'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్‌ బీ కామెంట్స్ వైరల్! | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: చెప్పు వదిలేస్తే ఇంత వైరలవుతుందా?.. పుష్పపై బిగ్ బీ కామెంట్స్!

Published Wed, Nov 8 2023 4:25 PM

Amitabh Bachchan praises Allu Arjun dance in Pushpa Srivalli song  - Sakshi

పుష్ప సినిమా పేరు వింటే అందరికీ గుర్తొచ్చేది ఆ డైలాగ్ ఒక్కటే. అదే గడ్డం కింద చేయి పెట్టి తగ్గేదేలే అని చెప్పడం. ఈ డైలాగ్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎక్కువసార్లు ప్రదర్శించి ఉంటాడు. అంతలా ఫేమస్ అయింది పుష్ప సినిమా డైలాగ్. కానీ అదే రేంజ్‌లో వైరలైన మరో సీన్ కూడా ఈ చిత్రంలో ఒకటి ఉంది. ఇప్పుడు దానిపైనే మన బిగ్ బీ అమితాబ్ క్రేజీ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందామా?

ఈ సినిమాలోని శ్రీవల్లి సాంగ్‌కు స్టెప్పులు వేయని వారు ఉండరు. అంతలా ఫేమస్ అయిన ఈ పాటకు ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ముగ్ధులైపోయారు. ఈ పాటలోని అల్లు అర్జున్ డ్యాన్స్‌కు ఫిదా అయ్యారు. మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌లో చెప్పును వదిలేసి డ్యాన్స్ వేసే స్టెప్పును చాలామంది ట్రై చేశారు. తాజాగా ఆ సాంగ్‌ గురించే అమితాబ్ ప్రశ్న వేశారు. ఈ సందర్బంగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ పుష్పపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి 15వ సీజన్‌కు హౌస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ పుష్ప సినిమాకు సంబంధించిన ఓ ప్రశ్న వేశాడు అమితాబ్‌.  ఈ సందర్భంగా పుష్ప చిత్రం గురించి, అందులోని శ్రీవల్లీ పాటకు బన్నీ వేసిన స్టెప్పు గురించి  మాట్లాడుతూ.. 'పుష్ప మూవీ నిజంగా అద్భుతం. ఇంకా శ్రీవల్లి సాంగ్ ఎంత ఫేమస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. హీరో డ్యాన్స్ చేస్తూ చెప్పు వదిలేసినా సీన్ కూడా.. ఇంతలా వైరల్ కావడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి చూశా. ఆ స్టెప్పును చాలా మంది అనుకరించారు. ఎక్కడ పడితే అక్కడ ఆ స్టెప్‌ వేసి.. చెప్పులు  వదిలేసి మరీ వేసుకునే వారు' అంటూ అమితాబ్ నవ్వారు. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2021లో రిలీజై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలోనే పుష్ప-2 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది.

Advertisement
Advertisement