Pushpa 2 Teaser Update: అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. పుష్ప-2 టీజర్‌ వచ్చేస్తోంది

Allu Arjun Starrer Pushpa 2 Teaser Will Be Out On This Date - Sakshi

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప సినిమా క్రేజ్‌ అంతా ఇంతా కాదు. టాలీవుడ్‌లోనే కాదు, పాన్‌ ఇండియా రేంజ్‌లో పుష్ప రీసౌండ్‌ వినిపించింది. ఈ చిత్రంలోని పాటలు, డైలాగులు సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. దీంతో పుష్ప-2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేయలేదు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌ బర్త్‌డే రోజున ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్‌ ప్లాన్‌ చేస్తున్నారట సుకుమార్‌. ఏప్రిల్‌8న పుష్ప-2 ఫస్ట్‌లుక్‌తో పాటు, దాదాపు మూడు నిమిషాల నిడివి ఉండేలా టీజర్‌ని ఆడియెన్స్‌ ముందుకు తీసుకురానున్నారట. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పుష్ప సీక్వెల్‌లో రష్మిక హీరోయిన్‌గా నటించనుండగా, సాయిపల్లవి కీలక పాత్రలో కనిపించనుందట. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top