'ప్రతి అధికారి సమాధానం చెప్పాలి'.. ఆసక్తిగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్ | Sakshi
Sakshi News home page

Itlu Maredumilli Prajaneekam: 'ఈ ఎలక్షన్ కోసం స్టేట్ మొత్తం ఎదురుచూస్తోంది'.. 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ట్రైలర్ రిలీజ్

Published Sat, Nov 12 2022 8:59 PM

Allari Naresh Movie Itlu Maredumilli Prajaneekam Trailer Out Today - Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కించిన చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. 

(చదవండి: 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'.. కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది)

ట్రైలర్ విషయానికొస్తే.. 'ఇంకో నాలుగు రోజుల్లో ఎలక్షన్స్ మీ ఊర్లో జరగబోతున్నాయి' అనే అల్లరి నరేశ్ డైలాగ్‌తో ప్రారంభమైంది.  ట్రైలర్ చూస్తే పూర్తి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రంగా కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌కు ఫ్య్సాన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  ఎన్నికల నిర్వహణకు ఓ మారుమూల పల్లెలో గిరిజన ప్రజలు నివసించే మారేడుమిల్లి గ్రామానికి వెళ్లే అధికారి పాత్రలో 'అల్లరి నరేశ్ కనిపిస్తారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్‌ 25న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement