బుల్లితెరపై పుష్పరాజ్‌.. ఏ ఛానెల్‌.. ఎన్ని గంటలకో తెలుసా? | Allu Arjun's Pushpa 2 Movie Will Ready To Telecast On This TV Channel | Sakshi
Sakshi News home page

Pushpa 2 Movie: బుల్లితెరపై పుష్పరాజ్‌.. ఏ ఛానెల్‌లో చూడాలంటే?

Apr 7 2025 7:56 PM | Updated on Apr 7 2025 8:02 PM

Allu Arjun's Pushpa 2 Movie Will Ready To Telecast On This TV Channel

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ 'పుష్ప- 2' మూవీతో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టించాడు. రిలీజైన కొద్ది రోజుల్లోనే రికార్డులన్నీ రప్పా రప్పా అంటూ తుడిచి పెట్టేశాడు. గతేడాది డిసెంబర్‌ 5న రిలీజైన ఈ చిత్రం దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో సౌత్‌ భాషల్లోనూ అందుబాటులో ఉంది.

తాజాగా ఈ మూవీ బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు సిద్ధమైపోయింది. ఈ విషయాన్ని హక్కులు దక్కించుకున్న ఛానెల్ రివీల్ చేసింది. స్టార్‌ మాలో ఏప్రిల్ 13న ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రసారం కానుందని ఆ ఛానెల్ యాజమాన్యం ప్రకటించింది. దీంతో బుల్లితెరపై కూడా పుష్పరాజ్‌ సందడి చూసే అవకాశం రానుంది. 

కాగా..ఇక పుష్ప 2 విషయానికి వస్తే ఇది 2021లో వచ్చిన పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కింది. అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించారు. సుకుమార్‌ దర్శకత్వం వహించగా దేవి శ్రీప్రసాద్‌ సంగీతం అందించారు. ఫహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ కీలకపాత్రల్లో నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించారు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement