బన్నీ వాసు ఇంటికి వెళ్లిన అల్లు అర్జున్‌ | Allu Arjun Visits Bunny Vasu Home In Palakollu And Condolences His Family | Sakshi
Sakshi News home page

బన్నీ వాసును పరామర్శించిన అల్లు అర్జున్‌

Dec 14 2020 6:27 PM | Updated on Dec 14 2020 9:08 PM

Allu Arjun Visits Bunny Vasu Home In Palakollu And Condolences His Family - Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: హీరో అల్లు అర్జున్ నిర్మాత బన్నీ వాసును ‌పరామర్శించారు. ఇటీవల వాసు సోదరుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిహారిక వివాహం కావడంతో జోధ్‌పూర్‌లో ఉన్న అల్లు అర్జున్‌ ఇటీవల హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఈ క్రమంలో బన్నీ, ఆయన సోదరుడు అల్లు శీరిష్‌, డైరెక్టర్‌ సుకుమార్‌లు సోమవారం బన్నీ వాసు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా పాలకోల్లులోని ఆయన ఇంటికి వెళ్లారు. నిర్మాత బన్ని వాసును, ఆయన కటుంబసభ్యులను పరామర్శించారు. వాసు సోదరుని మృతి పట్ల సంతాపం తెలిపారు. (చదవండి: నిర్మాత బన్నీ వాసు ఇంట్లో విషాదం)

కొంతకాలంగా కిడ్ని సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడ్డ బన్నీ వాసు సోదరుడు సురేష్‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత శుక్రవారం కన్నుమూశారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం బన్నీ వాసు నాగార్జున తనయుడు అఖిల్‌ హీరోగా మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ సినిమాను నిర్మిస్తున్నారు. మొదట గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో పని చేసిన బన్నీ వాసు ఆ తర్వాత సహ నిర్మాతగా, అనంతరం నిర్మాతగా మారారు. ఈ క్రమంలో పలు చిత్రాలను నిర్మించిన ఆయన అల్లు అర్జున్‌ తాజా చిత్రం ‘పుష్ప’లో నటిస్తున్నారు. (చదవండి: నిహారిక పెళ్లిలో వీళ్లదే స్పెషల్‌ అట్రాక్షన్‌..)

Advertisement
 
Advertisement
Advertisement