స్టయిలిష్‌‌ కాస్టూమ్స్‌తో వేడుకల్లో సందడి

Ram Charan, And Allu Arjun Couple Grab Attention At Niharika Marriage - Sakshi

మెగా డాటర్‌ నిహారిక పెళ్లివేడుక సందర్భంగా కొణిదెల కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇప్పటికే ఇప్పటికే కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్‌పూర్‌కు చేరుకొని ప్రీవెడ్డింగ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్న పవన్‌ కల్యాణ్‌ కూడా కొడుకు అకిరా నందన్‌తో కలిసి ఉదయ్‌పూర్‌ చేరుకున్నారు. నిహారిక పెళ్లి వేడుకలో మెగా హీరోలు అందరూ సందడి చేస్తున్నారు. అయితే నిహారిక పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌, అల్లుఅర్జున్‌ దంపతుల కాస్ట్యూమ్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిన్న రాత్రి జరిగిన సంగీత్‌ వేడుకల్లో రామ్‌చరణ్‌ వైట్‌ కలర్‌ సూట్‌, ట్రౌజర్‌ ధరించగా, దీనికి మ్యాచింగ్‌లా ఉపాసన చిక్‌ వైట్‌ ఫుల్‌ స్లీవ్‌టాప్‌, పింక్‌ లెహంగాను ధరించి ఆకట్టుంది. మరోవైపు స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ వైట్‌ అండ్‌ పింక్‌ కుర్తా- పైజామా ధరించగా, స్నేహ ఆఫ్‌- ఫోల్డర్‌ టాప్‌, లెహంగాను ధరించింది. ఇందుకు మ్యాచింగ్‌ డిజైనర్‌ వ్యాలెట్‌తో ఎంతో స్టయిలిష్‌గా కనిపించింది. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. (నిహారికకు మెగాస్టార్ స్పెష‌ల్ గిఫ్ట్‌)

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బన్నీ, చరణ్‌ దంపతులు నిహారిక పెళ్లి వేడుకల్లో స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలాచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నిహారిక పెళ్లికి ఎలాంటి డిజైనర్‌ దుస్తులను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.  ఈ రోజు రాత్రి 7.15 నిమిషాలకు గుంటూరు ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. మరికొద్దిసేపట్లో మిస్‌ నిహారిక జొన్నలగడ్డ నిహారికగా మారనున్నారు. రాజస్తాన్‌ ఉదయపూర్‌లోగల ఉదయ్ విలాస్‌ ఈ వేడుకకు వేదిక కానుంది. ఇప్పటికే  ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ అంగరంగ వైభవం‍గా జరిగాయి.  పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా  మంగళవారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లో మెగాస్టార్‌ బ్లాక్‌బస్టర్‌ ‘ఘరానా మొగుడు’ చిత్రంలోని ‘బంగారు కోడి పెట్ట’ పాటకు చిరు, అల్లు అర్జున్‌ల స్టెప్పులు వేశారు. అదే పాటకు చిరు భార్య సురేఖ, అల్లు అరవింద్‌ కూడా ఉత్సాహంగా స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (నిహారిక హల్దీ వేడుక: వీడియో వైరల్‌ )

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top