నిహారికకు మెగాస్టార్ స్పెష‌ల్ గిఫ్ట్‌

Chiranjeevi Costly Gift To Niharika Konidela - Sakshi

మెగా వారింట పెళ్లి సంద‌డి షురూ అయింది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు గారాల‌ప‌ట్టి నిహారిక ఓ ఇంటికి కోడ‌లు కాబోతోంది. బుధ‌వారం(ఈ నెల 9న‌) జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య‌తో ఆమె మూడు ముళ్లు వేయించుకోనున్నారు. ఈ అపూర్వ ఘ‌ట్టానికి రాజ‌స్తాన్‌లోని ఉద‌య్‌పూర్ ప్యాలెస్ అతి సుంద‌రంగా ముస్తాబ‌వుతోంది. మెగా కుటుంబ స‌భ్యులంతా సోమ‌వార‌మే రాజ‌స్తాన్ చేరుకున్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం మంగ‌ళ‌వారం సాయంత్రం పెళ్లి వేదిక‌కు చేరుకున్నారు. (చ‌ద‌వండి: నిహారిక సంగీత్‌ వేడుక.. డ్యాన్స్‌ ఇరగదీశారు)

మ‌రోవైపు ఇప్ప‌టికే ప్రీవెడ్డింగ్ వేడుక‌లు జోరందుకున్నాయి. కాబోయే భ‌ర్త‌తో క‌లిసి నిహారిక సంగీత్‌లో ఆనందంతో చిందులేస్తోంది. ఈ జంట‌ను చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌డం లేద‌ని మెగా అభిమానులు సంతోషిస్తున్నారు. ఇదిలా వుంటే త‌న పిల్ల‌ల‌తోపాటు, త‌మ్ముడు, చెల్లెల పిల్ల‌ల‌ను కూడా స‌మానంగా చూసే చిరంజీవి  కొత్త‌పెళ్లి కూతురు కోసం ఓ స్పెష‌ల్ గిఫ్ట్ తీసుకున్నార‌ట‌. పెళ్లికి ముందే ఆ ఖ‌రీదైన‌ బ‌హుమ‌తిని ఇచ్చేసిన‌ట్లు స‌మాచారం. రెండు కోట్ల రూపాయ‌లు విలువ చేసే ప్ర‌త్యేక‌ ఆభ‌ర‌ణాన్ని భార్య సురేఖ‌తో క‌లిసి నిహారిక‌కు అందించార‌ట‌. అలా నిహారిక మీదున్న కొండంత ప్రేమ‌ని చిరు కానుక‌తో చాటుకున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top