Niharika Marriage: Niharika Sangeeth Event At Udaipur | డ్యాన్స్‌ ఇరగదీశారు - Sakshi
Sakshi News home page

నిహారిక సంగీత్‌ వేడుక.. డ్యాన్స్‌ ఇరగదీశారు

Dec 8 2020 10:32 AM | Updated on Dec 8 2020 11:22 AM

Viral: Niharika Sangeeth Event At Udaipur - Sakshi

మెగా ఫ్యామిలిలో పెళ్లి సంబరాలు అంబరాన్నంటాయి. కొణిదెల నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక ఈ నెల 9న జొన్నలగడ్డ చైతన్యను మనువాడనున్నారు. రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ ఈ వేడుకకు సందరంగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. ఒక్క పవన్‌ కల్యాణ్‌ మినహా మెగా కుటుంబ సభ్యులంతా సోమవారమే రాజస్తాన్‌ చేరుకున్నారు. ఇక ఈ రోజు పవన్‌ వేడుకలకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్‌ తన స్టైలిష్‌ లుక్‌లో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. చదవండి: నిహారిక పెళ్లి వేడుకల్లో చెర్రీ, బన్నీ..


పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి రాజస్తాన్‌లో సంగీత్ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో కొణిదెల, అల్లు వారి ఫ్యామిలీ స‌భ్యులు అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ డ్యాన్స్‌ చేశారు. ముఖ్యంగా నిహారిక, చైతన్యతో కలిసి మెగాస్టార్‌ పాటకు డ్యాన్స్‌‌ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇక రాజ‌స్థాన్‌లోని హోట‌ల్‌లో దిగిన సమయంలో హారిక‌, చైతూల‌కి అక్క‌డి బ్యాండ్ మేళం బృందం ఘ‌న స్వాగతం ప‌లకగా జోష్‌లో నిహరిక తన కాబోయే భర్త చైత‌న్య‌తో క‌లిసి చిందులేశారు. చదవండి: చిరుతో నిహారిక సెల్ఫీ.. నాగబాబు భావోద్వేగం
 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement
 
Advertisement
Advertisement