఏం అనుకుంటారో తెల్సిందే కదా. అందుకే కొంచెం భయపడ్డాడు. అయితే సినిమా చూశాక గర్వంగా ఫీలయ్యాడు. పేరెంట్స్ మాత్రం దీన్నంతా ఒక ప్రాసెస్‌గా భావించారంతే! అలాగని నా విషయంలో ప్రతీదీ వారికి తెలియాలని కోరుకోరు. అదే టైమ్‌లో నాకేం జరుగుతుందో వారికి తెలుసు. నేనే పడతాను. నేనే లేస్తాను. అయితే అన్నీ చెబుతూనే ఉంటాను. సడెన్‌గా ఏమైనా అయినప్పుడు వాళ్లు షాక్ తినరు! ‘సినిమాలు మానెయ్’ అని ఎప్పుడూ అనలేదా? స్వాతి: మూవీస్ మానేసి ఏం చేస్తా? నేనున్న పరిస్థితుల్లో బ్యాంక్‌లో చేస్తానా? అలా అని నచ్చక చేస్తున్నానని కాదు... ఇష్టం కాబట్టి చేస్తున్నాను. అవసరమైతే ఇంట్లో క్యాండిల్స్ చేసుకుని అమ్ముకుంటూ బతుకుతాను కాని, ఇష్టం లేనిపని చేయను. మీ మూవీస్ అబ్జర్వ్ చేస్తే పెర్ఫార్మెన్స్ బేస్డ్గా ఉంటాయి. సెలక్టివ్‌గా వెళుతున్నారనుకోవచ్చా? స్వాతి: యాక్చువల్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్ అంటూ ఏమీ ఉండవండీ. ప్రతి సినిమాలోనూ పెర్ఫార్మెన్స్ ఉండాల్సిందే కదా. ఇక అవి నేను ఎంచుకున్నవి కాదు. ఆ సినిమాలే నన్ను ఎంచుకున్నాయి. నాకు పది ఉంటే అందులో నేను రెండు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాని, అన్నీ ఎప్పుడూ ఎవరికీ ఉండవు. నా దగ్గరకి వచ్చినవి మంచి ఆఫర్లు అంతే. మీరు కనపడినంత చైల్డిష్ కాదు..! స్వాతి: అయామ్ జస్ట్ గ్రోయింగ్అప్ అండీ! పర్సనల్లీ నేను పేరెంట్స్‌కి చాలా క్లోజ్‌గా ఉంటాను. తల్లిదండ్రులకు సన్నిహితంగా ఉండే పిల్లల లైఫ్ వేరేగా ఉంటుంది. ఎల్లప్పుడూ నేను డిపెండెంట్నే. అందులో డౌట్ లేదు. అంటే అది ఫైనాన్షియల్‌గానే కానక్కర్లేదు. ఎమోషనల్‌గా కూడా. నేనంటూ గుడ్డిగా చేయగలిగేది అమ్మానాన్నని నమ్మడమే. దేవుణ్ణి నమ్ముతారా? స్వాతి: ఇప్పుడు.. డెఫినెట్లీ. ఒక పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఒక మనిషికి ఒక సిట్యుయేషన్ వల్ల్లో సక్సెస్, ఫెయిల్యూర్ వల్లో టెంపర్మెంట్ వల్లో మూడ్స్ వల్లో వేరే థాట్స్ ఉంటాయి. ఓ 5 సంవత్సరాల తర్వాత ఆలోచన మారిపోతుంది. ఇదే ప్రశ్న మీరు నన్ను స్కూల్ టైమ్‌లో అడిగితే వేరే ఆన్సర్ చెప్పేదాన్నేమో. ఇప్పుడు టివి, సినిమాలు, వేరే బాధలు, ఫ్రెండ్స్ పెరగడం, వాళ్ల పెళ్లిళ్లు. ఇవన్నీ చూశాక డెఫినెట్లీ దేవుడున్నాడని బాగా నమ్ముతున్నాను. ఎందుకంత నమ్మకం? స్వాతి: మంచివాళ్లకి మంచి జరిగినప్పుడు దేవుడున్నాడు అనిపిస్తుంది. అది తెలిసినవాళ్లకయినా, పర్సనల్‌గా నాకయినా! మా అన్నయ్యకు ఫేటల్ యాక్సిడెంట్ అయింది కొన్ని నెలల క్రితం. సీరియస్ అయింది. బట్ హీ సర్వైవ్డ్ ఇట్. సో...దేవుడున్నాడు అని. ఇప్పుడు చదివేవాళ్లకి ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు. అయితే నా నమ్మకం నాకుంది. నా ఫ్రెండ్స్ చాలా మంది దేవుణ్ణి నమ్మరు. నాతో ఆర్గ్యుమెంట్ కూడా పెట్టుకుంటారు. దేవుడేంటి... అంతా మన చేతుల్లోనే ఉంది అంటారు. కాని, నేను వారితో పెద్దగా ఆర్గ్యూ చేయను. ఎందుకంటే ఇది పూర్తిగా పర్సనల్ థింగ్! మీ ఫ్రెండ్స్ గురించి... స్వాతి: క్లోజ్ ఫ్రెండ్స్ తక్కువండి. అంటే... ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. అందరితో బాగా మాట్లాడతాను. నాకు స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక సినిమా పరిశ్రమలో స్నేహం గానీ, శతృత్వం గానీ ఎక్కువ కాలం ఉండవు. అయినా ఇట్స్ వన్ లైఫ్ అండీ. గొడవలు ఎందుకు చెప్పండి? యూ నో... హేట్ అనే ఎమోషన్ చాలా డ్రెయినీ. లవ్ కన్నా హేట్ చాలా బలమైందీనూ. మనిషిని చాలా డ్రైన్ చేసేస్తుంది. సో అంత శక్తి నాలో లేదు. హీరో సునీల్ మాటకు బాగా విలువిస్తారంటారు... స్వాతి: అవును... సునీల్‌తో పొద్దున్న కూడా మాట్లాడాను. ఎక్కడికైనా సరే సునీల్ చెప్తే వెళ్తా. ఒకరోజు సడెన్‌గా పూరీ జగన్‌గారు రాత్రి 9.30కి ఫోన్ చేసి ‘‘స్వాతీ, హరీష్, చార్మి, నేను, ఇంకా రాము... ఇలా అందరం పార్టీకి వెళుతున్నాం వస్తావా?’’ అంటే రానన్నా. అప్పుడు సునీల్ చేత ఫోన్ చేయించారు. వెళ్లాను. సీ... ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటో నాకు తెలీదండీ. కాని, ఇండస్ట్రీలో నాకు చాలా స్పెషల్ పీపుల్ అయితే ఉన్నారు. ఇందులో సునీల్, శ్రీనివాస్ అవసరాల, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, పార్వతి... అలా... కొందరు ఉన్నారు. మీ ఏజ్గ్రూప్వాళ్లతో తక్కువ అనుకుంటా... స్వాతి: హహహ(నవ్వులు) నా ఏజ్ గ్రూపోళ్లు తక్కువున్నారనుకుంటా ఇండస్ట్రీలో. అంటే వాళ్లంతా ఇంకెక్కడో ఉన్నారు. వాళ్ల రేంజ్ వేరే. పెద్ద సినిమాల్లో ఉన్నట్టున్నారు. చిన్నాపెద్దా... అని లెక్కేస్తారా... స్వాతి: నేనడం కాదండీ. ఇది జనాలు చెప్పే లెక్కలేనండీ. నాకు అలాంటివి ఉండవు. అందుకేగా ‘కలర్స్’ హిట్టయింది. మనిషిని మనిషిగా ట్రీట్ చేసి మాట్లాడేదాన్ని కాబట్టే అది అంత విజయం సాధించింది! ఇప్పటి టీవీ విజృంభణ చూస్తుంటే... మీరు ఇప్పటికీ టీవీలోనే ఉండుంటే స్మాల్ స్క్రీన్ సూపర్‌స్టార్ అయ్యేవారేమో... కమర్షియల్‌గా అదే బాగుండేదేమో... స్వాతి: ఏమో.. నాకిప్పటికీ అంత కమర్షియల్ ఐడియాలజీ లేదండీ. ఆ తెలివితేటలు నాకు లేవు. గెస్ ్టరోల్స్ కానివ్వండీ ఆ పాటలు కానీ అంతా ఫ్రెండ్లీగానే... ‘స్వాతీ నువ్వు చెయ్ అంటే చేశా తప్ప... ‘నాకేంటి’ అని అంతగా ఆలోచించలేను. అలా ఆలోచించకపోవడంవల్ల ఏదైనా పోగొట్టుకున్నారా? స్వాతి: ఓసారి ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేశాక కొంతమంది నాకు ఫోన్ చేసి ‘‘అదేంటి స్వాతి, నువ్వు గెస్ట్ రోల్ చేయకు... హీరోయిన్గా చేశాక గెస్ట్ రోల్ చేస్తే రాంగ్ మెసేజ్ వెళుతుంది. వర్క్లేక చేశావంటారు’’ అని అంటే.. ‘అంత సిల్లీ మేటర్ కూడా అర్థం కావడం లేదా’ అని ఫస్ట్‌షాక్ అయ్యాను. నిజానికి అందరి జర్నీ ఒకలా ఉండదండీ. అందరూ సావిత్రి గారిలా ఉండలేరు. అందరూ శ్రీదేవిలు కాలేరు. మన వ్యత్యాసాలే మన ప్రత్యేకతలు కదా. ఇది నా జీవితం. సో...వీటి నుంచి నేర్చుకున్నానే తప్ప రిగ్రెట్స్ లేవు. ‘కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం అప్పల్రాజు’ సినిమా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదంటారా? స్వాతి: దేన్నీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదనుకునే బలం ఈ మధ్యే వచ్చింది. అంతకుముందు బాగా ఫీలయ్యేదాన్ని. ఎందుకంటే మనం అవ్వకపోయినా పక్కనోళ్లు చెప్తారు. కొన్ని రోజుల పాటు కాదు నెలలపాటు ఆ ఫీలింగ్‌లోనే ఉండేదాన్ని! అప్పల్రాజు, గోల్కొండ హైస్కూల్ తర్వాత కాన్షియస్గా ఒక బ్రేక్ తీసుకున్నాను. ‘అసలు నేనెందుకున్నానీ ప్రొఫెషన్లో? నాకేం కావాలి?’ అని ఆలోచించుకున్నాను. వై యామ్ ఐ అన్‌హ్యాపీ అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు రియలైజ్ అయ్యాను. అప్పుడర్థమైంది ఇతరుల అభిప్రాయాల వినడమే నాకు సమస్య అని. ఇతరుల అభిప్రాయాలపై నా శక్తిని ఎక్కువగా ఖర్చు చేస్తున్నానని. ఒక్కొక్కరు వచ్చి ‘‘‘స్వాతి నువ్వు తెలుగమ్మాయివి...నువ్వు చాలా టాలెంటెడ్... స్వాతి...నువ్వు ఇలా చేయాలి అలా చేయాలి’’... ఇలా అంటుంటే వాళ్ల మాటలు విని నాక్కూడా కంగారు వచ్చేసేది. అనేశాక వాళ్లు వెళ్లి హాయిగా పడుకుంటారు. అయినా నాకా థాట్ ఉంటుంది కదా. అది గుర్తించాను. అదే సమయంలో మా అమ్మ ఒక మాట అడిగింది ‘‘లాస్ట్ వన్ ఇయర్లో రిలీజైన సినిమాల్లో నువ్వు మిస్సయిన ఒక సినిమా పేరు చెప్పు’’ అని. ఒక్కటి కూడా చెప్పలేకపోయాను. ఎందుకంటే, ఆ సినిమాలు నచ్చాయి కాని, నేను చేస్తే అవి వర్కవుట్ అయ్యేవి కావు. మళ్లీ అమ్మ ఇంకో క్వశ్చన్ వేసింది. ‘‘స్వాతీ నువ్వు సినిమాల్లోకి ఎందుకు వచ్చావ్?’’ అని! ‘‘యాక్ట్ చేయడానికి’’ అన్నా! అయితే యాక్ట్ చెయ్ అంది. అంతే. ఆ తర్వాత స్వామి రారా, మలయాళ సినిమా ఆమెన్, తమిళ సినిమాలు.. ఇలా... చేసుకుంటూ పోతున్నా. రిజల్ట్ గురించో, ఇంకొకరి అభిప్రాయాల గురించో పట్టించుకోకుండా నా వృత్తి మీద నా లవ్వూ, నా కాన్సన్ట్రేషన్ చూపిస్తే మిగతాదంతా లైన్లో పడుతుందని రియలైజ్ చేశా! ఆ తర్వాత... స్వాతి: ‘స్వామి రారా’ తర్వాత బాగా ఆఫర్లు వచ్చాయి. అయితే అప్పుడు మళయాళం, తమిళంలో చాలా అర్థవంతమైన సినిమాలు చేస్తున్నాను. మీ కెరీర్లో ఇదే బెస్ట్ టైమ్ అనుకోవచ్చా..? స్వాతి: కాదండీ... ద బెస్ట్ టైమ్ వజ్ ఆఫ్టర్ అప్పల్రాజు. ఏడాదిన్నర సమయంలో ఇంటి దగ్గర కూర్చుని ఎన్నో ఇన్నర్ కన్ఫ్యూజన్స్ను క్లియర్ చేసుకున్నాను. తెలుగులో చేస్తూ చేస్తూ... సడన్‌గా తమిళంలో ఆఫర్ ఎలా వచ్చింది? స్వాతి: తమిళియన్స్ చాలా స్మార్ట్. వాళ్లు కన్నేసి ఉంచుతారు... ఎక్కడంటే అక్కడ. ‘ఆడవాళ్ల మాటలకు అర్థాలే వేరులే’ చూసి, 3 నెలలు ఆగి ఫోన్ చేశారు. ‘‘బాబూ నాకు తమిళం రాదు’’ అంటే ‘‘వెరీగుడ్ తమిళ హీరోయిన్లకు తమిళ్ రాకపోవడం ఒక అడ్వాంటేజ్’’ అంటూ తీసుకెళ్లారు. అలా ‘సుబ్రమణియపురం’ వచ్చింది. మళయాళం సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? స్వాతి: ‘సుబ్రమణియపురం’ చూసి మలయాళం వాళ్లు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ 3 సినిమాలు చేస్తున్నాను. అయితే రెమ్యునరేషన్ చాలా తక్కువ. షాప్ ఓపెనింగ్ అంత కూడా రాదు (నవ్వులు). చాలా ఖర్చులు నేనే పెట్టుకుంటుంటాను. అమ్మ అంటుంది ‘మనం చేస్తున్నామా? పెడుతున్నామా?’ అని. కాని మలయాళంలో ఎన్విరాన్మెంట్ బాగుంది! బడ్జెట్ చాలా సింపుల్ ఖర్చుతో గ్రౌండ్లెవల్లో ఉంటుంది. పాటలు పాడుతున్నారు. ఈ ‘పాడు’ అలవాటు ఏంటి? స్వాతి: అలవాటేం కాదు. మొత్తం ఇప్పటికి 3 సినిమాలకు పాటలు పాడాను. దాంతోపాటే ఒక ఎయిడ్స్ అవగాహనా కార్టూన్ పిక్చర్‌కి వాయిస్ ఇచ్చాను. అదో స్కూల్ ప్రోగ్రామ్! అన్ని గవర్న్మెంట్ స్కూల్స్‌కు వెళుతుంది. వ్యక్తిగతంగా మ్యూజిక్ అంటే నా జీవితంలో భాగం. అది నాకు స్ఫూర్తినిస్తుంది. బలాన్నిస్తుంది! ఫస్ట్ లవ్‌ప్రపోజల్ ఎప్పుడొచ్చింది? స్వాతి: స్కూల్లో! సెవెన్త్‌క్లాస్‌లోనే వచ్చింది. అప్పుడు వైజాగ్ నేవీ స్కూల్లో చదువుతున్నాను. పెన్సిల్ చెక్కుకుంటుంటే క్లోజ్‌ఫ్రెండ్ వచ్చి ఐ లవ్ యు అన్నాడు. నాకు వెంటనే అర్థం కాక చెక్కుకోవడం ఆపి ‘క్యా’ అంటూ దీర్ఘం తీశాను. ఐ థింక్ ఐ లవ్ యూ అన్నాడు. అంతే... ఆ అబ్బాయితో మాట్లాడడం మానేశాను. వారం తర్వాత కలిసి ‘‘నువ్వేమైనా మిస్ ఇండియావా! ఏమనుకుంటున్నావ్? ఇష్టం లేకపోతే వదిలెయ్, నాతో మామూలుగా ఉండు’’ అన్నాడు. ఇప్పటికీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్‌మే! ఇక కాలేజ్‌లో లవ్ ప్రపోజల్స్ ఏమీరాలేదు. మా అన్నయ్య టీషర్ట్, జీన్స్, జుట్టు ముడి వేసుకుని కాస్త పద్ధతిగా వెళ్లేదాన్ని అందుకేనేమో ఎవరూ పట్టించుకోలేదు (విచారంగా మొహం పెట్టి), ఇండస్ట్రీకి వెళ్లాక చాలా వచ్చాయి. ఇండస్ట్రీలో లవ్‌కన్నా మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయ్. బహుశా నా ఫేస్ అలా అనిపిస్తుందేమో (నవ్వులు). అంటే వాళ్లక్కూడా తెలుసేమో ఈ అమ్మాయితో ఇవన్నీ వేస్ట్ అని! ఇండస్ట్రీలో హరీష్ శంకర్, రవితేజ, బీవీఎస్ రవి అందరూ నన్ను తులసి మొక్క అని ఏడిపిస్తుంటారు. మరి అలా ఉంటే డల్‌గా అనిపించదా? స్వాతి: ఊహూ... నేనొచ్చిన బ్యాగ్రౌండ్ వల్లేమో అంత అటెన్షన్ హ్యాండిల్ చేయలేను. ఒక బంగళా, కారు, కెమెరాలతో ప్రొటెక్షన్ ఇవన్నీ ఉన్నవాళ్లు హ్యాండిల్ చేయగలరేమో... కాని, నేను చాలా సింపుల్‌గా ఉంటాను! మీ ఉద్దేశంలో ప్రేమంటే..? స్వాతి: నాకు నిజంగా తెలీదు. ఎవరైనా చెబితే బాగుంటుంది. అలాగని ఎవరైనా నాకు తెలియజెప్పాలని అనుకోవడం లేదు. నా పెళ్లి మాత్రం తప్పకుండా ఎరేంజ్డ్ అయి ఉంటుంది. మీ వల్ల ఎవరైనా దేవదాసులయ్యారా? స్వాతి: ఎవరవుతారండీ... ఈ కాలంలో దేవదాసులు? మరీ అయితే ఓ 10రోజులకు అవుతారేమో! అయినా ఓ అమ్మాయి కోసం... ఫీలైపోయి, షేవ్ చేసుకోవడం మానేసి, బాగా తాగేసి ఆ ఫీలింగ్‌ను ఎంజాయ్ చేస్తుంటే ఏం బాగుంటుందండీ? పార్టీయింగ్‌కు దూరంగా ఉంటారెందుకు? స్వాతి: ఏదైనా రీజన్ ఉంటేనే వెళతానండీ! అయితే పార్టీయింగ్ నచ్చదని కాదు. కొన్నిసార్లు వెళ్లానండి. వెళ్లిన తర్వాత నాకేం అనిపించిందంటే... అక్కడికి ఒక్కొక్కరు ఒక్కో రీజన్‌తో వస్తారు. ఒక ఎజెండాతో వస్తారు. నాకేమో ‘నేనిక్కడ ఏం చేస్తా’ అనిపిస్తుంది. ఆల్సో... ఇది చాలా కాంపిటీటివ్ ఇండస్ట్రీ. ఉన్న ఫ్రెండ్షిప్లన్నీ వన్ టు వన్ ఉంటాయి. గ్రూప్‌లో ఉన్నప్పుడు ఏమౌతుందంటే... ఓ పది నిమిషాలు బాగుంటారు. ఓ ఇద్దరు అక్కడ నుంచి వెళ్లగానే ఇక వారి గురించి మాట్లాడతారన్నమాట. నే నైనా అక్కడ నుంచి వెళ్లగానే నా మీద కూడా టక్‌టక్‌మని కౌంటర్ పడిపోతుందన్నమాట. అది నాకు తెలుసు. అందుకే దూరంగా ఉంటాను. సినిమారంగానికి వచ్చి పదేళ్లవుతున్నా పెద్దగా రూమర్స్ లేవేంటి? స్వాతి: నేను చాలా బోరింగ్. కొంచెం ఎగ్జయిటింగ్‌గా ఉండేవాళ్ల మీద వస్తాయేమో రూమర్స్! అయినా అవి కూడా చిన్నా చితకా ఉన్నాయిలెండి. ఒక సినిమా హిట్టయిందనుకోండి. వచ్చేస్తాయిక. ఈ ఫీల్డ్‌లో తప్పదనుకుంటా! విక్రమ్ మీకు బాగా క్లోజ్ అని విన్నాం..? స్వాతి: అడిగారా... చెబుతాను! నిజానికి విక్రమ్ అందరితో క్లోజ్‌గా ఉంటాడు. నేషనల్ అవార్డ్ వచ్చినప్పుడు ‘కలర్స్’లో విక్రమ్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఓ నేషనల్ అవార్డ్ విన్నర్ అంటే ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటాడు? అయినా ఆయన ‘కలర్స్’తో చాలా ఇంప్రెస్డ్! అప్పటినుంచి నన్ను ‘తన ఫేవరెట్ మూవీ ప్రెజెంటర్’ అనేవాడు. ఎవరైనా అడిగితే ఆయన పబ్లిగ్గా చెప్పేవాడు... ‘స్వాతి అంటే ఇష్టం’ అని! అలా ఒక ఇమేజ్ వచ్చేసింది. ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ సినిమా అప్పుడు సెల్వరాఘవన్‌కు తనేమీ నన్ను సిఫారసు చేయలేదు. నన్ను తీసుకోవాలనుకున్నాక, ఆ విషయం విక్రమ్‌ని అడిగాడు అంతే! నిఖిల్‌తో కూడా మీకు ఏదో ఉందని టాక్... స్వాతి: అబ్బా! రెండు సినిమాలు కలిసి చేస్తే లింక్ పెట్టేస్తే ఎలా? అలా అయితే జైతో, ‘ఆమెన్’ హీరోతో కూడా రెండో సినిమా చేస్తున్నాను. మొత్తం 3 భాషల్లో ముగ్గురు హీరోలతో రెండో సినిమా చేస్తున్నాను. దానికేమంటారు? అలా చేస్తున్నానంటే దానికి కారణం ఒకటే... నేను నా పని చూసుకుంటాను. వాళ్లు వాళ్ల పని చూసుకుంటారు. అసలు అలాంటి ఎఫైర్లు ఉంటే రెండో సినిమా అవ్వదు. చాలా కాలిక్యులేషన్స్ ఉంటాయి! ఇప్పుడు సినిమా మేకర్స్ చాలా డెరైక్ట్‌గా కూడా చెప్తున్నారు. ‘‘మేం ఎందుకు నటిగా నీకు ప్రాధాన్యమిస్తామంటే నువ్వు నీ పని చూసుకుంటావ్’’ అని! ఎప్పుడైనా కొంచెం డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తేనే సంవత్సరాల తరబడి ఉంటుంది ఆ రిలేషన్షిప్. ఎక్కువ క్లోజ్ అయిపోతే కట్ అయిపోతుంది! ఇలాంటి విషయాల్లో ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఫీలవుతారా? స్వాతి: లేదండీ. నేనున్న ఫీల్డ్ అలాంటిది కదా. నేను కూడా రణబీర్‌కపూర్ గురించిన వార్తలు అవీ చదువుతాగా. అయితే నన్ను తిక్కగా అడిగితే సమాధానం అంతే తిక్కగా చెబుతాను. పద్ధతిగా అడిగితే బాగానే చెప్తాను! ఇంతకీ పెళ్లెప్పుడు... స్వాతి: ఇంకో రెండు మూడేళ్లలో ఉండొచ్చు... నాకు తెలీదండీ! చెప్పలేం కదా... ఇలాంటి విషయాల్లో. అయినా ఇప్పుడు నేను ‘పెళ్లి చేసుకుందాం’ అని ఆలోచించడంలేదు. ‘పెళ్లంటే ఏంటా?’ అని ఆలోచిస్తున్నాను. ఆ ఇన్స్టిట్యూషన్ నాకింకా అర్థం కాలేదు. అయితే ఆ వ్యవస్థను నేను నమ్ముతున్నానంటే అది కూడా నా పేరెంట్స్‌ని చూసి. లేదా మా ఫ్రెండ్స్ పేరెంట్స్. లేదా మా చిన్నాన్న, పిన్ని. లేకపోతే... నాకంతగా సరైన అభిప్రాయం లేదు. ఏదైనా ప్రతి పెళ్లీ డిఫరెంట్. కొన్ని పెళ్ళిళ్లు అరేంజ్మెంట్స్ వల్లో, డీల్స్, లవ్వూ, సోషల్ ఆబ్లిగేషన్... కారణాలతో జరిగినవి చూశాను. నా ఫ్రెండ్స్‌లో కొంతమంది పెళ్లిళ్లు వెరీ లక్కీ. కొంతమందివి ప్చ్... వాళ్ల లైఫ్ అంతే. ఏదైనా మంచి పార్ట్నర్ దొరకడం అనేదానికి మనం అదృష్టవంతులం అయి ఉండాలనేది నా ఫీలింగ్! వచ్చేవాడు ఎలా ఉండాలని..? స్వాతి: బాబోయ్... అలా అంటే చెప్పలేను. అస్సలు ఐడియా లేదు! సినీ పరిశ్రమలో అన్ని రకాల మనస్తత్వాలున్న మగవాళ్లని చూశాను. పెళ్లయ్యాక సినిమాలు చేయడం మానేస్తారా? స్వాతి: అది తెలీదు కానీ, కనీసం రెండేళ్లు ఇంటిపట్టునే ఉండిపోతాను. శుభ్రంగా ఇల్లంతా చూసుకుంటూ... వంట చేసుకుంటూ... ఈ ఇంటర్వ్యూ చదివితే ఈ ఒక్కదెబ్బకు మ్యారేజ్ ఆఫర్స్ గ్యారంటీ... స్వాతి: అహ్హహ్హ. కొన్ని సంవత్సరాలైనా నిజంగా అలా ఉండాలనుంది! - ఎస్.సత్యబాబు. ***************************** పుస్తకాలు చదువుతారా? స్వాతి: ఇంట్లో లైబ్రరీ ఉంది. సీరియస్ బుక్స్ ఉన్నాయి. ఇక షిడ్నీషెల్డన్ అవన్నీ జుజుబీస్. నేను ఆలోచించనక్కర్లేదు అన్నప్పుడు నమిలిపడేయాలి అనుకుంటే అవి చదువుతాను. రకరకాల బుక్స్ చదువుతాను. డిగ్రీ టైమ్‌లో నాకు తెలుగు ఉండేది కాదు. అయితే అష్టాచెమ్మా తర్వాత ఆర్టికల్స్ తెగవచ్చేసేవి. అవి చదవలేక ఫస్ట్రేషన్ వచ్చేసి తెలుగు నేర్చుకున్నా. తెలుగులో బుజ్జిబుజ్జి కధలు చదువుతా. మేకా ఆవు లాంటివి. ఇప్పుడు నా గురించి సాక్షిలో ఏమైనా వస్తే పొద్దున్నే లేచి నిదానంగా చదువుతానన్నమాట! రెమ్యునరేషన్లో నిర్ణయం ఎవరిది? స్వాతి: ఆ డిస్కషన్ ఎప్పుడూ రాలేదు. నా సినిమాలకు రీజనబుల్ ప్రొడ్యూసర్లే ఉన్నారు. అమ్మది కొంచెం జాలిగుండె. అమ్మ వల్లే సినిమాల్లో ట్రీట్మెంట్ బాగుంటుంది. తన వల్లే నన్ను బాగా చూసుకుంటారు.అమ్మ ఏమంటుందంటే... ‘ఎక్కువ అడిగేసి పీడించేస్తే... అంత ఇచ్చాం అనే ఫీలింగ్ వాళ్లకి సినిమా పూర్తయ్యేదాకా ఉంటుంది’ అంటుంది. ‘వాళ్లు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ’ అంటుంది. ఈ విషయంలో అమ్మకంటే నేనే కొంచెం బెటర్. కానీ దీని గురించి ఎప్పుడూ అమ్మతో వాదించను. (నవ్వుతూ) పొద్దున్నే టైమ్‌కి లేవడం అనే విషయంలోనే ఎప్పుడూ అమ్మతో గొడవ. మీరు రాస్తారని... బ్లాగ్ ఉంది కానీ అడ్రస్ చెప్పరని..! స్వాతి: ఏదో రాస్తాలెండి. కవితలూ అవీ. కానీ అవి క్లోజ్ ఫ్రెండ్స్ చదువుకోవడానికి మాత్రమే! డిఫరెంట్ ఇష్యూస్ మీద రాస్తూంటాను. అయితే అవేవో మరీ ఢిల్లీరేప్ అలాంటివి కాదు. పూర్తిగా పర్సనల్. నాకు సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా. నా బ్లాగ్ కూడా అంతే. పూర్తిగా పర్సనల్! ఎక్సర్సైజ్, జిమ్ లాంటివి..? స్వాతి: వర్కవుట్ అనేది నాకు డీస్ట్రెస్ ఏజెంట్! అయితే గోల్కొండ, అప్పల్రాజు సమయంలో మరీ ఎక్కువ చేయడం వల్ల బాగా సన్నగా అయిపోయాను. బాగా అనిపించలేదు. అందుకే ఎంత తినాలో అంత తిని, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో అంత ఇంట్లోనే చేసుకుంటాను అని తీర్మానించుకున్నా. ఇప్పుడు జస్ట్ మోడరేట్‌గా చేస్తున్నాను. ***************************** ప్రతి ఏడాది ఎగ్జిబిషన్‌కు వెళ్లడం, జెయింట్‌వీల్ ఎక్కడం, ఎర్రరంగులోని చికెన్‌ని తినడం.. ఇవన్నీ పిచ్చ ఇష్టం. పబ్లిక్ గుర్తుపట్టి విష్ చేస్తుంటారు. అయితే ఫ్యామిలీస్ చాలా చక్కగా మాట్లాడతారు. కొందరేమో ‘ఏ క్కలర్స్’ అని గట్టిగా అనేసి వెళ్లిపోతారు. నాకు ‘కలర్స్ స్వాతి’ అంటే చిరాకు అనిపించడానికి అదీ ఒక కారణమేమో... నాకు వినిపించేటట్టు కావాలనే అని, నన్ను చూడకుండా వెళ్లిపోయేవాళ్లని చూస్తే నాకు తిక్కరేగిపోతుంటుంది. నాక్కూడా ఒక ఫ్యాంటసీ ఉంది... రేయ్ అంటూ ఫైట్, ఏ ఢిష్కే అని చేయాలని! ‘రేయ్ తియ్రా బండి’ అంటే టయోటాలన్నీ, సుమోలన్నీ గాల్లోకి ఎగిరి... ఐదేళ్ల క్రితం మాకు వేగనార్ కారుండేది. శ్రీనగర్‌కాలనీలో రోడ్లో డ్రైవ్ చేస్తుంటే ఎవడో ట్రాలీ లాంటిదేసుకుని వచ్చి థప్మని గుద్దాడు. రిపేర్‌కి రూ.20వేలు ఖర్చయింది. అప్పటి నుంచి కార్ డ్రైవ్ చేయడం అంటే భయం! ‘బంగారు కోడిపెట్ట’ కోసం మారుతి డ్రైవ్ చేశాను. 3 కెమెరాలు పెట్టారు. ఎంత భయంగా చేశానో చెప్పలేను. ఇప్పటికీ కారులో కూర్చుంటే ఏదైనా కారు పక్కనుంచి స్పీడ్‌గా వచ్చేస్తుంటే కళ్లు మూసేసుకుంటా. అంత భయం డ్రైవింగ్ అంటే! ఫేస్బుక్లో ఎకౌంట్ నాలుగేళ్ల క్రితం క్లోజ్ చేశాను. ఇప్పుడు లేదు. ఇక ట్విట్టర్ వాడే దాకా బాయ్స్‌లో అంత పైత్యం ఉందనేది నాకు తెలీలేదు. ఇంత ఫస్ట్రేటెడ్‌గా ఉన్నారా మన జనరేషన్ అనుకున్నా. రండి నన్ను ఎటాక్ చేయండి అని చెప్పి వాళ్లకి నేను ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది కదా... అని ట్వీట్స్ మానేశా. అందులో ఎవరైనా ఏమైనా రాయచ్చు కదా. ‘ఎవరో నలుగురైదుగురు అంటే ట్విట్టర్ నుంచి వదిలేయడం ఏమిటీ అని’ కొందరన్నారు. అయితే ప్రతిరోజూ రాయడానికి ఏం ఉంటుంది నాకు? షారూఖ్‌ఖాన్ అయితే దలైలామాను కలిశా అనో ఇంకోటో రాసుకోవచ్చు. నేనేం రాయాలి? మాపక్కింటివాళ్లని కలిశా అనా? ప్రతిరోజూ ఇంట్రెస్టింగ్గా ఏమిరాయగలను? ***************************** ఎవరితోనైనా ఒక్కసారి తేడా వస్తే రిలేషన్ కట్ చేసుకునే టైప్ కాదు నేను. ఒక్కటే పట్టుకుని వేలాడకూడదు. వాళ్లకి కూడా మారడానికి, ఎదగడానికి అవకాశం ఇవ్వాలి కదా! చారిటీ కోసం నా స్టేటస్ దానికి సరిపోదు. ఎవరికైనా పనికొచ్చేది చేయడం అంత సులభం కాదు. నంది అవార్డ్ వచ్చాక చాలా మంది విచిత్రంగా రియాక్ట్ అయ్యారు. ‘‘నీకు అవార్డ్ వచ్చిందని తెలుసు కాని...’’ అంటూ. అవార్డ్ అనేది వ్యక్తుల మధ్య తప్పకుండా గ్యాప్ పెంచుతుంది. అవార్డ్స్ రావడమనేది నిజంగా ఒక లాటరీ టిక్కెట్. మీరు బాగా చేస్తే అవార్డ్ రాదు. తల రాత అంతే! నాకివన్నీ ఓవర్‌టైమ్ తెలిసింది. నాకు ఫిల్మ్‌ఫేర్ వచ్చిందనేది ఆ అవార్డ్నాకు వచ్చినప్పుడు సింక్ అవలేదు. మూడేళ్ల తర్వాత సింక్ అయింది! ఒక పర్టిక్యులర్ యాక్టర్‌కి వస్తుందని అనుకున్నా. అయితే రాలేదు. కాని రాకుండా వేరే ఎవరికో వచ్చింది. అప్పుడర్థమైంది ఇంత కష్టమా అని! దాని విలువ మూడేళ్ల తర్వాత తెలిసిందన్నమాట!