ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ | colors swathi new movie with vijay sethupathi | Sakshi
Sakshi News home page

ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ

Feb 21 2014 12:04 AM | Updated on Sep 2 2017 3:55 AM

ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ

ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ

విజయ్ సేతుపతి, ‘కలర్స్’స్వాతి, అశ్విన్ ముఖ్య తారలుగా... గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఇదక్కు తానా ఆశైపట్టాయ్ బాలకుమార’.

 విజయ్ సేతుపతి, ‘కలర్స్’స్వాతి, అశ్విన్ ముఖ్య తారలుగా... గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘ఇదక్కు తానా ఆశైపట్టాయ్ బాలకుమార’. ఈ చిత్రం ‘ఇదేగా ఆశపడ్డావ్ బాల-కృష్ణ’ పేరుతో తెలుగులో అనువాదమవుతోంది. సుజన్, సమన్యరెడ్డి ఈ అను వాద చిత్రానికి నిర్మాతలు. ఈ చిత్రం విశేషాలను నిర్మాతలు చెబుతూ -‘‘పూర్తి వాణిజ్య అంశాలతో తెరకెక్కిన వినోదాత్మక చిత్రమిది. వసూళ్ల పరంగా చిన్న సినిమాల్లో రికార్డ్ సృష్టించిందీ సినిమా. స్వాతి, విజయ్ సేతుపతిల నటన ఆకట్టుకునే విధంగా ఉంటుంది. తమిళంలోలాగే తెలుగులో కూడా విజయం సాధిస్తుందని మా నమ్మకం.
 
  మార్చి 4న పాటల్ని విడుదల చేస్తున్నాం’’ అని తెలిపారు. నందిత, పశుపతి తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: రాజశేఖరరెడ్డి, సంగీతం: సిద్దార్థ్ విపిన్, సమర్పణ: సప్తవర్ణ క్రియేషన్స్, కాఫీస్ సినిమా ప్రై.లిమిటెడ్.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement