కలర్స్‌ స్వాతి పెళ్లి పీటలెక్కనుందా?

Is Colors Swathi Getting Marriage - Sakshi

కలర్స్‌ స్వాతి ఈ పేరు అందరికీ సుపరిచితమే. బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చిన కలర్స్‌ స్వాతి తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. కలర్స్‌ స్వాతికి సంబంధించిన ఓ న్యూస్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. 

కలర్స్‌ స్వాతి త్వరలో పెళ్లి పీటలెక్కనుందని, తాను చేసుకోబోయే భర్త పేరు వికాస్‌ అంటూ.. అతనొక పైలట్‌ అని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కలర్‌ స్వాతి ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. అష్టాచమ్మా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, గోల్కొండ హైస్కూల్‌, స్వామిరారా సినిమాలతో గుర్తింపును పొందారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top